Emotionally Distant:ప్రాణమిచ్చిన వ్యక్తే బండరాయిలా ఎందుకు మారతారు? మనుషుల ప్రవర్తన వెనుకున్న నిజం ఏంటి?
Emotionally Distant: ఏ చిన్న పొరపాటో, గొడవో జరిగి తమ మనసు విరిగితే మాత్రం అవతలి వ్యక్తిని పూర్తిగా విలన్‌గా చూడటం మొదలుపెడతారు.
Emotionally Distant
ప్రేమలోనో, పెళ్లి బంధంలోనో ఉన్నప్పుడు తమ పార్టనర్‌ని ప్రాణమిచ్చేంతగా ఇష్టపడతారు. అయితే ఒక్కసారి ఆ బంధంలో తేడా వచ్చిందంటే మాత్రం అసలు అప్పటివరకు ప్రేమించిన మనిషేనా అన్నంతగా బండరాయిలా(Emotionally Distant) మారిపోతుంటారు.
అంత వరకు చూపించిన అపారమైన ప్రేమను క్షణంలోనే మర్చిపోయి, కనీసం పట్టించుకోకుండా కఠినంగా (Emotionally Distant)మారిపోతారు. ఎదుటి వ్యక్తి ఎంత బాధపడుతున్నా సరే వారిలో మాత్రం ఎలాంటి చలనం ఉండదు. ఈ రకమైన ప్రవర్తనను సైకాలజీలో స్ప్లిటింగ్ (Splitting) లేదా బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ (Black and White Thinking) అని పిలుస్తారు.
ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు తమ జీవితాన్ని కానీ మనుషులను కానీ మధ్యస్థంగా చూడలేరు. వాళ్లకు రెండు రంగులు మాత్రమే తెలుస్తాయి. అది ఒకటి తెలుపు, రెండోది నలుపు. అంటే, ఒక వ్యక్తి నచ్చితే దేవతలా, దేవుడిలా చూస్తూ ప్రాణమిస్తారు.
కానీ ఏ చిన్న పొరపాటో, గొడవో జరిగి తమ మనసు విరిగితే మాత్రం అవతలి వ్యక్తిని పూర్తిగా విలన్‌గా చూడటం మొదలుపెడతారు.అంతవరకూ తమ మధ్య ఉన్న అనుబంధాన్ని, ప్రేమను కూడా పక్కన పెట్టేసి, కేవలం ఆ ఒక్క చేదు అనుభవాన్ని బేస్ చేసుకుని వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని తెంచేసుకుంటారు. అలా ఎదుటి వ్యక్తిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం (Stonewalling) ద్వారా తమలో ఉన్న కోపాన్ని, నిరాశను తెలియజేసేలా ప్రవర్తిస్తారు.
ఇక డిటాచ్మెంట్ థియరీ (Detachment Theory) లేదా ఎమోషనల్ ప్రొటెక్షన్ అనేది రెండో ముఖ్యమైన కారణం. బంధంలో గొడవలు జరిగినప్పుడు కొందరు చాలా మానసిక వేదనకు గురవుతారు. దీంతో ఆ బాధను తట్టుకోలేక, తమ మనసుకు గాయం కాకుండా కాపాడుకోవడానికి వెంటనే వారి మెదడు ఒక రక్షణ కవచాన్ని (Defense Mechanism) ఏర్పాటు చేసేసుకుంటుంది.
దీనివల్లే వాళ్లు తమ భావోద్వేగాలను పూర్తిగా అణచివేసి, ఏడుపు, కోపం, బాధ ఇలాంటివి ఏమీ చూపించకుండా బండరాయిలా నటిస్తారు. ఇది పైకి క్రూరంగా కనిపించినా.. లోపల వాళ్లు పడే తీవ్రమైన బాధకు, భయానికి అది ఒక సంకేతమే అని మానసిక నిపుణులు చెబుతున్నారు.

మరి ఇలాంటి ప్రవర్తనకు వాళ్ల చిన్ననాటి జ్ఞాపకాలు కారణం కావొచ్చు. అలాగే గతంలో ఎదురైన చేదు అనుభవాలు లేదా నమ్మకద్రోహాలు కూడా రీజన్ అవుతాయి. తమలో ఈ లోపం ఉందని వాళ్లు స్వయంగా గుర్తించి, మారాలని అనుకుంటే మాత్రం వారిలో ఈ రకమైన ప్రవర్తనలో మార్పు సాధ్యమవుతుంది.
బంధంలో సమస్యలు వచ్చినప్పుడు ఒకరినొకరు నిందించుకోవడం ఆపి, ఇద్దరూ కలిసి చర్చించుకోవడం వల్ల ఈ బ్లాక్ అండ్ వైట్ ఆలోచనా విధానం నుంచి బయటకు రావొచ్చు. ప్రేమ, బంధం అనేవి కేవలం సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు.. కష్టాలు, అపార్థాలు వచ్చినప్పుడు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని నిలబడటంలోనే ఉంటుందన్న విషయాన్ని అర్ధం చేసుకుంటే బండరాయి మనస్తత్వం నుంచి ఈజీగా బయటపడొచ్చు.
Gold Prices : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం ధరలు





