Thailand : భారతీయులకు థాయ్ ప్రభుత్వం షాక్..కొత్త వీసా రూల్స్ ప్రకటన
Thailand : ఇకపై థాయ్ లాండ్ వెళ్లాలనుకునే భారతీయులకు మాత్రం ఇప్పుడు ఆ దేశ ప్రభుత్వం పెద్ద షాకిచ్చింది. వీసా నిబంధనలను కఠినతరం చేసింది
Thailand
థాయ్ లాండ్.. మన దేశంలో చాలా మంది వెకేషన్ కు వెళ్లాలనుకుంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఇదే… సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ కనీసం ఒక్కసారైనా థాయ్ లాండ్(Thailand )వెళ్లి ఎంజాయ్ చేద్దామనుకుంటారు. తక్కువ బడ్జెట్ లో ట్రిప్ ప్లాన్ చేసుకునే సామాన్యులు కూడా చాలా మందే ఉన్నారు. పైగా వీసా అవసరం లేకపోవడంతో ఈ దేశాన్ని సందర్శించేందుకు టూరిస్టులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇకపై థాయ్ లాండ్(Thailand) వెళ్లాలనుకునే భారతీయులకు మాత్రం ఇప్పుడు ఆ దేశ ప్రభుత్వం పెద్ద షాకిచ్చింది.
వీసా నిబంధనలను కఠినతరం చేసింది. ప్రస్తుతం వీసా ఫ్రీ రూల్ కింద 60 రోజుల వరకూ అక్కడ ఉండేందుకు అనుమతిస్తుండగా.. ఇప్పుడు హఠాత్తుగా దానిని రద్దు చేసింది. ఇప్పటి వరకూ ఉన్న వీసా రహిత రూల్స్ ప్రకారం 90కి పైగా దేశాలకు చెందిన టూరిస్టులు వీసా ఫ్రీ విధానంతో అక్కడ 60 రోజుల వరకూ ఉండొచ్చు.
అయితే ఈ విధానంలో అకస్మాత్తుగా థాయ్ ప్రభుత్వం కీలక మార్పు తీసుకొచ్చింది. వీసా ఫ్రీ రూల్ ను 15 రోజులకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే రెండు నెలల్లో థాయ్ లాండ్ ట్రిప్ కు వెళ్లాలని ఇప్పటికే బుక్ చేసుకున్న వారిపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది.
కొత్త వీసా నిబంధనల ప్రకారం భారతీయులు వీసా ఆన్ ఎరైవల్ ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా 15 రోజులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత 2 వేల థాయ్ బాట్స్ దీనికి ఫీజుగా చెల్లించాలి. అలాగే ప్రతీ భారత టూరిస్ట్ కూడా రిటర్న్ ఫ్లైట్ టికెట్ , వారి దగ్గర తగినంత నగదు అక్కడ అధికారులకు చూపించాలి.

ఎంట్రీ పర్మిట్ దగ్గర వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపిస్తేనే థాయ్ లాండ్ లో ప్రవేశించడానికి అనుమతిస్తారు. ఒకవేళ 15రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే మాత్రం ముందుగానే రెగ్యులర్ టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇది రావడానికి 3 నుంచి 5 రోజులు పడుతుంది.
ప్రస్తుతం తమ దేశంలో విదేశీయుల నేర కార్యకలాపాలు పెరుగుతున్నాయనే ఆందోళన నేపథ్యంలో వీసా ఫ్రీ స్టేను తగ్గించినట్టు థాయ్ అధికారులు చెబుతున్నారు. నిజానికి కొవిడ్ తర్వాత తమ దేశంలో టూరిజాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో థాయ్ లాండ్ ప్రభుత్వం ఈ 60 రోజుల వీసా ఫ్రీ స్టేను తీసుకొచ్చింది. ఇప్పుడు అది దుర్వినియోగం చేస్తున్నారన్న కారణంతో 15 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
Tirumala:తిరుమల కొండపై ఏఐ టెక్నాలజీ..క్యూలైన్ల రద్దీని అంచనా వేస్తూ వేగంగా దర్శనాలు





