Just NationalJust PoliticalLatest News

BJP : బీజేపీలోకి విజయ్ మాజీ భార్య ?..కాషాయ పార్టీ మాస్టర్ ప్లాన్

BJP : తమిళ రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమ పార్టీలోకి రావాలని విజయ్ సతీమణి సంగీతకు బీజేపీ ఆహ్వానం పంపినట్టు సమాచారం

BJP

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. నిన్నటి వరకూ కలిసి ఉన్నవాళ్లు ప్రత్యర్థులుగా మారొచ్చు. ఒకే కుటుంబం నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఉండొచ్చు. ప్రత్యర్థి పార్టీని దెబ్బ కొట్టడానికి ఆ నేతల సన్నిహితులను, బంధువులను తమ పార్టీ నుంచి బరిలోకి దింపొచ్చు. ప్రస్తుతం ఇదే తరహా రాజకీయాన్ని తమిళనాడులో చేసేందుకు బీజేపీ(BJP) సిద్ధమవుతోంది.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని అందుకున్న హీరో, టీవీకే చీఫ్ విజయ్ తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎన్నికల సమయంలో విజయ్ కు కనీసం 14 సీట్లు కూడా రావన్న అంచనాలే ఎక్కువగా వినిపించాయి. తీరా చూస్తే 100కు పైగా సీట్లతో సంచలన విజయాన్ని నమోదు చేశాడు. అయితే ఎన్నికల ప్రచార సమయంలో తన వ్యక్తిగత జీవితంతో ప్రత్యర్థులకు విజయ్ టార్గెట్ గా మారారు. ఇవేమీ ఎన్నికల్లో అతనిపై వ్యతిరేకతను తీసుకురాలేదు.

కానీ విజయ్ భార్య సంగీత ఎన్నికల ముందు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం, ఆ సందర్భంగా పిటిషన్ లో తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఓ ప్రముఖ నటితో సన్నిహితంగా ఉంటున్నాడంటూ ఆరోపిస్తూ విడాకులు కావాలని కోర్టును కోరింది. దీనిపై కోర్టు విచారణ జరుగుతుండగానే రాజీ పద్ధతిలో సమస్య పరిష్కారానికి రెండు వర్గాలు నిర్ణయించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా సంగీత ఎక్కడ ఉన్నారోనన్న ఆసక్తి చాలామందిలో కనిపించింది. లండన్ లో తన పిల్లలతో నివాసముంటున్నట్టు కూడా సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పుడు సంగీతను తమిళ రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమ పార్టీలోకి రావాలని విజయ్ సతీమణి సంగీతకు బీజేపీ(BJP) ఆహ్వానం పంపినట్టు సమాచారం.

BJP
BJP

త్వరలోనే సంగీత కాషాయ పార్టీలో చేరబోతున్నట్టు తమిళనాడులో జోరుగా ప్రచారం సాగుతోంది. విజయ్ కు మాజీ భార్యతోనే రాజకీయంగా చెక్ పెట్టే ఆలోచనతోనే ఆమెను పార్టీలోకి బీజేపీ(BJP) ఆహ్వానించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ పార్టీలోని ఓ ప్రముఖ నటి.. సంగీతను పార్టీలోనికి తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.

ఇదిలా ఉండగా, సంగీత శ్రీలంక తమిళ వ్యాపార కుటుంబ నేపథ్యం కలిగిన వ్యక్తి. అనంతరం ఆమె కుటుంబం బ్రిటన్‌కు వలస వెళ్లి లండన్‌లో స్థిరపడింది. విజయ్‌, సంగీత మధ్య పరిచయం ప్రేమగా మారి 1999లో వివాహబంధంతో ఒక్కటయ్యారు.

Inter Students : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సమ్మర్ హాలీడేస్‌ పొడిగింపు

Related Articles

Back to top button