Just LifestyleLatest News

pulses :పప్పులు, బియ్యానికి పురుగులు పడుతున్నాయా? ఈ చిన్న చిట్కా పాటించండి..

pulses : ఎంత ఖరీదైన పప్పులు కొన్నా, సరిగ్గా నిల్వ చేయకపోతే కొద్ది రోజుల్లోనే అవి వాడటానికి వీలు లేకుండా మారిపోతుంటాయి.

pulses

వంటగదిలో పప్పులు, బియ్యం వంటివి దాచుకోవడం చాలామందికి సమస్యగా మారిపోతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో వాతావరణంలో తేమ , వేడి వల్ల పప్పులు, బియ్యానికి త్వరగా పురుగులు పడుతుంటాయి. ఎంత ఖరీదైన పప్పులు కొన్నా, సరిగ్గా నిల్వ చేయకపోతే కొద్ది రోజుల్లోనే అవి వాడటానికి వీలు లేకుండా మారిపోతుంటాయి. దీనికి పరిష్కారం కోసం మార్కెట్లో దొరికే మందులు వాడటం కంటే, మన వంటగదిలోనే ఉండే ఉప్పుతో అద్భుతమైన ఫలితాన్ని పొందొచ్చు.

పప్పుల(pulses )ను డబ్బాలో భద్రపరిచేటప్పుడు దీనిలో ఒక చెంచా సముద్రపు ఉప్పు లేదా కల్లు ఉప్పు వేసి బాగా కలపాలి. సాల్ట్‌కు సహజంగానే తేమను పీల్చుకునే గుణం ఉంటుంది. పురుగులు పెరగడానికి తేమ అనేది ప్రధాన కారణమన్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఉప్పు తేమను పీల్చుకుంటుందో, పప్పులు పొడిగా మారుతాయన్న మాట.

pulses
pulses

పొడి వాతావరణంలో ఏ పురుగులూ జీవించలేవు. అందుకే ఉప్పుతో చేసే ఈ చిట్కా చాలా తక్కువ ఖర్చుతో కూడినదే కాదు చాలా బాగా పని చేసే పద్ధతి అనే చెప్పొచ్చు. ఉప్పుతో పాటు ఎండు మిరపకాయలు కానీ బిర్యానీ ఆకులను కానీ వాడటం వల్ల పురుగులు రాకుండా ఉంటాయి.

పప్పుల(pulses )ను, బియ్యాన్ని నిల్వ చేసే డబ్బాలెప్పుడూ గాలి చొరబడనివి (Air-tight) అయి ఉండాలి. అలాగే వాటిని స్టవ్ దగ్గర కాకుండా కాస్త పొడిగా ఉండే చోట పెట్టాలి . అప్పుడప్పుడు పప్పులను చెక్ చేస్తూ ఉండాలి. ఒకవేళ తేమగా అనిపించినా పురుగు పట్టినట్లు అనిపించినా వెంటనే ఎండలో ఆరబెట్టాలి.

సూర్యరశ్మి సహజంగానే సూక్ష్మజీవులను , తేమను తొలగిస్తుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి పప్పులను, బియ్యాన్ని పురుగు పట్టకుండా కాపాడుకోవచ్చు.

Phone Calls : పనులు పెండింగ్ పెట్టి మరీ ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారా? కంపల్సివ్ మూడ్ గురించి తెలుసుకోండి..

Related Articles

Back to top button