Just LifestyleLatest News

People : తప్పు చేసినవాడు హ్యాపీగా నిద్రపోతుంటే, మంచివాళ్లే ఎందుకు ఏడుస్తారు?..దీనిపై సైకాలజీ ఏం చెబుతుంది.

People : ప్రతి మనిషికి కూడా తమ గురించి తాము ఒక మంచి ఇమేజ్‌ను మైండ్‌లో క్రియేట్ చేసుకుంటారు. తాను ఎంతో ఉత్తముడినని, న్యాయవంతుడినని చెప్పుకుంటూ ఉంటారు

People

మన సొసైటీలో మనకు తరచూ ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఎవరికీ కీడు చేయకుండా, అందరికీ మంచి చేయాలని చూసే వాళ్లు.. మనశ్శాంతి కోల్పోయి, రాత్రిళ్లు నిద్ర లేకుండా గడుపుతూ ఉంటారు. కానీ అదే సమయంలో ఎదుటివారిని మోసం చేస్తూ.. అన్యాయమైన దారిలో నడిచే వ్యక్తులు(People) మాత్రం ఎలాంటి గిల్ట్ కానీ భయం కానీ లేకుండా చాలా ప్రశాంతంగా నిద్రపోతుంటారు.

అలాంటి వారిని చూసినప్పుడు అసలు వీళ్లకు మనస్సాక్షి అనేదే లేదా? చేసిన తప్పుల గురించిన కనీస పశ్చాత్తాపం కూడా లేకుండా ఎలా ఉండగలుగుతున్నారనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులోనూ కలుగుతుంది.

అయితే, తప్పు చేసినవాడు ఇంత నిశ్చింతగా ఉండటం వెనుక సొసైటీ చూసే తప్పొప్పుల కంటే, వారి మెదడు వారికి అనుకూలంగా మార్చుకునే ఒక విచిత్రమైన మానసిక ప్రక్రియ దాగి ఉంది. దీనిని సైకాలజీలో కాగ్నిటివ్ డిసోనెన్స్ అండ్ రేషనలైజేషన్ అనే సిద్ధాంతాల ద్వారా చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు.

మొదటిగా, ప్రతి మనిషి(People) కూడా తమ గురించి తాము ఒక మంచి ఇమేజ్‌ను మైండ్‌లో క్రియేట్ చేసుకుంటారు. తాను ఎంతో ఉత్తముడినని, న్యాయవంతుడినని చెప్పుకుంటూ ఉంటారు. అయితే, అలాంటి వ్యక్తి ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు, అతని పాత నమ్మకానికి, ప్రస్తుత తప్పు ప్రవర్తనకు మధ్య మైండ్‌లో ఒక పెద్ద సంఘర్షణ మొదలవుతుంది. దీనినే సైకాలజీలో కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటే మానసిక అసమతుల్యత అంటారు.

ఈ సంఘర్షణ వల్ల మెదడులో ఒకలాంటి ఒత్తిడి, అసౌకర్యం పుడతాయి. ఈ ఒత్తిడిని తట్టుకోవడం అతనికి సాధ్యం కాదు. అందుకే అలాంటి ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి, అపరాధ భావన కలగకుండా ఉండటానికి ఆ వ్యక్తి (People)తన మైండ్‌ను తానే మోసం చేసుకోవడం స్టార్ట్ చేస్తుంటాడు . అలా మోసం చేసే ప్రక్రియనే సైకాలజీలో రేషనలైజేషన్ అంటే సమర్థించుకోవడం అంటారు.

అంటే, తాను చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి ఏదో ఒక కారణం వెతుక్కుని సమర్థించుకోవడం అన్నమాట. ఉదాహరణకు, ఒకరిని మోసం చేసిన వ్యక్తి తాను చేసింది తప్పు కాదు, ఈ రోజుల్లో అందరూ ఇలాగే బతుకుతున్నారని.. తాను అలా చేయకపోతే తనను చేతకానివాడు అంటారని సరిపెట్టుకుంటాడు.

లంచం తీసుకునే వ్యక్తి జీతాలు తక్కువగా ఉన్నాయి కాబట్టే తాను లంచం తీసుకుంటున్నానని తన తప్పుకు ఒక న్యాయమైన రంగును దర్జాగా పూస్తాడు. ఇలా తమకు అనుకూలంగా కథలు అల్లేసుకోవడం వల్ల వాళ్ల మనసులో ఉన్న అపరాధ భావన పూర్తిగా చచ్చిపోతుంది. ఎప్పుడైతే మైండ్ ఆ తప్పును రైట్ అని నమ్మేస్తుందో, అప్పుడు వారికి ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ ఉండదు, దీంతో వారు హ్యాపీగా నిద్రపోతారు.

మరి మంచివాళ్లు ఎందుకు బాధపడతారనే విషయానికి వస్తే, మంచి మనసు ఉన్నవారిలో ఎంపతీ అంటే ఎదుటివారి బాధను అర్థం చేసుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. తాము కావాలని ఏ తప్పూ చేయకపోయినా కూడా తమ వల్ల ఎక్కడ ఎదుటివారికి చిన్న కష్టం కలిగిందో అంటూ ఒక ఆలోచన వారిని వెంటాడుతూనే ఉంటుంది.

వారి మనస్సాక్షి చాలా యాక్టివ్‌గా ఉండటం వల్ల, చిన్న చిన్న విషయాలను కూడా పదే పదే ఆలోచిస్తూ లోపల లోపలే నలిగిపోతుంటారు. అలా తప్పు చేసినవాడు తన మైండ్‌ను రీప్రోగ్రామ్ చేసుకుని మరీ ప్రశాంతంగా ఉంటే, ఏ తప్పూ చేయని మంచివాడు మాత్రం తన మనశ్శాంతిని పాడు చేసుకుంటాడు.

People
People

నిజానికి సొసైటీలో తప్పు చేసినవాడు నిశ్చింతగా ఉన్నాడంటే దానర్థం వాడు సుఖంగా, సంతోషంగా ఉన్నాడని కాదు, కేవలం వాడు తన తప్పులను కప్పిపుచ్చుకునే ఒక మానసిక రక్షణ కవచాన్ని అంటే డిఫెన్స్ మెకానిజంను వాడుకుంటున్నాడని అర్థం.

ఎవరి మైండ్ గేమ్ వారిని అప్పుడు ప్రశాంతంగా ఉంచినా కూడా నిజాయితీగా బతికే మంచి మనసుకు ఉండే విలువ మాత్రం ఎప్పటికీ తగ్గదు. మన మనస్సాక్షి ప్యూర్‌గా ఉన్నప్పుడు వచ్చే అసలైన తృప్తి ముందు, తప్పులను సమర్థించుకుంటూ పొందే టెంపరరీ సంతోషం చాలా చిన్నదని గుర్తుంచుకోవాలి.

నువ్వుల మ్యాజిక్.. రోజూ ఇలా తింటే ఎముకలు ఇనుములా మారతాయట

జస్ట్ తెలుగు న్యూస్ వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Back to top button