Just CrimeLatest News

Siya : రహస్య పెళ్లి.. మర్డర్ కోసం రీసెర్చ్.. కేతన్ హత్య కేసులో మైండ్ బ్లాంక్ చేసే నిజాలు..

Siya : నాలుగు నెలల ముందే, సియా తన ప్రియుడు చేతన్ చౌదరిని పూణేలోని ఒక రిజిస్ట్రార్ ఆఫీసులో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది

Siya

జూన్ 18న పూణేలోని చారిత్రాత్మక లోహగడ్ కోట వద్ద జరిగిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ జరిగి 20 రోజులు అవుతున్నా..ఆకేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వచ్చి అందరినీ ఆశ్చర్య పరుస్తుంది.. ఈ కేసులో బయటకు వస్తున్న డిజిటల్ సాక్ష్యాలు చూస్తుంటే సినిమా కథలను మించిపోయేలా కనిపిస్తోంది.

కేతన్ అగర్వాల్‌తో సియా(Siya) గోయల్‌కు ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే దీనికి నాలుగు నెలల ముందే, సియా తన ప్రియుడు చేతన్ చౌదరిని పుణెలోని ఒక రిజిస్ట్రార్ ఆఫీసులో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి రావడం ఈ కేసులో సెన్సేషన్ సృష్టిస్తుంది.

రాబోయే నవంబరులో ఉదయ్‌పూర్ వేదికగా కేతన్‌ అగర్వాల్‌తో జరగాల్సిన డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం.. కేతన్ కుటుంబ సభ్యులు సియా(Siya) అధికారిక పత్రాలు కావాలని అడగడంతో, తన సీక్రెట్ పెళ్లి ఎక్కడ బయటపడుతుందోననే భయంతోనే ఆమె కేతన్‌ను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే కేతన్ హత్యకు ముందు సియా(Siya) గోయల్ ఎంతో పక్కాగా స్కెచ్ వేసింది. గతంలో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసును ఆమె క్షుణ్ణంగా స్టడీ చేసింది. ఆ కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీ చేసిన తప్పులు ఏంటి, పోలీసులు తనను ఎలా పట్టుకున్నారు అనే వివరాలపై సియా ఇంటర్నెట్‌లో రీసెర్చ్ చేసింది.

ఏదైనా ఆయుధంతో చంపితే శరీరంపై గాయాలు ఉంటాయని..దీంతో పోలీసులకు ఈజీగా దొరుకుతానని గ్రహించి, ఎలాంటి క్లూలు దొరకని మర్డర్ ప్లాన్స్ వెతికింది. చివరకు కేతన్‌ను ఫోటోలు తీసే సాకుతో కొండపైకి తీసుకెళ్లి ..అక్కడ లోయలోకి నెట్టేయాలనే ప్లాన్‌తో చేతన్‌ను రంగంలోకి దించింది. కేతన్ ను నెట్టేశాక ఆయన ఫోన్‌ను కుటుంబ సభ్యులకు అందజేయకుండా తన దగ్గరే ఉంచుకోవడంతో ఆ ఫోన్‌లో ఇంపార్టెంట్ డేటా ఏమైనా మిస్ చేసిందా అన్న అనుమానాలు కూడా పోలీసులలో ఉన్నాయి.

అంతేకాదు, ఒకవేళ ఈ హత్య కేసులో తాను అరెస్ట్ అయితే ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలతో పాటు, ఎలాంటి శిక్షలు పడతాయి, పోలీస్ కస్టడీలో మహిళా ఖైదీలను కొడతారా, జైలులో మహిళలకు ఉండే హక్కులేంటి అనే విషయాలను కూడా ఆమె గూగుల్‌లో ముందే వెతికినట్లు మొబైల్ బ్రౌజింగ్ హిస్టరీ ద్వారా పోలీసులు కనుగొన్నారు.

సాక్ష్యాలు దొరక్కుండా జాగ్రత్తపడటానికే బాలి ప్రీ-వెడ్డింగ్ షూట్ కి వెళ్లకుండా కేతన్ పాస్‌పోర్ట్‌ను కూడా సియా మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే కేతన్ పడిపోయిన ప్రదేశం డేంజరస్‌గా లేకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం రావడం, పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్ డేటానే కాదు సియా యూజ్ చేసిన స్నాప్‌చాట్ కోడెడ్ చాట్స్ , డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలు ఈ కిల్లర్ జోడీ అసలు రంగును బయటపెట్టాయి.

Siya
Siya

ఈ ఘోర ఉదంతంలో కేతన్ తాతయ్య దేవిచంద్ అగర్వాల్ కూడా ఇటీవల గుండెపోటుతో కన్నుమూయడం ఆ కుటుంబంలో మరింత విషాదాన్ని నింపింది. ప్రస్తుతం ఈ కేసు తీవ్రతను బట్టి మహారాష్ట్ర ప్రభుత్వం దీనిని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించింది. ఉగ్రవాది కసబ్‌కు ఉరిశిక్ష వేయించిన ఫేమస్ సీనియర్ అడ్వకేట్ ఉజ్వల్ నికమ్‌ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. నిందితులు ఇద్దరూ పాలిగ్రాఫ్ పరీక్షకు నిరాకరించినా, తిరుగులేని డిజిటల్ సాక్ష్యాలతో ప్రస్తుతం ఈ ఇద్దరూ ఎరవాడ సెంట్రల్ జైలులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో మగ్గుతున్నారు.

Shiva temples : రావణుడు కట్టించిన శివయ్య ఆలయాల గురించి విన్నారా?

Related Articles

Back to top button