Just LifestyleLatest News

Mango Pack: మామిడి పండు తినడానికే కాదు.. మ్యాంగో ప్యాక్‌తో అద్భుత ఫలితాలు కూడా..

Mango Pack: జిడ్డు చర్మం గలవారు మామిడి గుజ్జులో ముల్తానీ మట్టి , కొద్దిగా రోజ్ వాటర్ కలిపి రాసుకోవడం వల్ల ముఖంపై ఉండే జిడ్డు తొలగిపోతుంది.

Mango Pack

వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల స్కిన్ తన సహజ సిద్ధమైన మెరుపును కోల్పోయి, నల్లగా (Tan) మారిపోవడం అందరం ఫేస్ చేస్తుంటాం. చర్మంపై పేరుకుపోయిన మట్టిని, ట్యాన్‌ను తొలగించి, మళ్లీ పూర్వపు స్థితికి తీసుకురావడంలో మామిడి పండును మించినది లేదనే చెప్పొచ్చంటారు స్కిన్ కేర్ స్పెషలిస్టులు.

ఎందుకంటే మామిడి పండులో గల విటమిన్ సీ, విటమిన్ ఏ , కీలకమైన ఎంజైములు స్కిన్‌ను లోపలి నుంచి శుభ్రపరిచి, హైడ్రేటెడ్‌గా ఉంచుతాయట. మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ ప్రొడక్ట్స్ వాడటం కంటే ఇంట్లోనే తయారు చేసుకునే మామిడి గుజ్జు ప్యాక్స్(Mango Pack) చర్మానికి ఎక్కువగా రక్షణనిస్తాయని నిపుణులు అంటున్నారు

ముందుగా స్కిన్ డ్రై అవకుండా , తేమగా ఉండాలనుకునే వారు మ్యాంగో పేస్ట్‌ , తేనె మిశ్రమాన్ని ప్రయత్నించొచ్చు. రెండు టేబుల్ స్పూన్ల తాజా మామిడిపండు గుజ్జులో ఒక స్పూన్ స్వచ్ఛమైన తేనె కలిపి ఫేస్‌కు రాసుకోవాలి. హనీలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని శుభ్రపరుస్తాయి. అలాగే మామిడి పండు గుజ్జు(Mango Pack) చర్మానికి మంచి మృదుత్వాన్ని ఇస్తుంది.

Mango Pack
Mango Pack

ఇక ఎండ వల్ల చర్మం ట్యాన్ అయినప్పుడు మామిడి గుజ్జుకు కొద్దిగా పెరుగు కలిపి ప్యాక్ వేసుకోవాలి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై ఉన్న నల్ల మచ్చలను తొలగించడమే కాకుండా చర్మాన్ని చల్లబరుస్తుంది. జిడ్డు చర్మం గలవారు మామిడి గుజ్జులో ముల్తానీ మట్టి , కొద్దిగా రోజ్ వాటర్ కలిపి రాసుకోవడం వల్ల ముఖంపై ఉండే జిడ్డు తొలగిపోతుంది. దీంతో మొటిమలు రాకుండా ఉంటాయి.

చర్మంపై ఉండే డెడ్ స్కిన్ తొలగించడానికి మామిడి గుజ్జు, ఓట్స్ పౌడర్ , పాలు కలిపి స్క్రబ్‌లా వాడొచ్చు. దీనివల్ల చర్మ రంధ్రాలు క్లీన్ అయి ఫేస్ ప్రెష్‌గా మారుతుంది. అయితే ఈ ఫేస్ ప్యాక్స్‌ను ఉపయోగించే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

ఏదైనా ప్యాక్‌ను డైరెక్టుగా ముఖంపై అప్లై చేయకుండా, మొదట చేతిపై ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి మామిడి పండు పడదు. దీని వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఫేస్ ప్యాక్ కోసం ఎప్పుడూ తాజా మామిడి పండు గుజ్జునే వాడాలి అలాగే ప్యాక్ వేసుకునే ముందు ఫేస్‌ను శుభ్రంగా కడుక్కోవడం మర్చిపోవద్దు.

Conversations:ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలా? గొడవలు జరగకుండా ఇది ఫాలో అవ్వండి చాలు

Related Articles

Back to top button