Just SportsLatest News

IPL : ఐపీఎల్ లో హనీట్రాప్ కలకలం..ఆటగాళ్లు, ఫ్రాంచైజీలకు బీసీసీఐ వార్నింగ్

IPL : ఐపీఎల్ క్రికెట‌ర్ల‌కు బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది. హ‌నీట్రాప్ జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు బీసీసీఐ అనుమానాలు వ్య‌క్తం చేశారు.

IPL

రసవత్తరంగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 19వ సీజన్ లో హనీట్రాప్ కలకలం రేపింది. పూర్తిస్థాయిలో కాకున్నా కొన్ని అనుమానాస్పద ఘటనలతో బీసీసీఐ అప్రమత్తమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ హోటల్ లోకి వెళుతుండగా ఒక యువతి హఠాత్తుగా చేయిపట్టుకుని లాగడం ఈ అనుమానాలకు కారణమైంది. అక్కడున్న వారంతా ఆ యువతి చేసిన పనికి షాక్ అయ్యారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది అభిషేక్ చేయిని విడిపించి ఆ యువతిని అక్కడి నుంచి పంపించేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో బీసీసీఐ దృష్టి సారించింది. ఇలాంటివి హనీ ట్రాప్ లు కావొచ్చని , ఆటగాళ్లు , ఫ్రాంచైజీలు, సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కొన్ని కీలక సూచనలు కూడా జారీ చేసింది. లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ దీనిపై స్పందించారు. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఈ-సిగరెట్ వ్యవహారం కూడా బీసీసీఐకి ఇబ్బందిగా మారింది.

దీనిని దృష్టిలో ఉంచుకుని ఫ్రాంచైజీలకు, ఆటగాళ్లకు బోర్డు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అనధికార వ్యక్తలను కలవొద్దని, ఆటగాళ్లు బస చేసే హోటల్ రూమ్స్ దగ్గరకు కుటుంబసభ్యులను తప్ప అపరిచిత వ్యక్తులను అనుమతించవద్దని ఆదేశించింది. అలాగే ప్లేయర్స్ ఎవరినైనా కలవాలంటే బహిరంగా ప్రదేశాల్లోనే మీట్ అవ్వాలని ఆదేశించింది. దీనికి మేనేజర్ అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. అలాగే ఆటగాళ్లు బహిరంగ ప్రదేశాలకు అనుమతి లేకుండా, పూర్తి సెక్యూరిటీ లేకుండా వెళ్లొద్దని స్పష్టం చేసింది.

ఆటగాళ్ళను కలిసే వారి వివరాలు తీసుకోవాలని సూచించింది. అవసరం అయితే తాము ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తామని హెచ్చరించింది. ఆటగాళ్ల భద్రత, ప్రస్తుతం జారీ చేసిన నిబంధనలు అమలు చేసే విషయంలో ఫ్రాంచైజీలదే బాధ్యతగా పేర్కొంది. ఎట్టిపరిస్థితుల్లో ఎవ్వరూ కూడా నిబంధనలు ఉల్లంఘించకూడదని ఆదేశించింది.

IPL
IPL

ఒకవేళ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు తమ దృష్టికి వచ్చాయనీ, ఇలాంటివి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదనీ ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ , బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా చెప్పారు. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, ఫ్రాంచైజీ ప్రతినిధులు నిషేధిత పదార్థాలను ఉపయోగించకూడదని తేల్చి చెప్పారు.

దీనికి సంబంధించి ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఫ్రాంచైజీ యాజమాన్యం, అధికారులు డగౌట్ లో ఆటగాళ్లతో మాట్లాడకూడదని మరోసారి స్పష్టం చేసింది.

Hanta virus : టెన్షన్ పెడుతున్న హంటా వైరస్..WHO కీలక ప్రకటన

Related Articles

Back to top button