Just SportsLatest News

Vaibhav : వైభవ్‌ని ముంచేసే ఆ అంచనాల ట్రాప్ ఏంటి? ప్యాడీ ఆప్టన్ ఎందుకలా అన్నారు?

Vaibhav : టీమిండియా మాజీ మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై బీసీసీఐకి కొన్ని విలువైన సూచనలు ఇచ్చారు

Vaibhav

టీమిండియాలో ప్రతీ ప్లేయర్ పై అంచనాలుంటాయి. బాగా ఆడుతుంటే అవి ఇంకా పెరిగిపోతుంటాయి. మరీ ముఖ్యంగా 15 ఏళ్లకే సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్(Vaibhav) సూర్యవంశీ ఇప్పుడు భారత క్రికెట్ కే కాదు వరల్డ్ క్రికెట్ కే పెద్ద వండర్ అయ్యాడు. 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ బౌలర్లను ఉతికారేస్తూ హాట్ టాపిక్ గా మారాడు.

ఐపీఎల్ అరంగేట్రంలోనే సెంచరీ చేసిన వైభవ్(Vaibhav) ఈ సీజన్ లోనూ దుమ్మురేపాడు. లీడింగ్ స్కోరర్ గా నిలిచి ఆరెంజ్ క్యాప్ తో పాటు పలు అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనతోనే భారత్ ఏ జట్టులోకి, ఆపై టీమిండియాలోకి కూడా అడుగుపెట్టాడు. ప్రస్తుతం ముక్కోణపు సిరీస్ లో అంచనాలు అందుకోలేకపోవడంతో అప్పుడే విమర్శలు మొదలయ్యాయి.

పైగా శ్రీలంక ఆటగాడితో మైదానంలో గొడవ పడడంతో మరిన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ సందర్భంలో టీమిండియా మాజీ మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై బీసీసీఐకి కొన్ని విలువైన సూచనలు ఇచ్చారు.

ఇప్ప‌టివ‌ర‌కు పలు మంచి ఇన్నింగ్స్ లతో విజ‌యాల‌నే చూసిన వైభ‌వ్(Vaibhav).. ఇకపై అప్పుడప్పుడూ వచ్చే వైఫల్యాలను కూడా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని ఆప్టన్ సూచించారు. ప్యాడీ ఆప్టన్ గతంలో భార‌త జ‌ట్టుకు మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా త‌న సేవ‌ల‌ను అందించాడు.

2011లో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలవడంలోనూ, 2009లో టెస్ట్ క్రికెట్‌లో నంబర్ వన్ స్థానానికి చేరడంలోనూ కీల‌క పాత్ర‌ పోషించాడు. ఆటగాళ్లను మానసికంగా బలంగా తీర్చిదిద్దడంలో ప్యాడీ ఆప్టన్ కు మంచి పేరుంది. తాజాగా వైభ‌వ్ సూర్య‌వంశీ ఆటను ప్రశంసించిన ఆప్టన్, వైభవ్ కు 15 ఏళ్లే కావడంతో తనను బీసీసీఐ జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడు.

ఏ ప్లేయ‌ర్ కూడా త‌న కెరీర్ అంత‌టా ఒకే ఫామ్‌ను కొన‌సాగించ‌లేడ‌నే విషయాన్ని వైభవ్ అర్థం చేసుకోవాలన్నాడు. ప్రతీ మ్యాచ్ లోనూ అతని నుంచి ఐపీఎల్ లాంటి ఇన్నింగ్స్ లు ఆశించడం కూడా సరికాదన్నాడు. సహజంగానే వైభవ్ పై ఇప్పుడు అంచనాలు రెట్టింపు అయిపోయాయనీ, అవి అందుకోలేని రోజున విమర్శలు తప్పవన్నాడు.

Vaibhav
Vaibhav

అయితే ఇలాంటి విమర్శలకు దూరంగా, మానసికంగా ధృడంగా ఉంచేందుకు బీసీసీఐ అతని విషయంలో చర్యలు తీసుకోవాలన్నాడు. ప్రతీ ఆటగాడు ఏదో ఒక దశలో తమ ఫామ్‌ను కోల్పోతుంటారనీ, సచిన్, కోహ్లీ వంటి దిగ్గజాలకు కూడా ఇది ఎదురైన అనుభవమేనని చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్ని వైభవ్ కు ఎల్లప్పుడూ అర్థమయ్యేలా చెబుతూ అతని కెరీర్ ను తీర్చిదిద్దాలన్నాడు.

ఇదిలా ఉంటే అంచనాలు పెరిగిపోయి, బయటి నుంచి వచ్చే విమర్శలు, స్టార్ హోదా వంటి వాటితో చాలా మంది ప్లేయర్స్ కెరీర్ లు కొంతకాలానికే ముగిసిపోయిన విషయాలను కూడా ప్యాడీ ఆప్టన్ గుర్తు చేశాడు. ఇప్పుడు వైభవ్ కి కూడా తక్కువ వయసులోనే సెలబ్రిటీ హోదా వచ్చిందని, అతని విషయంలో బీసీసీఐ అప్రమత్తంగా ఉండాలని సూచించాడు.

Akshara Gupta : 15 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ..బీహార్ మహిళా క్రికెటర్ సంచలనం

Related Articles

Back to top button