Vishwambhara: విశ్వంభర నుంచి స్టన్నింగ్ లుక్… ఆషిక సర్ప్రైజ్ పోస్టర్ రిలీజ్
Vishwambhara: విశ్వంభరపై క్రేజీ అప్‌డేట్: చిరుతో ఆషిక రౌండీ ఎంట్రీ!

Vishwambhara
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ విజువల్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’ (Vishwambhara)పై మరో క్రేజీ అప్‌డేట్ బైటకు వచ్చింది. ఇప్పటికే భారీ సెట్స్, గాడ్‌లీ కాన్సెప్ట్, కీరవాణి సంగీతం వంటి అంచనాలతో టాక్‌లో ఉన్న ఈ సినిమాకు… ఇప్పుడు మరో గ్లామరస్ హైలైట్ జత కాబోతోంది. చిరుతో స్క్రీన్ షేర్ చేయబోయే కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ (Ashika Ranganath )లుక్‌ను మేకర్స్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు.
ఆషిక పోస్ట్ చూసిన ఫ్యాన్స్ మాత్రం పగలే కలలు కంటున్నారు! “ఈ పాత్ర సినిమాలో ఓ కీలక మలుపు తీసుకురాబోతుందే” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి, త్రిష ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది.స్పెషల్ పోస్టర్స్, మేకింగ్ గ్లింప్సులు, బీహైండ్ ద సీన్స్ వీడియోలతో హైప్ పెంచేలా ప్లాన్ జరుగుతోంది. ఫ్యాంటసీ, మైథాలజీ మిక్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం(Vishwambhara) ప్రమోషన్ బర్త్‌డే పోస్టర్‌తో బిగిన్ అయిందంటే… ఇకపై ఒక్కో అప్‌డేట్ భారీ బ్లాస్ట్ లాగే ఉండనుందన్న మాట.
ఆషిక క్యారెక్టర్‌లో కనిపించే డెప్త్, కళ్లలో ఉన్న ఇన్‌టెన్సిటీ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. త్రిష, ఆషిక ఇద్దరూ ఈ సినిమాలో మెగాస్టార్ సరసన మెరవడం విశేషమే. వీరి పాత్రలు కేవలం గ్లామర్ కోణంలో కాకుండా, స్టోరీకి కీలకంగా ఉంటాయన్న టాక్ కూడా వినిపిస్తోంది.

వినాయక చవితి లేదా దసరా లాంటి పండుగ సీజన్‌లో విశ్వంభర (Vishwambhara)సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రణాళిక వేసుకుంటుండగా, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలం చేకూర్చనుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ప్రాజెక్టుల్లో తన మార్క్ చూపించిన కీరవాణి… ‘విశ్వంభర’కు పనిచేస్తుండటం హైలెట్ .
మొత్తంగా ప్రమోషన్ పరంగానూ యూవీ క్రియేషన్స్ ట్రాక్ మారింది. పుట్టినరోజు పోస్టర్‌తో ప్రారంభమైన ప్రచార యాత్ర ఇక నుంచి మరింత ఉత్సాహంగా సాగబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
One Comment