Just SpiritualLatest News

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ అద్భుత అవకాశం.. స్వామివారికి కానుకగా వచ్చిన వస్త్రాల వేలం..

TTD: తిరుమల శ్రీవారితో పాటు టీటీడీ కింద ఉండే ఇతర చిన్న ఆలయాలలో భక్తులు మొక్కుబడిగా, కానుకలుగా ఇచ్చిన వస్త్రాలను వేలం వేయబోతున్నట్లు అధికారులు ప్రకటించారు.

TTD

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తిరుమల శ్రీవారి భక్తులకు ఒక మంచి వార్త చెప్పింది. స్వామివారిని కొలిచే భక్తులు ఈ వేలంలో పాల్గొని, దేవుడి దగ్గర పూజలు అందుకున్న పవిత్రమైన బట్టలను సొంతం చేసుకోగలిగే గొప్ప అవకాశాన్ని టీటీడీ కల్పించింది.

తిరుమల శ్రీవారితో పాటు టీటీడీ(TTD) కింద ఉండే ఇతర చిన్న ఆలయాలలో భక్తులు మొక్కుబడిగా, కానుకలుగా ఇచ్చిన వస్త్రాలను వేలం వేయబోతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఆన్‌లైన్ వేలం పాటలు మే 21వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు జరుగుతాయి.

ఈ వేలంలో కొత్త బట్టలతో పాటు కొద్దిగా పాడైనవి అన్నీ కలిపి మొత్తం 505 వస్త్రాల లాట్లను అమ్మకానికి పెట్టారు. వీటిలో పాలిస్టర్, నైలాన్, కాటన్ చీరలతో పాటు బ్లౌజ్ పీసులు, కట్ పీసులు, కండువాలు, టర్కీ టవళ్లు, లుంగీలు, శాలువాలు, బెడ్‌షీట్లు, దిండు కవర్లు ఉన్నాయి.

అంతేకాకుండా పంజాబీ డ్రెస్ మెటీరియల్స్, కార్పెట్లు, దుప్పట్లు, కర్టెన్లు, గొడుగులు, హుండీ సంచులు లాంటి ఎన్నో వస్తువులను భక్తులు కొనుక్కోవచ్చు. ఈ వేలం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకునే భక్తులు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ ఆఫీస్ ఫోన్ నంబర్ 0877-2264429 కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. లేదా టీటీడీ వారి అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి కూడా పూర్తి వివరాలు చూడొచ్చు.

అంతేకాదు ఏడుకొండలవాడిని దర్శించుకుని వేద ఆశీర్వచనం తీసుకునే భక్తులకు ఇచ్చే పట్టు వస్త్రాలు, శాలువాల విషయంలో టీటీడీ(TTD) బోర్డు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గతంలో భక్తులకు ఇచ్చిన శాలువాలన్నీ కూడా నాణ్యంగా లేవని ఫిర్యాదులు వచ్చాయి.

ఈ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు వాటిని చెక్ చేయగా.. అసలైన పట్టు బట్టలకు బదులుగా తక్కువ క్వాలిటీ ఉన్న పాలిస్టర్ వస్త్రాలను కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ రేటుకు సప్లై చేసి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్లు తేలింది. దీంతో అలర్ట్ అయిన టీటీడీ అధికారులు, ఆ పాత ప్రైవేట్ కంపెనీల టెండర్లను రద్దు చేసి గతేడాది డిసెంబర్ లోనే వారికి చెక్ పెట్టింది. ఆ వస్త్రాల స్కామ్‌పై ప్రస్తుతం విచారణ నడుస్తోంది.

TTD
TTD

ఈ గొడవల వల్ల భక్తులకు శాలువాల కొరత రాకుండా ఉండటానికి ఇకపై ప్రైవేట్ కాంట్రాక్టర్లను నమ్మకూడదని టీటీడీ నిర్ణయించింది. కేవలం ప్రభుత్వ చేనేత సంస్థలైన ఏపీకి చెందిన ఆప్కో, అలాగే తమిళనాడుకు చెందిన కో-ఆప్టెక్స్ కంపెనీల నుంచి మాత్రమే మేలు రకం పట్టు వస్త్రాలు, శాలువాలను కొనాలని ఫిక్స్ అయ్యారు. ఈ మంచి క్వాలిటీ పట్టు వస్త్రాలను కొనడం కోసం టీటీడీ బోర్డు ఏకంగా 44.20 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కూడా కేటాయించింది.

సాధారణంగా టీటీడీ ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఈ వస్త్రాలను కొంటుంది. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భక్తులకు ఇచ్చే దుపట్టాలతో పాటు, శాలువాల కొరత తీరడమే కాకుండా, తిరుమలకు వచ్చే వీఐపీ, వీవీఐపీ భక్తులకు నాణ్యమైన అసలైన పట్టు బట్టలు అందబోతున్నాయి.

Medical Shops : దేశవ్యాప్తంగా మూతపడిన లక్షలాది మెడికల్ షాపులు..సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేనా!

Related Articles

Back to top button