Anger:మన కోపం అందరి మీద ఒకేలా ఎందుకు ఉండదు? సైకాలజీ ఏం చెబుతోంది?
Anger: మనకు బాగా ఇష్టమైన వ్యక్తులు కానీ మనం ఎక్కువగా ప్రేమించే వారు కానీ ఏదైనా తప్పు చేసినప్పుడు మన మెదడు ఎమోషనల్ రెగ్యులేషన్ (Emotional Regulation) అనే పద్ధతిని వాడుతుందని సైకాలజీ చెబుతుంది.
Anger
కోపం అనేది ప్రతీ మనిషిలో ఉండే ఒక సహజమైన ఎమోషన్. కానీ అది మనం ఎవరి మీద చూపిస్తున్నామనే దాన్ని బట్టి మారిపోతూ ఉండటమే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకే తప్పును వేర్వేరు వ్యక్తులు చేసినప్పుడు మన రియాక్షన్లో తేడా ఉండటాన్ని సైకాలజీలో చాలా ఆసక్తికరమైన వివరణ ఉంది. దీనిని సైకాలజీలో డిస్ప్లేస్మెంట్ (Displacement) అని పిలుస్తారు.
అంటే ఒక వ్యక్తి మీద కలిగిన కోపాన్ని(Anger )అక్కడ చూపించలేక, మనకంటే బలహీనమైన మరో వ్యక్తి మీద చూపించడం అన్నమాట. ఉదాహరణకు, ఆఫీసులో బాస్ తిట్టినప్పుడు ఎంత కోపం వచ్చినా కూడా మనం వారిని ఏమీ అనలేక ఆ కోపాన్ని లోపలే అణచుకుంటాం.
కానీ ఇంట్లో ఏ చిన్న వస్తువు పగిలినా, ఎవరైనా చిన్న తప్పు చేసినా సరే ఆ కోపాన్ని(Anger) వారిపై వెంటనే చూపిస్తాం. ఎందుకంటే బాస్ మీద కోపం చూపిస్తే ఉద్యోగం మీద ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఇంట్లో వారు మనల్ని ఏమీ అనలేరనే ధైర్యం మన కోపాన్ని బయటకు తెస్తుందన్న మాట.
నిజానికి మన కోపాన్ని ప్రదర్శించే తీరు ఎదుటివారి స్థాయి (Status) కూడా నిర్ణయిస్తుంది. మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నవారు అలాగే మనం గౌరవించే వ్యక్తులు ఏదైనా పొరపాటు చేస్తే, మన మెదడు వెంటనే దానికి కోప్పడొద్దు కోప్పడితే ప్రమాదం అని సంకేతాలు పంపిస్తుంది.
దీంతో వారితో గొడవ పడితే నష్టం జరుగుతుందని తెలిసి, కోపానికి బదులు మర్యాదగా ప్రవర్తించేలా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటాం. దీనినే సైకాలజీలో సామాజిక స్థాయి (Power Dynamics)ని బట్టి స్పందించడం అంటారు.

అంతేకాదు మనకు బాగా ఇష్టమైన వ్యక్తులు కానీ మనం ఎక్కువగా ప్రేమించే వారు కానీ ఏదైనా తప్పు చేసినప్పుడు మన మెదడు ఎమోషనల్ రెగ్యులేషన్ (Emotional Regulation) అనే పద్ధతిని వాడుతుందని సైకాలజీ చెబుతుంది. అంటే ఇక్కడ కోపం కంటే ఆ వ్యక్తితో మనకున్న అనుబంధం, ప్రేమ ఎక్కువగా పని చేస్తాయి.
అక్కడ , ఆ సమయంలో ఆ వస్తువు కంటే ఆ మనిషి ముఖ్యమని మన మనసుకు తెలుసు కాబట్టి, లోపల బాధ, కోపం కలిగినా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాము. అలాగే బంధం పాడవుతుందనే భయం కూడా ఇక్కడ కోపాన్ని అణచివేస్తుంది.
మొత్తానికి మన కోపం అనే ఎమోషన్ కేవలం ఎదుటివారు చేసే తప్పు మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ఆ తప్పు చేసిన వ్యక్తి మనకు ఎంత దగ్గర వ్యక్తి, వారు మనకంటే ఎంత శక్తిమంతులనే విషయాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
Harmanpreet Kaur : ఐదోసారి కెప్టెన్ గా హర్మన్ ప్రీత్..టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు ఇదే





