Legal Notice : మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు.. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ఎంపీ కొడుకు వార్నింగ్
Legal Notice : టీఎంసీ రెబల్ ఎంపీ కకోలీ ఘోష్ కొడుకు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ ఏకంగా మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపించడంతో ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
Legal Notice
పశ్చిమ బెంగాల్ పాలిటిక్స్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ పవర్ కోల్పోయినప్పటి నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఓవైపు పార్టీ చేజారిన అధికారం, మరోవైపు సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి , టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఎదురు తిరుగుతుండటంతో దీదీకి పెద్ద హెడేక్‌గా మారింది.
ఇలాంటి సమయంలోనే తాజాగా మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. టీఎంసీ రెబల్ ఎంపీ కకోలీ ఘోష్ కొడుకు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ ఏకంగా మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు(Legal Notice) పంపించడంతో ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
కేవలం మాజీ సీఎం మమతా బెనర్జీకే కాకుండా, ఆ పార్టీకి చెందిన ప్రముఖ ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ, సౌగతా రాయ్, మహువా మోయిత్రాలకు కూడా డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ ఈ నోటీసులు పంపారు.
బరసత్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయడానికి తాను టీఎంసీ పార్టీ టికెట్ ఆశించినట్లు.. ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణలకు ఆ నేతలందరూ బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆ నోటీసులలో డిమాండ్ చేశారు. ఒకవేళ వీరంతా ఈ నోటీసులకు స్పందించకపోతే కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించడం హాట్ టాపిక్ అయింది.
అసలు ఈ వివాదం ఎక్కడ మొదలయిందంటే.. ఇటీవల జరిగిన ఒక పొలిటికల్ మీటింగ్‌లో మాట్లాడిన మమతా బెనర్జీ ..బరసత్ ఎమ్మెల్యే టికెట్ కోసం తనను కొందరు సంప్రదించారని చెప్పారు. కానీ తమ పార్టీలోని సీనియర్ నేతలు దీనికి ఒప్పుకోకపోవడంతో తాము ఆ టికెట్ ఇవ్వలేదని క్లియర్ చేశారు.
దీంతో పాటు ఇంట్లో ఒకరు ఎంపీ అయినంత మాత్రాన ఫ్యామిలీలోని వారందరికీ ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు కావాలా అంటూ కకోలీ ఘోష్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పరోక్షంగా సెటైర్లు వేశారు. ఈ కామెంట్ల తర్వాతే కకోలి ఘోష్ టీఎంసీ పార్టీని వీడటంతో పాటు.. తన కొడుకుకు టికెట్ ఇవ్వకపోవడంతోనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి సపోర్ట్ ఇచ్చారనే ప్రచారం సాగింది.
అయితే తమపై వస్తున్న ఈ ప్రచారాన్ని బైద్యనాథ్ ఘోష్ తాజాగా ఖండించారు. తానెప్పుడూ పదవుల కోసం ఆశపడలేదని, తన కుటుంబ పరువుకు నష్టం కలిగించేలా ఆ నేతలు మాట్లాడినందుకే నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
మరోవైపు ఎంపీలు, ఎమ్మెల్యేలు కొంతమంది వరుసగా పార్టీని వీడుతుండటంతో అలర్ట్ అయిన మాజీ సీఎం మమతా బెనర్జీ, టీఎంసీ పార్టీలో కొన్ని కీలక మార్పులను చేశారు.

టీఎంసీ యూత్ ప్రెసిడెంట్‌గా నియమించిన ఏడు రోజులకే సయోని ఘోష్ ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడంతో.. ఆ స్థానాన్ని దీదీ వెంటనే భర్తీ చేశారు. సయోని ఘోష్ ప్లేస్‌లో అర్నబ్ బెనర్జీని కొత్త యూత్ వింగ్ అధ్యక్షుడిగా మమతా బెనర్జీ అపాయింట్ చేశారు.
అలాగే టీఎంసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న కోల్‌కతా దక్షిణ ఎంపీ మాలా రాయ్ ప్లేస్‌లో, కలిగంజ్ ఎమ్మెల్యే అలీఫా అహ్మద్‌ను నియమిస్తూ.. తృణమూల్ కాంగ్రెస్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సొంత పార్టీ నేతలే ఇలా లీగల్ నోటీసులతో(Legal Notice) కోర్టుల చుట్టూ తిప్పేలా ప్లాన్ చేస్తూ ఉండటంతో బెంగాల్ పాలిటిక్స్ ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి.
Libra :ఈ రాశివారిది శాంతిని కోరుకునే హృదయం..నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు





