Just NationalJust PoliticalLatest News

Pensioners : పెన్షనర్లకు కేంద్రం భారీ కానుక.. రూ. 7,500కు చేరనున్న కనీస పెన్షన్

Pensioners : పెన్షన్ పెంపుతో పాటు, పీఎఫ్ (PF) అకౌంట్ హోల్డర్స్‌ తమ డబ్బును విత్‌డ్రా చేసుకునే విధంగా కూడా మార్పులు రానున్నాయి.

Pensioners

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పరిధిలోకి వచ్చిన.. కోట్లాది మంది ఉద్యోగులు , పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అద్భుతమైన వార్తను అందించబోతోంది. కొంతకాలంగా పెన్షన్ దారులు ఎదురుచూస్తున్న కనీస పెన్షన్ పెంపు అంశంపై..కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న రూల్స్ ప్రకారం పెన్షనర్ల(Pensioners )కు నెలకు కనీసం రూ. 1,000 నుంచి రూ. 1500 మాత్రమే అందుతోంది. అయితే పెరిగిన నిత్యావసర ధరలు , లివింగ్ స్టాండర్డ్స్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ మొత్తాన్ని రూ. 7,500కు పెంచాలని కార్మిక సంఘాలు, పార్లమెంటరీ కమిటీ గట్టిగా సిఫార్సు చేస్తున్నాయి. ఇదే కనుక జరిగితే పెన్షనర్లకు ఏకంగా ఏడున్నర రెట్లు పెరుగుతుంది. ఇది వారి వృద్ధాప్య జీవితానికి పెద్ద ఊరటనిస్తుంది.

పెన్షన్ పెంపుతో పాటు, పీఎఫ్ (PF) అకౌంట్ హోల్డర్స్‌ తమ డబ్బును విత్‌డ్రా చేసుకునే విధంగా కూడా మార్పులు రానున్నాయి. భవిష్యత్తులో పీఎఫ్ నగదును డైరెక్టుగా ఏటీఎం (ATM) ద్వారా తీసుకునే అవకాశాన్ని కల్పించడానికి ఈపీఎఫ్ఓ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గతంలో పీఎఫ్ క్లెయిమ్స్ సాల్వ్ అవడానికి చాలా సమయం పట్టేది. కానీ ఆటోమేషన్ ద్వారా ఇప్పుడు దాదాపు 71 శాతం క్లెయిమ్స్‌ను కేవలం మూడు రోజుల్లోనే పరిష్కరిస్తున్నారు.

2025-26 ఫైనాన్సియల్ ఇయర్‌లో ఈపీఎఫ్ఓ రికార్డు స్థాయిలో 8.31 కోట్ల క్లెయిమ్స్‌ను పరిష్కరించడంతో విశేషత సంతరించుకుంది. అలాగే నిలిచిపోయిన ఖాతాలతో పాటు పాత పీఎఫ్ ఖాతాలను తిరిగి యాక్టివ్ చేయడానికి ఈ-ప్రాప్తి అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా ఆధార్ కార్డ్ , యూఏఎన్ (UAN) నంబర్ సహాయంతో పాత అకౌంట్లను ఈజీగా లింక్ చేసుకోవచ్చు.

Pensioners
Pensioners

ఇక ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే, పీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు 8.25 శాతం వడ్డీ రేటును అందించే ప్రతిపాదన ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉంది. దీనికి ఆమోద ముద్ర పడగానే, నిర్ణీత వడ్డీ మొత్తం డైరెక్టుగా ఖాతాదారుల అకౌంట్లలో డిపాజిట్ అయిపోతుంది. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు అందే ఫండ్ మరింత పెరగనుంది.

కాగా సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, ఈ కీలక మార్పులపై ఈ వారంలోనే తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. డిజిటల్ గవర్నెన్స్‌ను స్ట్రాంగ్ చేస్తూ, క్లెయిమ్ ప్రక్రియను ఈజీగా చేయడం వల్ల కోట్లాది మంది మధ్యతరగతి కార్మికులకు , పెన్షనర్ల(Pensioners )కు ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరుగుతుంది.

Punjab Kings : టాప్ లోనే పంజాబ్.. అట్టడుగున లక్నో..ఐపీఎల్ లో ఇకపైనే అసలు మజా

Related Articles

Back to top button