Just EntertainmentLatest News

Ram Charan : పెద్ది సక్సెస్ వేళ రామ్ చరణ్ పెద్ద మనసు.. అనాథ పిల్లలకు క్రేజీ బహుమతి

Ram Charan : పెద్ది టీమ్ అనాథ ఆశ్రమాలలోని పిల్లలకు రామ్ చరణ్ స్వయంగా సంతకం చేసిన క్రికెట్ బ్యాట్లు గిఫ్ట్‌గా ఇవ్వడం అందరి హృదయాలను గెలుచుకుంది.

Ram Charan

లేటెస్ట్ సెన్సేషన్ పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లతో భారీ విక్టరీని నమోదు చేసింది. మంగళవారం జరిగిన మెగా సక్సెస్ ఈవెంట్‌లో చీఫ్ గెస్ట్‌గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ..మూవీ యూనిట్‌ను అభినందించారు. అయితే, ఈ మూవీ సాధించిన వసూళ్ల కంటే కూడా, పెద్ది టీమ్ అనాథ ఆశ్రమాలలోని పిల్లలకు రామ్ చరణ్(Ram Charan) స్వయంగా సంతకం చేసిన క్రికెట్ బ్యాట్లు గిఫ్ట్‌గా ఇవ్వడం అందరి హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సినిమా ప్రమోషన్స్‌ కోసం టీ-షర్టులు, క్యాప్‌లు, చిన్న చిన్న కీచైన్‌లు పంచడం మనం చూస్తుంటాం. కానీ పెద్ది టీమ్ స్పెషల్‌గా క్రికెట్ బ్యాట్లను ఎంచుకుంది.ఎందుకంటే ఈ మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్‌కు, ఆయన వాడే క్రికెట్ బ్యాట్‌కు కథ పరంగా చాలా ఇంపార్టెన్స్ ఉంది.

సినిమాలో ఒక పవర్‌ఫుల్ ఎలిమెంట్ అండ్ యాక్షన్ సీక్వెన్స్‌లో ఈ బ్యాట్ ఒక మెయిన్ వెపన్‌గా, హీరో మార్క్ సింబల్‌గా కనిపిస్తుంది. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఎంతో స్పెషల్‌గా డిజైన్ చేసిన ఈ బ్యాట్.. మూవీ చూసిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా పిల్లలకు బాగా కనెక్ట్ అవుతుంది.

Ram Charan
Ram Charan

మామూలుగానే మన దేశంలో పిల్లలకు క్రికెట్ అంటే చాలా క్రేజ్. దానికి తోడు మూవీలో హీరో వాడిన పవర్‌ఫుల్ బ్యాట్ రెప్లికా తమ వద్దకు రావడం, పైగా దానిపై రామ్ చరణ్(Ram Charan) ఒరిజినల్ సైన్ ఉండటం వల్ల ఆ గిఫ్ట్ పిల్లలకు ఎప్పటికీ మర్చిపోలేని ఒక మెమరీగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు .

 

View this post on Instagram

 

A post shared by Tea Time Telugu (@teatime_telugu)


Silent Treatment : మాట్లాడకుండా ఇచ్చే సైలెంట్ ట్రీట్మెంట్..మీ భాగస్వామిలోనూ ఇది కన్పిస్తుందా?

Related Articles

Back to top button