Just TelanganaLatest News

Upasana: మెగా కోడలుకు మెగా బాధ్యత..రేవంత్ కీలక నిర్ణయం

Upasana : కార్పొరేట్ నుంచి క్రీడల రంగానికి ఉపాసన అరంగేట్రం చేస్తూ..తెలంగాణ ప్రభుత్వంలో కీలక స్థానానికి మెగా కోడలు చేరుకున్నారు . తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కు కో–ఛైర్‌పర్సన్‌గా ఉపాసన కామినేనిని

Upasana

కార్పొరేట్ నుంచి క్రీడల రంగానికి ఉపాసన (Upasana) అరంగేట్రం చేస్తూ..తెలంగాణ(Telangana) ప్రభుత్వంలో కీలక స్థానానికి మెగా కోడలు చేరుకున్నారు . తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కు కో–ఛైర్‌పర్సన్‌గా ఉపాసన కామినేనిని నియమించడంపై ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి (mega star chiranjeevi) కూడా తన సంతోషాన్ని తెలియజేశారు. వ్యాపార రంగానికే పరిమితం కాకుండా, సేవా రంగం నుంచి వైద్యం వరకు, మహిళా శక్తి నుంచి యువత అభివృద్ధి వరకు అన్ని వైపులా తళుక్కుమన్న ఆమె… ఇప్పుడు క్రీడా రంగానికి శక్తినిస్తున్న నాయకురాలిగా ముందుకొస్తున్నారు.

Upasana
Upasana

సామాజిక బాధ్యతపై ఆత్మనిబద్ధత, ఆరోగ్య రంగంలో మార్పులు తీసుకురావాలనే కల, కార్పొరేట్ వ్యాపారంలో ఉజ్వలంగా పెరిగిన కెరీర్‌తో పాటు… ఇప్పుడు తెలంగాణ యువతలో దాగిన ప్రతిభను వెలికి తీయాలన్న లక్ష్యంతో ముందుకు వస్తున్నారు ఉపాసన.

అంతర్జాతీయ వ్యాపార విశ్లేషకులు కూడా ఉపాసన లీడర్‌షిప్‌ను ప్రశంసించిన సందర్భాలున్నాయి. అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్న ఆమె, మహిళల ఆరోగ్యం, మాతృత్వం, మానసిక ఆరోగ్యం విషయంలో ఎన్నో విషయాలలో ముందుంది. ‘సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ అనే మాటకు నిండైన అర్ధాన్ని ఇచ్చిన ఆమె… ఇప్పుడు తెలంగాణ క్రీడా రంగానికి కొత్త దారి తీసే అవకాశం కోసం సిద్ధమవుతోంది.

ఇది గౌరవపదవి మాత్రమే కాదు. ఇది ఒక బాధ్యత. ఇదే విషయాన్ని చిరంజీవి(Chiranjeevi) గుర్తుచేశారు.ఉపాసన నిబద్ధత, ప్యాషన్‌ ద్వారా కొత్తతరానికి మార్గదర్శకత్వం ఇవ్వగలదని నమ్ముతున్నాను, అంటూ చిరంజీవి తన గర్వాన్ని వ్యక్తం చేశారు. ఉపాసన కూడా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) నిర్ణయానికి ధన్యవాదాలు చెబుతూ..తెలంగాణలో క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు పని చేస్తా’’ అని ప్రకటించారు.

తెలంగాణ యువతకు స్పోర్ట్స్‌(sports)లో అవకాశాలు, తగిన ప్రోత్సాహం ఇవ్వాలంటే అలాంటి బాధ్యతాయుతమైన నేతృత్వం అవసరం. ఉపాసన ఇప్పటిదాకా ఆరోగ్య రంగానికి పరిమితమైంది అనుకుంటే, ఇప్పుడు ఆ అవధుల్ని దాటి ప్రజా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు.

సంజీవ్ గోయెంకా వంటి టాప్ కార్పొరేట్ లీడర్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం ద్వారా ఉపాసనకు మరో విశేష గుర్తింపు దక్కింది. ఇది ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, మెగా ఫ్యామిలీ ప్రతిష్టకు మరింత బలమిచ్చే ఘట్టంగానే చెప్పుకోవాలి.

Also Read: Literature: ఎన్నాళ్లయిందో..!

 

Related Articles

Back to top button