Just TelanganaLatest News

Winter Weather : మొదలైన చలి కాలం..ఉదయం పొగమంచు,రాత్రి వేళల్లో చలిగాలులు..

Winter Weather : తెలంగాణలో ఇప్పుడిప్పుడే చలి పుంజుకుంటోంది. హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, తాజా వాతావరణ పరిస్థితుల వివరాలు ఎలా ఉన్నాయి?

Winter Weather

తెలుగు రాష్ట్రాల్లో ఎల్‌నినో ప్రభావంతో ఎప్పుడూ లేని విధంగా వాతావరణం సరికొత్త టర్న్ తీసుకుంటోంది. ఈ రెయినీ సీజన్‌లోనూ వర్షాలు పెద్దగా కురవలేదు. అలాగే వింటర్ సీజన్‌లో పెద్దగా చలి ప్రభావం కూడా ఎక్కడా కనిపించలేదు. కానీ ఇప్పుడిప్పుడే సీన్ మెల్లమెల్లగా మారిపోతోంది.

నవంబర్ నెల ఎంట్రీ ఇవ్వడంతోనే శీతాకాలపు అసలు(Winter Weather) రూపం మెల్లగా బయటపడుతోంది. ఉదయం, రాత్రి సమయాల్లో చలిగాలులు వీస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా వేగంగా పడిపోతున్నాయి.

ప్రస్తుతం సిటీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెల్లవారుజాము సమయంలో రాజేంద్రనగర్, శంషాబాద్, మేడ్చల్, ఘట్‌కేసర్ వంటి శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఉదయం 8 గంటల వరకు చలి తీవ్రత బాగానే ఉంటోంది. పగటి పూట ఎండ కాస్త మోస్తరు గానే ఉన్నా.. సాయంత్రం ఐదున్నర దాటిందంటే చాలు చల్లని ఈదురుగాలులు ఊపందుకుంటున్నాయి.

ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలలోని పరిస్థితి అయితే వేరే లెవెల్‌లో ఉంది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి వంటి ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 నుంచి 17 డిగ్రీలకు పడిపోయాయి. ఏజెన్సీ ఏరియాల్లో అయితే సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.

వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల వల్ల తెలంగాణవ్యాప్తంగా ఎలాంటి వర్ష సూచన కనిపించ లేదు. కేవలం వెదర్ పూర్తిగా పొడిగా ఉంటూ, రానున్న రోజుల్లో రాత్రి సమయాలలో చలి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి ఈ సీజన్‌లో ఇప్పుడిప్పుడే చలి పుంజుకుంటుండటంతో తెలంగాణ ప్రజలు లేట్‌గా అయినా కూడా వింటర్ వైబ్స్‌ను ఫీలవుతున్నారు.

Glowing Skin : ముఖం మిలమిలా మెరిసిపోవాలా? కొరియన్లు వాడే ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి..

Related Articles

Back to top button