Notes :మరో డెసిషన్ తీసుకుంటున్న ఆర్బీఐ ..ఇక ఆ 3 నోట్లు కనిపించవా?
Notes : ప్రస్తుతం వాడుతున్న కాగితపు నోట్ల స్థానంలో.. ఎప్పటికీ చినిగిపోని, నీళ్లలో తడిచినా పాడవని సరికొత్త ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను మార్కెట్లోకి తీసుకురావడానికి ఆర్బీఐ ప్లాన్ చేస్తోంది.
Notes
మనం రెగ్యులర్‌గా వాడుకునే కరెన్సీ నోట్ల రూపం త్వరలోనే పూర్తిగా మారిపోబోతోందట. దేశంలో పెద్ద నోట్ల రద్దు జరిగి పదేళ్లు పూర్తి అవుతున్న ఈ సమయంలో, ఆర్బీఐ భారత కరెన్సీ వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వాడుతున్న కాగితపు నోట్ల స్థానంలో.. ఎప్పటికీ చినిగిపోని, నీళ్లలో తడిచినా పాడవని సరికొత్త ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను(Notes) మార్కెట్లోకి తీసుకురావడానికి ఆర్బీఐ ప్లాన్ చేస్తోంది.
నిజానికి భారత దేశంలో ప్రతి ఏటా నోట్ల(Notes) ముద్రణ కోసం అవుతున్న ఖర్చు ఆర్బీఐకి పెద్ద తలనొప్పిగా మారింది. కేవలం గత 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే కొత్త నోట్ల ప్రింటింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం.. ఏకంగా రూ.6,372 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది.
దీనికి తోడు ఎక్కువగా వాడే వంద, ఐదు వందల నోట్లు మార్కెట్లో విపరీతంగా చేతులు మారడం వల్ల చాలా త్వరగా మురికిగా అయిపోవడంతో పాటు నోట్లు త్వరగా చినిగిపోతున్నాయి. ఇలా పాడైపోయిన కోట్లాది నోట్లను ఏరిపారేసి, మళ్లీ వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రింట్ చేయడానికి ఆర్బీఐ ప్రతి ఏడాది వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఈ వృథా ఖర్చుకు అర్జంటుగా బ్రేక్ వేయడానికే ఈ ప్లాస్టిక్ నోట్ల ఆలోచన తెరపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ కొత్త నోట్లను బయాక్సియల్లీ ఓరియెంటెడ్ పాలీప్రొపైలీన్ అనే ఒక స్పెషల్ సింథటిక్ ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారు చేస్తారు. ఇవి చూడటానికి చాలా పల్చగా, చేత్తో ఎంత నలిపినా మళ్లీ పాత రూపంలోకి వచ్చేంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. కాగితపు నోట్లతో పోలిస్తే ఇవి సుమారు నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి.
అంతేకాదు, వీటిని కాపీ కొట్టి ఫేక్ నోట్లు తయారు చేయడం ఎవరికీ సాధ్యం కాదన్నది కేంద్రం ఆలోచన. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ నోట్లలో అత్యంత హైటెక్ సెక్యూరిటీ ఫీచర్లను కూడా అమర్చవచ్చు. అయితే ఈ నోట్ల కోసం బ్యాంకులు కొత్తగా ఏటీఎం మిషన్లు మార్చాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతం ఉన్న ఏటీఎంల ద్వారానే వీటిని ఈజీగా విత్‌డ్రా చేసుకోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ ప్లాస్టిక్ నోట్ల కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు. ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, ఇండోనేషియా, మలేషియా వంటి దాదాపు 60కి పైగా దేశాలు ఈ పాలిమర్ నోట్లను వాడుతూనే ఉన్నాయి.
భారత దేశంలో కూడా 2012లోనే ఈ విధానాన్ని తేవాలని చూసినా కొన్ని టెక్నికల్ కారణాల వల్ల అప్పట్లో బ్రేక్ పడింది. కానీ మారుతున్న కాలంతో పాటు డిజిటల్ యుగంలో నోట్ల ముద్రణ భారాన్ని తగ్గించుకోవడానికి ఆర్బీఐ ఈసారి పక్కా స్కెచ్‌తో ముందుకు వెళ్తోంది. త్వరలోనే అందరి చేతుల్లోకి ఈ కొత్త ప్లాస్టిక్ నోట్లు రావడం గ్యారంటీగా కనిపిస్తోంది.
Pawan Kalyan :తెలంగాణలో పవన్ కళ్యాణ్,లోకేష్ స్కెచ్..జూన్ 2న జనసేనాని మీటింగ్‌తో సమీకరణాలు మారతాయా?





