Just SportsLatest News

IND vs AFG : ఆఫ్గాన్‌కు క్లీన్ స్వీప్ గండం.. వైట్‌వాష్‌ నుంచి తప్పించుకోగలదా?

IND vs AFG : వరుసగా రెండు వన్డేల్లోనూ ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసిన టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇప్పుడు చివరి మ్యాచ్ లోనూ గెలిచి వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని ఉత్సాహంగా ఉంది

IND vs AFG

సొంతగడ్డపై టీమిండియా మరో క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌ను ఊడ్చేయాలని ఎదురుచూస్తోంది. చెన్నై వేదికగా జరగబోయే చివరి వన్డేలోనూ గెలిచి 3-0 తో సిరీస్ ను స్వీప్ చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఏకైక టెస్టుతో పాటు తర్వాత వరుసగా రెండు వన్డేల్లోనూ ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా(IND vs AFG) సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఇప్పుడు చివరి మ్యాచ్‌లోనూ గెలిచి వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని ఉత్సాహంగా ఉంది. ఈ సిరీస్‌లో గిల్, ఇషాన్ కిషన్ అదరగొడుతున్నారు. రోహిత్ శర్మ కూడా పర్వాలేదనిపిస్తున్నా పూర్తిస్థాయి మెరుపులు మాత్రం ఇంకా మెరిపించలేదు. దీంతో చివరి వన్డేలో రోహిత్ శర్మపైనే అందరి చూపూ ఉంది. వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కాలంటే మాత్రం రోహిత్ దాదాపు తాను ఆడే ప్రతీ మ్యాచ్ లోనూ అదరగొట్టాల్సిందే.

ఇదిలా ఉంటే మన బ్యాటింగ్ లైనప్‌లో ప్రస్తుతం గిల్, ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్ లో వీరిద్దరూ సూపర్ సెంచరీలతో దుమ్మురేపారు. వీరి విధ్వంసం వల్లే భారత్ 400 ప్లస్ స్కోరు సాధించింది. మరోసారి గిల్, ఇషాన్ చెలరేగితే ఆఫ్గాన్ బౌలర్లకు చుక్కలే. మిగిలిన బ్యాటర్లలో జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్‌పైన కూడా అంచనాలున్నాయి.

మరోవైపు బౌలింగ్‌లోనూ భారత్ అదరగొడుతోంది. అరంగేట్రంలోనే గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ ఆకట్టుకున్నారు. బుమ్రా లేకపోవడంతో పేస్ భారాన్ని మోస్తున్న అర్షదీప్‌తో పాటు యువ పేసర్లు సత్తా చాటుతున్నారు.

IND vs AFG
IND vs AFG

కాగా చివరి వన్డేకు హర్షిత్ రాణా కూడా జట్టుతో చేరడంతో తుది జట్టులో మార్పులు జరిగే అవకాశముంది. రెండో వన్డేలో హర్ష్ దూబేకు రెస్ట్ ఇచ్చి , కుల్దీప్‌ను ఆడించారు. అలాగే నితీశ్ రెడ్డి, ప్రసిధ్ కృష్ణ స్థానాల్లో జైస్వాల్, ప్రిన్స్ యాదవ్ ఆడారు. ఇప్పుడు చివరి వన్డేకు నితీశ్ రెడ్డి, ప్రసిధ్ కృష్ణ రానుండగా.. కుల్దీప్‌ను కొనసాగిస్తారా లేదా అనేది చూడాలి.

మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ చివరి మ్యాచ్‌లో గట్టిపోటీనివ్వాలని పట్టుదలగా ఉంది. బ్యాటింగ్ లో గుర్బాజ్ తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమవుతున్నారు. అటు బౌలింగ్ లోనూ ఆఫ్గాన్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఆఫ్గాన్ ఎంత గట్టిపోటీ ఇచ్చినా క్లీన్ స్వీప్‌ను తప్పించుకునే పరిస్థితి కనిపించడం లేదు.

Pisces : అతిగా నమ్మే బలహీనత..మీనరాశి వారికి ఏ నెంబర్, ఏ దేవుడి పూజ కలిసి వస్తుంది?

Related Articles

Back to top button