Bonsai : మీ ఫేవరెట్ చెట్టును బోన్సాయ్‌గా మార్చేసుకోండి..గార్డెనింగ్ ప్రియులకు స్పెషల్ గైడ్
Bonsai :సాధారణంగా మర్రి, అశ్వత్థ, వేప, చింత లేదా అత్తి వంటి చెట్లు బోన్సాయ్‌గా మారడానికి చాలా అనుకూలంగా ఉంటాయి.
Bonsai
పెద్ద పెద్ద చెట్లను చిన్నపాటి కుండీలలో ఇమిడ్చే అద్భుతమైన ఆర్ట్‌ను బోన్సాయ్(Bonsai )అంటారు. ఇది కేవలం గార్డెనింగ్ మాత్రమే కాదు, ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇంటి ఆవరణలో పచ్చదనాన్ని, ఒక రకమైన రాయల్ లుక్‌ను తీసుకురావడానికి బోన్సాయ్ మొక్కలు మంచి ఆప్షన్. ఓపిక, కాస్త క్రియేటివిటీ ఉంటే చాలు.. అడవిలో పెరిగే పెద్ద పెద్ద చెట్లను మీ ఇంట్లోని టేబుల్ మీద ఎంచక్కా అలంకరించుకోవచ్చు.
బోన్సాయ్(Bonsai )ప్లాంట్ పెంచడమనేది కళాత్మక ప్రయాణం అంటారు ప్లాంట్ లవర్స్. దీనికి మొదటి అడుగు సరైన మొక్కను ఎంచుకోవడమే. సాధారణంగా మర్రి, అశ్వత్థ, వేప, చింత లేదా అత్తి వంటి చెట్లు బోన్సాయ్‌గా మారడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇవి స్ట్రాంగ్‌గా ఉండటమే కాకుండా, మనమిచ్చే ఆకారంలో ఉండేలా త్వరగా లొంగుతాయి.
దీని కోసం ముందుగా మొక్కను ఎంచుకున్న తర్వాత దానికి తగిన వాతావరణాన్ని కల్పించాలి. బోన్సాయ్ మొక్కలకు డైరెక్టుగా ఎండ తగలకుండా, తగినంత వెలుతురు, గాలి వచ్చే ప్లేసులో ఉంచాలి. ఇంటి బాల్కనీలు, కిటికీల దగ్గర ఇవి చక్కగా పెరుగుతాయి. కుండీని ఎంచుకునేటప్పుడు అది లోతు తక్కువగా ఉండి, అడుగున నీరు బయటకు పోవడానికి రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. మట్టిలో సేంద్రియ ఎరువులను కలిపి వాడటం వల్ల మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతాయి.

బోన్సాయ్ అందమంతా ఎప్పుడైనా సరే దాని ఆకారంలోనే ఉంటుంది. చెట్టు పెద్దగా పెరగకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా కొమ్మలను, వేర్లను కత్తిరించడం (Pruning) చాలా అవసరం. సాధారణంగా మొక్కకు మూడు నుంచి నాలుగేళ్లు వచ్చాక ఈ ప్రక్రియను మొదలుపెడతారు. వాటి కొమ్మలను మనకు నచ్చిన విధంగా వంచడానికి అల్యూమినియం వైర్లను వాడుతుంటారు. దీనివల్ల చిన్న కుండీలో ఉన్నా కూడా, అది వందల ఏళ్ల నాటి పెద్ద చెట్టులాగా కనిపిస్తుంది.
అయితే బోన్సాయ్ చెట్ల సంరక్షణ విషయంలో కొంచెం శ్రద్ధ వహించాలి. ఆవాల పొట్టు , సేంద్రియ ఎరువులను టైమ్ టు టైమ్ అందిస్తూ, పురుగులు పట్టకుండా చూసుకోవాలి. మొక్కల ఎదుగుదలను జాగ్రత్తగా గమనిస్తూ ప్రేమగా పెంచితే, అది ఇంటికి కేవలం పచ్చదనాన్ని మాత్రమే కాదు, మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది.





