Just EntertainmentLatest News

Deepika Padukone:దీప్-వీర్ గుడ్ న్యూస్..దువా పోస్ట్‌తో ఆ రూమర్లకు చెక్

Deepika Padukone: తమ ముద్దుల కూతురు దువా పదుకొణె సింగ్ చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌ను ఉంచి, దానిలో పాజిటివ్ రిజల్ట్ కనిపిస్తున్న ఫోటోను దీపికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Deepika Padukone

బాలీవుడ్ వెండితెరపైనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ మోస్ట్ అడోరబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న రణవీర్ సింగ్ , దీపికా పదుకొణె తమ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు. మొదటి బిడ్డ దువా పుట్టిన కొన్నాళ్లకే, ఈ జంట ఇప్పుడు రెండోసారి పేరెంట్స్ కాబోతున్నారు.

ఈ విషయాన్ని దీపికా సోషల్ మీడియా వేదికగా చాలా డిఫరెంట్‌గా ప్రకటించడంతో.. బాలీవుడ్ అంతటా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

రీసెంట్‌గా రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ మూవీ సక్సెస్‌పై దీపికా పదుకొణె (Deepika Padukone)రియాక్టవలేదని, భర్తను అభినందించలేదని సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వచ్చాయి.

ఏకంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, విడిపోతున్నారని కూడా బాలీవుడ్ మీడియాలో కొన్ని రూమర్లు షికారు చేశాయి. అయితే వాటన్నిటికి కూడా ఈ ప్రెగ్నెన్సీ ప్రకటనతో చెక్ పడింది. తాము ఎంత అన్యోన్యంగా ఉన్నామో చెప్పకనే చెబుతూ, దీపికా తన ప్రెగ్నెన్సీ వార్తను చెప్పింది.

తాజాగా తమ ముద్దుల కూతురు దువా పదుకొణె సింగ్ చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌ను ఉంచి, దానిలో పాజిటివ్ రిజల్ట్ కనిపిస్తున్న ఫోటోను దీపికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తమ కుటుంబంలోకి మరో కొత్త వ్యక్తి రాబోతోందని తెలియజేయడంతో ఫ్యాన్స్, సెలబ్రిటీలు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇటలీలో 2018లో ఘనంగా మ్యారేజ్ చేసుకున్న ఈ జంటకు 2024 సెప్టెంబర్ 8న దువా జన్మించింది. ఇప్పుడు దువాకు తోడుగా మరో చిన్నారి రాబోతుండటంతో అటు పదుకొణె కుటుంబంలో, ఇటు సింగ్ ఫ్యామిలీలో పండుగ వాతావరణం నెలకొంది.

Deepika Padukone
Deepika Padukone

కెరీర్ పరంగా కూడా దీప్-వీర్ జంట ఇప్పుడు టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 మూవీ మార్చి 19న విడుదలై బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేసిందన్న విషయం తెలిసిందే.

ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏకంగా 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక రికార్డును క్రియేట్ చేసింది. ఇక దీపికా పదుకొణె( Deepika Padukone) విషయానికి వస్తే, ఆమె వరుస పాన్ ఇండియా మూవీలతో బిజీగా ఉంది. షారుఖ్ ఖాన్‌తో కలిసి కింగ్ మూవీలో నటిస్తుండటంతో పాటు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ మూవీ రాకాలోనూ హీరోయిన్‌గా చేస్తోంది.

మొత్తంగా ఒకవైపు కెరీర్ పరంగా దూసుకుపోతూ, మరోవైపు పర్సనల్ లైఫ్‌లో రెండో బిడ్డకు స్వాగతం పలుకుతూ.. దీపికా-రణవీర్ దంపతులు తమ జీవితంలో సంతోషకరమైన స్టేజ్‌ను అనుభవిస్తున్నారు.

Akshaya Tritiya:అక్షయ తృతీయ వేళ ఆకాశన్నంటుతున్న పసిడి, వెండి ధరలు

Related Articles

Back to top button