Artificial Jewellery :ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ధరిస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటిస్తే దురద, దద్దుర్లకు చెక్..
Artificial Jewellery : ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ధరించినప్పుడు చాలా మందిలో దురద, దద్దుర్లు, ఎర్రగా కందిపోవడం వంటి అలర్జీలు కనిపిస్తుంటాయి.
Artificial Jewellery
మహిళలకు అలంకరణ అంటే ప్రాణమన్న విషయం తెలిసిందే. దీనికోసం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ(Artificial Jewellery )తో మరింత మెరుగులు దిద్దుకుంటూ ఉండటంతో.. కొన్నాళ్లుగా అవి ట్రెండ్ సెట్టర్‌గా మారాయి. రకరకాల డిజైన్లు, జిగేల్‌మనిపించే మెరుపులను ఇస్తూ బంగారాన్ని తలదన్నేలా ఉంటూనే.. సామాన్యుల బడ్జెట్‌కు అందుబాటులో ఉండటంతో వేడుక ఏదైనా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ(Artificial Jewellery )ఉండాల్సిందేనన్నట్లుగా అవి సందడి చేస్తున్నాయి.
అయితే ఈ జిగేల్‌మనిపించే మెరుపుల వెనుక చర్మ సమస్యల ముప్పు కూడా పొంచి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ధరించినప్పుడు చాలా మందిలో దురద, దద్దుర్లు, ఎర్రగా కందిపోవడం వంటి అలర్జీలు కనిపిస్తుంటాయి. వెండి, బంగారం వంటి లోహాలు శరీరానికి చలువనిస్తే, ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో వాడే నికెల్, లెడ్ వంటి మూలకాలు సెన్సిటివ్ స్కిన్‌పై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. కానీ కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్యల నుంచి ఈజీగా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు
ముఖ్యంగా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారీలో వాడే నికెల్ లోహం వల్లే చాలామందిలో అలర్జీలు వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి జ్యువెలరీని ధరించడానికి ముందు మీ చర్మంపై ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిదంటారు నిపుణులు.
జ్యువెలరీ వేసుకునే ముందు మెడ చుట్టూ కానీ స్కిన్‌కు తగిలే చోట కానీ మంచి మాయిశ్చరైజర్, పౌడర్ లేదా క్యాలమైన్ లోషన్ వంటివి రాసుకోవాలి. ఇవి డైరెక్టుగా చర్మానికి తగలకుండా అడ్డుకుని అలర్జీ రాకుండా కాపాడతాయి. వీలైనంత వరకు నికెల్ లేని నికెల్ ఫ్రీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీని సెలక్ట్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
అంతేకాకుండా ఆర్టిఫిషియల్ జ్యువెలరీని ఎక్కువ టైమ్ ధరించకుండా జాగ్రత్త పడాలి. కేవలం పార్టీలు, ఫంక్షన్ల సమయంలో మాత్రమే వీటిని ఉపయోగించి తర్వాత వెంటనే తీసేయాలి. మెయిన్‌గా రాత్రిపూట ఈ జ్యువెలరీతో నిద్రపోవడం అస్సలు మంచిది కాదు.

అలాగే మెడకు బిగుతుగా ఉండే చోకర్లు కానీ, నెక్ పీస్‌లు వేసుకున్నప్పుడు గాలి ఆడక చెమట వల్ల కూడా అలర్జీ పెరుగుతుంది. కాబట్టి కాస్త వదులుగా ఉండే గొలుసులు లేదా పొడవాటి హారాలను ఎంచుకోవడం మంచిది. చెమట పట్టినప్పుడు ఆ లోహాల ఎఫెక్ట్ చర్మంపై మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమ్మర్‌లో ఈ విషయంలో మరింత అలర్ట్‌గా ఉండాలి.
ఒకవేళ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ధరించిన తర్వాత స్కిన్ ఎర్రగా కందిపోవడం, చిన్న పొక్కులు రావడం వంటివి గమనిస్తే, ఆలస్యం చేయకుండా జ్యువెలరీని తీసి పక్కన పెట్టాలి. అక్కడ శుభ్రమైన నీటితో కడిగి అలోవెరా జెల్ కానీ కొబ్బరి నూనె కానీ రాస్తే మంట, దురద నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఒకవేళ ఎలర్జీ మరీ ఎక్కువగా ఉంటే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లడం మంచిది. అయితే ఫ్యాషన్ కోసం, అందం కోసం చేసే అలంకరణ అనేది హెల్త్‌కు ఇబ్బంది కాకుండా చూసుకోవడం మన బాధ్యత.
Lord Venkanna:రూ. 300 టికెట్లు దొరకలేదా? శ్రీవారి దర్శనానికి మరో ఈజీ మార్గం..





