Kadapa Independent MPTC Candidate : కడప ఎన్నికల్లో అభ్యర్థికి ఎదురైన విచిత్ర పరిస్థితి.. సినిమాలో కనిపించే రియల్ సీన్..
Kadapa Independent MPTC Candidate : ఏపీ పరిషత్ పోరులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కడప జిల్లాలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి దిగిన ఓ మహిళకు కేవలం ఒక్కటే ఒక్క ఓటు రావడంతో అంతా అవాక్కవుతున్నారు.
Kadapa Independent MPTC Candidate
సినిమాల్లో కామెడీ హీరోయో, క్యారెక్టర్ ఆర్టిస్టో పాలిటిక్స్‌లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే.. కనీసం సొంత కుటుంబ సభ్యుల ఓట్లు కూడా పడక జీరో వోట్లు వచ్చిన కామెడీ సీన్లను చాలానే చూశాం. థియేటర్లలో వాటిని చూసి నవ్వుకుంటాం కూడా. కానీ, అలాంటి సీన్ రియల్ లైఫ్‌లో జరిగితే ఎలా ఉంటుంది?
అచ్చం మూవీని తలపించేలా ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు అలాంటి ఘటనే వెలుగు చూసింది. ఎన్నికల్లో పోటీ చేసిన ఓ అభ్యర్థికి కేవలం ఒకే ఒక్క ఓటు రావడంతో ఇటు గ్రామస్థులు, అటు సోషల్ మీడియా జనాలు నోరెళ్లబెడుతున్నారు. అసలు ఆ అభ్యర్థి ఇంట్లో వాళ్లెవరూ ఓటేయలేదా? కేవలం తన ఓటు మాత్రమే తాను వేసుకున్నారా అనే ఇంట్రస్టింగ్ చర్చ జరుగుతోంది
నిజానికి రాజకీయాలలో గెలుపోటములనేవి సర్వసాధారణం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓడిపోయిన వాళ్లూ ఉంటారు. రూపాయి ఖర్చు పెట్టకపోయినా సింపుల్‌గా గెలిచిన వాళ్లూ ఉంటారు. కానీ ఎలక్షన్స్‌లో నిలబడి నామినేషన్ వేసి, ప్రచారం చేసి.. కౌంటింగ్ రోజు ఫలితాలు చూసుకుంటే ఎవరికైనా టెన్షన్ ఉంటుంది. సరిగ్గా అలాంటి షాకింగ్ పరిస్థితే కడప జిల్లాలో ఒక అభ్యర్థికి ఎదురైంది. సినిమాలలో తప్ప ఇలాంటి సీన్ నిజ జీవితంలో జరగదని ఫిక్స్ అయిన వారంతా ఆ అభ్యర్థికి పడిన ఓట్లు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
వైఎస్సార్ కడప జిల్లా గోపవరం మండలంలోని బ్రాహ్మణపల్లి ఎంపీటీసి స్థానానికి(Kadapa Independent MPTC Candidate)ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పొలిటికల్ పార్టీ అయిన టీడీపీ అభ్యర్థి స్రవంతి ఏకంగా 1,508 ఓట్లతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆమె ప్రత్యర్థి అయిన వైసీపీ కేండిడేట్ వెంకటసుబ్బమ్మ 1,037 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. చివరకు నోటాకు కూడా ఏకంగా 27 ఓట్లు పడ్డాయి. కానీ ఇదే బరిలో ఇండిపెండెండ్ అభ్యర్థిగా(Kadapa Independent MPTC Candidate )పోటీ చేసిన చడా సువర్ణకు మాత్రం ఒకటే ఓటు రావడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

ఎన్నికల్లో పోటీ చేసే ఏ అభ్యర్థికి అయినా సొంత కుటుంబ సభ్యులు, రక్తసంబంధీకులు, పక్కనే ఉండే స్నేహితుల ఓట్లు అయినా పడటం కామన్. మరి ఇంట్లో వాళ్లు, భర్త, బంధువుల ఓట్లు ఎక్కడికి పోయాయన్న చర్చ జరుగుతుంది. మొత్తంగా ఈ అరుదైన రికార్డు చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.
Boredom : ఊరికే ఉండటం వేస్ట్ కానే కాదు.. బ్రెయిన్‌ను నిత్యం బిజీగా ఉంచితే ఏం జరుగుతుంది?





