Just Andhra PradeshJust PoliticalLatest News

AP Cabinet : ఏపీ కేబినెట్ నిర్ణయాలు.. మంత్రి మండలి ఓకే చెప్పిన 37 ప్రతిపాదనలు ఏంటి?

AP Cabinet : ఈ భేటీలో రాజధాని అమరావతి పునర్నిర్మాణం, పోలవరం పనులు, టూరిజం, ఉపాధి కల్పన వంటి అంశాలకు పెద్దపీట వేశారు. కేబినెట్ ముగిసిన తర్వాత సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ వివరాలను వెల్లడించారు.

AP Cabinet

సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో జరిగిన ఏపీ కేబినెట్(AP Cabinet) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి ఊతమిచ్చేలా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. దీనిలో భాగంగా మొత్తం 37 ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోద ముద్రను వేసింది. ఈ భేటీలో రాజధాని అమరావతి పునర్నిర్మాణం, పోలవరం పనులు, టూరిజం, ఉపాధి కల్పన వంటి అంశాలకు పెద్దపీట వేశారు. కేబినెట్ ముగిసిన తర్వాత సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ వివరాలను వెల్లడించారు.

రాజధాని అమరావతిని మళ్లీ గాడిన పెట్టడానికి వీలుగా కేబినెట్ భారీగా నిధులను కేటాయించింది. అమరావతి హైకోర్టు భవన సముదాయం పరిధిలో అంతర్గత రహదారుల నిర్మాణం, నీటి వనరుల ఏర్పాటు, ప్రీకాస్ట్ ఫిన్స్ పనుల నిమిత్తం 547.07 కోట్ల రూపాయలను మంజూరు చేశారు.

అలాగే కృష్ణా నది ఒడ్డున 6 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి ఐ అనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టును పీపీపీ విధానంలో నిర్మించేందుకు వీలుగా టెండర్లకు అనుమతిని ఇచ్చారు.

అమరావతిని అంతర్జాతీయ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏర్పాటు కానున్న అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్టుకు కేటాయించిన సుమారు 50 ఎకరాల భూమికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి 100 శాతం మినహాయింపును ఇస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. వీటితో పాటు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల నివాస వసతుల్లో లేటెస్ట్ ఆటోమేషన్ సదుపాయాల కోసం 94.90 కోట్ల రూపాయల ఎల్-1 బిడ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

భూముల కేటాయింపులు , ల్యాండ్ పూలింగ్ నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్ పాలసీ సవరణలపై కూడా ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. విశాఖపట్నంలోని మధురవాడ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి రిసార్టులు, స్టార్ హోటళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా ఏపీటీడీసీకి 9.39 ఎకరాల భూమిని బదలాయించడానికి కేబినెట్ అంగీకరించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఏవియేషన్ రంగాన్ని సరికొత్తగా ఆధునీకరించే టార్గెట్‌తో ఏపీ ఏవియేషన్ పాలసీ 2026-31 కి కేబినెట్ ఆమోదం తెలిపింది. టూరిజం రంగాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి విశాఖపట్నం, చీరాల సముద్ర తీరాలలో బీచ్ షాక్ ఎక్సైజ్ పాలసీని పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకురానున్నారు.

ఇటు గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల అనుసంధానతను పెంచడానికి నేషనల్ హైవే -216 నుంచి రోడ్డు, రైల్వే లైన్ల నిర్మాణానికి అవసరమైన భూములను ఏపీ మారిటైమ్ బోర్డుకు అప్పగించబోతున్నారు. ఏపీ వ్యాప్తంగా ఏపీ ఫైబర్‌నెట్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడానికి హడ్కో ద్వారా 300 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకోవడానికి వీలుగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఏపీ ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది.

జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను స్పీడప్ చేయడానికి కేబినెట్(AP Cabinet) కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువకు సంబంధించిన 5 , 5A ప్యాకేజీలలో నిలిచిపోయిన పనులు పూర్తి చేయడానికి 796.66 కోట్ల రూపాయల సవరించిన నిధులకు పరిపాలనా అనుమతులను కూడా మంజూరు చేసింది.

AP Cabinet
AP Cabinet

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో వికసిత్ భారత్ – రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) చట్టాన్ని రాబోయే జూలై 1 నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో కేంద్రం వాటా అరవై శాతం, ఏపీ వాటా 40 శాతంగా ఉంటుంది.

వైద్య రంగంలో అవయవ మార్పిడి ప్రక్రియలను అత్యంత పారదర్శకంగా మార్చడానికి , అవినీతికి అడ్డుకట్ట వేయడానికి మానవ అవయవాల మార్పిడి సవరణ ఆర్డినెన్స్-2026 కు ఆమోదం లభించింది. కాకినాడ అర్బన్ పరిధిలో టీడీపీ జిల్లా ఆఫీస్ నిర్మాణానికి 1.45 ఎకరాల ప్రభుత్వ భూమిని 66 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ఎంతో మంది బాధితులు ఉన్న అగ్రిగోల్డ్ కేసుల విచారణను మరింత స్పీడప్ చేయడానికి వీలుగా అదనంగా 21 పోస్టుల మంజూరుకు కేబినెట్(AP Cabinet) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

TET : టీచర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ పరీక్షలు

Related Articles

Back to top button