Just SportsLatest News

Akshara Gupta : 15 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ..బీహార్ మహిళా క్రికెటర్ సంచలనం

Akshara Gupta : బీహార్ కు చెందిన 15 ఏళ్ల అక్షర గుప్తా చరిత్ర సృష్టించింది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ట్రిపుల్ సెంచరీ బాదేసింది

Akshara Gupta

భారత క్రికెట్‌లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల నుంచే రికార్డులు కొల్లగొడుతుంటే ఇప్పుడు అదే బీహార్ నుంచి మహిళల క్రికెట్‌లో మరో చిచ్చర పిడుగు దూసుకొస్తోంది. బీహార్‌కు చెందిన 15 ఏళ్ల అక్షర గుప్తా(Akshara Gupta) చరిత్ర సృష్టించింది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ట్రిపుల్ సెంచరీ బాదేసింది.

కేవలం 126 బంతుల్లో 306 పరుగులు చేసిన అక్షర గుప్తా .. ఏకంగా వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. బీహార్ క్రికెట్ అసోసియేషన్ అండర్-19 మహిళల వన్డే క్రికెట్ టోర్నీలో ఆమె ఈ ఘనత సాధించింది. ఈ టోర్నీ ప్రారంభమైన తొలి రోజే అక్షర గుప్తా(Akshara Gupta) వార్తల్లో నిలిచింది.

242.86 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన అక్షర ఇన్నింగ్స్‌లో 55 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. మ్యాచ్ ఆరంభం నుంచే విధ్వంసం సృష్టించిన ఈ యువ క్రికెటర్ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, తర్వాత 34 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. ఆమె బ్యాటింగ్ విధ్వంసం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. ఈ సందర్భంగా అక్షర గుప్తా పలు రికార్డులను అందుకుంది.

భారత దేశవాళీ మహిళా క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇప్పటి వరకూ ముంబైకి చెందిన ఇరా గుప్తా పేరుతో ఉంది. గతంలో ఇరా గుప్తా ఒక రాష్ట్ర స్థాయి మ్యాచ్‌లో 346 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్ లో 42 ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయి.

Akshara Gupta
Akshara Gupta

తాజాగా అక్షర గుప్తా ఆ రికార్డును బ్రేక్ చేసింది. అక్షర గుప్తా బ్యాటింగ్‌కు బీహార్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ హర్ష్ వర్ధన్, సెక్రటరీ జియావుల్ అరెఫిన్ అక్షరగుప్తాను ప్రత్యేకంగా అభినందించారు. బీహార్ క్రికెటర్లు రాష్ట్రం గర్వపడేలా ఆడుతున్నారంటూ వీరిద్దరూ కితాబిచ్చారు.

ఇదిలా ఉంటే బీహార్ నుంచి ఇప్పటికే వైభవ్ సూర్యవంశీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఐపీఎల్ అరంగేట్రంలో సెంచరీ బాదిన వైభవ్‌కు తగ్గట్టే అక్షర గుప్తా కూడా దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతోంది. వన్డే క్రికెట్‌లో సెంచరీ చేయడమే గొప్ప అనుకుంటే ..ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాదిన అక్షర గుప్తాపై ప్రశంసలు జల్లు కురుస్తోంది.

Pakistan : బంగాళాఖాతంలో దాయాది కొత్త వ్యూహం.. ఘాజీ పరాభవం తర్వాత మళ్లీ పాక్ కుయుక్తులు ఎందుకు?

Related Articles

Back to top button