Slippers:ఇంట్లో చెప్పులు వేసుకుని తిరుగుతున్నారా? ఆర్థోపెడిక్ నిపుణులు చెప్తున్న ఆ 4 షాకింగ్ హెల్త్ సీక్రెట్స్ ఏంటి?
Slippers: ఇంట్లో కూడా చెప్పులతోనే తిరుగుతున్నారు. అయితే దీనిని ఫ్యాషన్ కిందో, ప్రెస్టీజ్ ఇష్యూ కోసమో అనుకోకూడదని.. కేవలం హెల్త్ కోసం అందరూ వాడాల్సిందేనని డాక్టర్లు చెబుతున్నారు.
Slippers
ఒకప్పుడు బయటకు చెప్పులు లేకుండా వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఇంట్లో కూడా చెప్పులతోనే తిరుగుతున్నారు. అయితే దీనిని ఫ్యాషన్ కిందో, ప్రెస్టీజ్ ఇష్యూ కోసమో అనుకోకూడదని.. కేవలం హెల్త్ కోసం అందరూ వాడాల్సిందేనని డాక్టర్లు చెబుతున్నారు.
ఇంట్లో చెప్పులు(Slippers) లేకుండా నడవడం చాలామందికి అలవాటు. కానీ ఇప్పుడు ఫ్లోర్ అంతా గట్టి మార్బుల్స్, టైల్స్ లేదా గ్రానైట్‌తో ఉంటున్నాయి. ఇలాంటి గట్టి నేలపై చెప్పులు లేకుండా ఒట్టిగా తిరగడం వల్ల చాలామందికి పాదాల నొప్పులు వస్తున్నాయి. అందుకే ఇంట్లోనే వేసుకునేలా మెత్తటి స్లిప్పర్స్ వాడటం చాలా మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
మనం ఇంట్లో ఉండే గట్టి ఫ్లోరింగ్‌పై చెప్పులు(Slippers) లేకుండా నడిచినప్పుడు, ఒంటి బరువు మొత్తం పాదాలపై పడుతుంది. పూర్వం రోజుల్లో లాగా మట్టి నేల అయితే కాళ్లకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడున్న గట్టి టైల్స్ , మార్బుల్స్ వల్ల ప్రతి అడుగుకూ పాదాల నరాలు గట్టిగా ఒత్తుకుపోతాయి. దీంతో మడమ నొప్పులు, పాదాలు మంటలు రావడం మొదలవుతాయి. అదే ఇంట్లో మెత్తటి చెప్పులు వేసుకోవడం వల్ల అవి పాదాలకు, కాళ్లకు ఒక రక్షణలా పనిచేసి నొప్పులు రాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి.
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవడం వల్ల కేవలం పాదాలకే కాదు, మోకాళ్లు, నడుము నొప్పులు కూడా రాకుండా ఉంటాయి. గట్టి నేలపై నడిచేటప్పుడు పాదాలకు తగిలే ఒత్తిడి ..మెల్లగా మోకాళ్లపై, నడుముపైన పడుతుంది. దీనివల్ల చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదముంటుంది. మెత్తని చెప్పులు వాడటం వల్ల ఆ ఒత్తిడి తగ్గి జాయింట్స్ అన్నీ సేఫ్‌గా ఉంటాయి. ముఖ్యంగా వంటింట్లో గంటల తరబడి నిలబడి వంట చేసే స్త్రీలకు ఈ మెత్తని చెప్పులు కాళ్ల అలసటను బాగా తగ్గిస్తాయి.

అంతేకాకుండా ఇంట్లో చెప్పులు(Slippers) వేసుకోవడం వల్ల పాదాల అందాన్ని కాపాడుకోవచ్చు. చెప్పులు లేకుండా తిరగడం వల్ల పాదాల చర్మం ఆరిపోయి, మడమల పగుళ్లు రావడం, డెడ్ స్కిన్ పేరుకుపోవడం వంటివి జరుగుతాయి. మెత్తని చెప్పులు పాదాలను ఎప్పుడూ సాఫ్ట్‌గా ఉంచుతాయి.
ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు కచ్చితంగా చెప్పులు వేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో తిరిగేటప్పుడు ఏదైనా చిన్న పిన్ను లేదా వస్తువు గుచ్చుకుని గాయమైతే, షుగర్ ఉన్నవాళ్లకు అది త్వరగా మానకపోవడంతో అదే పెద్ద ఇన్ఫెక్షన్కు దారి తీసే అవకాశం ఉంటుంది.
Chrononutrition : క్రోనోన్యూట్రిషన్ అంటే తెలుసా? తెగ ట్రెండ్ అవుతున్న వెయిట్ లాస్ రెమిడీ





