HealthLatest News

Aura: తలనొప్పి, మానసిక అలసట వదలడం లేదా? మీ జీవితంలో ఆరా పాత్ర తెలుసుకోండి..

Aura: మనిషి చుట్టూ ఉండే తెల్లటి కాంతి మసకబారినప్పుడు మనసులోనూ, ఒంట్లోనూ కొన్ని మార్పులు వస్తాయి.

Aura

ప్రతి మనిషి చుట్టూ ఒక రకమైన కాంతి వలయం, శక్తి వలయం ఉంటుంది. దీనినే ఆరా (Aura) అని అంటారు. దీనిలో ఉండే రంగుల్లో వైట్ ఆరా అంటే తెల్లటి కాంతి వలయం చాలా మంచిది. ఎందుకంటే ఇది మనిషి తల భాగంలో ఉండే క్రౌన్ చక్రతో ముడిపడి ఉంటుంది. మనిషి చుట్టూ ఉన్న ఈ తెల్లటి కాంతి బలంగా ఉన్నప్పుడు వారి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు దీనివల్ల లోపల మంచి తెలివితేటలు పెరుగుతాయి, జీవితంపైన నమ్మకం కుదురుతుంది.

కానీ, ఆ వ్యక్తి జీవితంలో ఫేస్ చేసే విపరీతమైన టెన్షన్లు, కొన్ని ఇబ్బందుల వల్ల ఈ తెల్లటి కాంతి బలహీనపడితే మాత్రం మనిషి తీవ్రమైన గందరగోళంలో పడిపోతాడు. అసలు ఈ తెల్లటి కాంతి తగ్గినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, దానిని మళ్లీ ఎలా పెంచుకోవాలన్న దానిపై నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు.

అయితే మనిషి చుట్టూ ఉండే ఈ తెల్లటి కాంతి మసకబారినప్పుడు మనసులోనూ, ఒంట్లోనూ కొన్ని మార్పులు వస్తాయి. జీవితం పైకి ఎంత బాగున్నా సరే లోపల మాత్రం ఏదో తెలియని శూన్యం, ఒంటరితనం వేధిస్తుంటాయి. ఏ పని చేద్దామన్నా కూడా తమపై తమకు నమ్మకం పోతుంది. ప్రతి చిన్న విషయానికి విపరీతంగా ఆలోచించడం ఎక్కువయిపోతుంది.

అంతేకాదు దేవుడిపైన, ప్రకృతిపైన కూడా నమ్మకం తగ్గిపోతుంది. ఎంత రెస్ట్ తీసుకున్నా తగ్గని ఒక రకమైన అలసట, నిస్పత్తువ వస్తుంది. చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడితే వారి ఒంట్లో ఓపిక అంతా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. శారీరకంగా చూస్తే తరచూ తలనొప్పి రావడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, తల తిరగడం, మైండ్ అంతా గందరగోళంగా మారడం వంటి సమస్యలు వస్తాయి.

ఈ ఆరాను తిరిగి పెంచుకోవడం పెద్ద కష్టమేమీ కాదట. దీనికోసం కాసేపు మనల్ని మనం సముదాయించుకుంటే చాలు. ఎప్పుడూ ఏదో ఒకదాని కోసం పరిగెత్తే మనసుకు కాసేపు అయినా రెస్ట్ ఇవ్వాలి. దీనికోసం ప్రతిరోజూ కూడా కాసేపు ధ్యానం చేయడం లేదా దేవుడిని ప్రార్ధించడం ఆ రెండూ కుదరకపోతే ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఒకచోట కూర్చోవడం అయినా అలవాటు చేసుకోవాలి.

మనసులోని బాధలను, టెన్షన్స్‌ను ఒక బుక్‌లో రాసుకోవడం వల్ల కూడా మనసు తేలికవుతుంది. లేని వాటి గురించి అవి లేవు ఇవి లేవని బాధపడటం కంటే..తమ జీవితంలో ఉన్న వాటికి యూనివర్స్‌కు, దేవుడికి థాంక్స్ చెప్పుకోవడం అలవాటు చేసుకుంటే మనసులోని నెగిటివిటీ పోయి పాజిటివిటీ వస్తుంది.

దీంతో పాటు మన ప్రశాంతతను పాడుచేసే వ్యక్తులతో పాటు.. గొడవలకు కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రోజులో కనీసం ఒక్కసారైనా తాను సురక్షితంగా ఉన్నానని.. అంతా మంచికే జరుగుతుంది, తనకు ప్రకృతి అండగా ఉందని మనసులో గట్టిగా అనుకోవడం వల్ల మన చుట్టూ ఒక రక్షణ కవచం తిరిగి ఏర్పడుతుంది.

Aura
Aura

మనలోని వైట్ ఆరా(Aura)ను, తలలోని క్రౌన్ చక్రాన్ని తిరిగి యాక్టివేట్ చేయడానికి కొన్ని స్పెషల్ మ్యూజిక్ శబ్దాలు కూడా బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఇంటర్నెట్‌లో దొరికే 963 Hz మ్యూజిక్ ప్రతీరోజూ కాసేపు కళ్లు మూసుకుని వినడం వల్ల దైవ భక్తి పెరుగుతుంది. దీంతో పాటు 852 Hz మ్యూజిక్ కూడా మనసుకు కావాల్సినంత క్లారిటీ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఒకవేళ ఇవి వినకపోయినా ప్రశాంతమైన మెడిటేషన్ సాంగ్స్ అలాగే గుడి గంటల శబ్దాలు వినడం లేదా పూర్తిగా నిశ్శబ్దంలో గడపడం వల్ల కూడా మనిషిలోని వైట్ ఆరా మళ్లీ మునుపటిలా మెరుస్తుంది. దీనివల్ల మనసుకు హాయి లభించి జీవితంపై మంచి అవగాహన రావడంతో పాటు మనిషి ప్రశాంతంగా కనిపిస్తారని నిపుణులు సూచిస్తున్నారు.

Relatives: బంధువులలో పెరుగుతున్న నిశ్శబ్ద విషం..చుట్టాల ఎదుగుదలను ఎందుకు ఓర్వలేకపోతున్నారు?

Related Articles

Back to top button