Glamping Tourism : గ్లాంపింగ్ టూరిజం.. ప్రకృతి ప్రేమికులను పిచ్చెక్కిస్తున్న ట్రావెల్ ట్రెండ్..
Glamping Tourism : బిజీ లైఫ్ నుంచి కాస్తంత విరామాన్ని కోరుకుంటూ, ప్రకృతికి దగ్గరగా వెళ్లాలనుకునే ఈ తరం వాళ్లకు గ్లాంపింగ్ ఒక పర్ఫెక్ట్ ఆప్షన్‌గా మారింది.
Glamping Tourism
ప్రకృతి ఒడిలో గడపాలని.. పచ్చని అడవులు లేదా ఎత్తైన కొండల మధ్య రాత్రి సమయంలో స్టే చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ, అక్కడికి వెళ్లాక కష్టపడి టెంట్లు వేసుకోవడం, కీటకాలు , దోమల భయం, సరైన టాయిలెట్ సౌకర్యం లేకపోవడం, చలికి , ఎండకు తట్టుకోలేకపోవడం వంటి కొన్ని ఇబ్బందుల వల్ల చాలా మంది క్యాంపింగ్‌కు వెళ్లడానికి వెనకడుగు వేస్తుంటారు.
అయితే, ప్రకృతిని ఆస్వాదిస్తూ.. అసలు ఎలాంటి కష్టాలు కూడా లేకుండా, ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లగ్జరీని అనుభవించాలనుకునే వారి కోసం ఇప్పుడు పుట్టిందే గ్లాంపింగ్. అంటే గ్లామరస్, క్యాంపింగ్ అనే రెండు పదాల కలయికతో ఏర్పడిన కొత్త ట్రావెల్ ట్రెండ్ ఇప్పుడు వరల్డ్ వైడ్‌గానే కాకుండా భారతీయులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది.
సింపుల్‌గా చెప్పాలంటే గ్లాంపింగ్ అంటే ప్రకృతి మధ్యలో ఉండే ఒక లగ్జరీయస్ రిసార్ట్ అనుభవం. ఇక్కడ అడవుల్లోనో, కొండలపైనో లేదా నదీ తీరాల్లోనో ఉన్న టెంట్లలోనే ఉంటున్నాకూడా అందులో అడుగుపెడితే మాత్రం ఒక లగ్జరీ హోటల్ రూమ్ లాగా కనిపిస్తుంది.
చుట్టూ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు కనిపిస్తూ, టెంట్ లోపల కింగ్ సైజ్ సాఫ్ట్ బెడ్స్, సెంట్రలైజ్డ్ ఏసీ, లేటెస్ట్ మోడల్ వాష్‌రూమ్స్, రూమ్ సర్వీస్ వంటి ఫైవ్ స్టార్ సౌకర్యాలతో పాటు అలాంటి ప్రాంతంలో కూడా వైఫై అందుబాటులో ఉంటుంది. ఎండలు, చలిగాలుల ఇబ్బంది లేకుండా, కీటకాల భయం అస్సలు లేకుండా ప్రకృతిని ఎంతో ప్రశాంతంగా, విలాసవంతంగా ఆస్వాదించడమే ఈ గ్లాంపింగ్ టూరిజం(Glamping Tourism) స్పెషాలిటీ.
భారత దేశంలో కూడా ఈ గ్లాంపింగ్ టూరిజం(Glamping Tourism) ఈ మధ్య కాలంలో బాగానే పుంజుకుంది. భారతదేశంలో ఈ లగ్జరీ క్యాంపింగ్ అనుభవాన్ని పొందడం కోసం కొన్ని అద్భుతమైన ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయి. రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఎడారి ప్రాంతంలోని.. థార్ ఎడారి ఇసుక తిన్నెల మధ్య ఏర్పాటు చేసిన రాయల్ టెంట్లలో ఇలా గ్లాంపింగ్ చేయడం ఒక మరపురాని అనుభవాన్ని ఇస్తుంది.
అలాగే వన్యప్రాణుల ప్రేమికుల కోసం రణథంబోర్ నేషనల్ పార్క్ సమీపంలోని అడవి మధ్యలో లగ్జరీ గ్లాంపింగ్ టెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ వన్యప్రాణులను చూస్తూ మనకు కావాల్సినంత ఎంజాయ్‌మెంట్‌తో విలాసవంతమైన జీవితాన్ని గడపొచ్చు.
కొండ ప్రాంతాలు, కూల్ వాతావరణాన్ని ఇష్టపడే వారి కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి.. కేరళలోని మున్నార్ కొండల్లో పచ్చని తోటల మధ్య విలాసవంతమైన జియోడెసిక్ డోమ్స్ అంటే గ్లాస్ లేదా ప్రత్యేక మెటీరియల్‌తో చేసే గుండ్రటి టెంట్లు అందుబాటులోకి వచ్చాయి.

ఇక్కడి టెంట్లలో బెడ్‌పై పడుకుని రాత్రి వేళ ఆకాశంలో నక్షత్రాలను, ఉదయాన్నే మంచు కొండల అందాలను వీక్షించొచ్చు. గోవా బీచ్‌ల తీరంలో కూడా సముద్రపు అలల సవ్వడిని వింటూ గడిపే లగ్జరీ బీచ్ గ్లాంపింగ్ టెంట్లు పర్యాటకులను ఇటీవల బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పటి బిజీ లైఫ్ నుంచి కాస్తంత విరామాన్ని కోరుకుంటూ, ప్రకృతికి దగ్గరగా వెళ్లాలనుకునే ఈ తరం వాళ్లకు ఈ గ్లాంపింగ్ ఒక పర్ఫెక్ట్ ఆప్షన్‌గా మారింది. అంతేకాకుండా ట్రెక్కింగ్ , క్యాంపింగ్ అంటే కేవలం యూత్ మాత్రమే చేయగలరనే అపోహను చెరిపేస్తూ కుటుంబ సమేతంగా ప్రకృతిని ఆస్వాదించడానికి ఈ ట్రెండ్ ఎంతగానో ఉపయోగపడుతోంది.
Ram Charan : పెద్ది సక్సెస్ వేళ రామ్ చరణ్ పెద్ద మనసు.. అనాథ పిల్లలకు క్రేజీ బహుమతి





