Just SportsLatest News

Vaibhav : వైభవ్ విషయంలో కంగారొద్దు .. గంభీర్ వ్యూహాత్మక నిర్ణయం అదేనట..

Vaibhav : ఐర్లాండ్ వంటి చిన్న జట్టుపై వైభవ్ విధ్వంసం చూడటానికి ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూసారు.నిజానికి వైభవ్ సూర్యవంశీ కోసమే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

Vaibhav

ఐర్లాండ్ టూర్‌లో చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఐపీఎల్ లోనూ తర్వాత ట్రై సిరీస్ ఫైనల్లోనూ దుమ్మురేపడంతో బుడ్డోడి అంతర్జాతీయ అరంగేట్రం ఖాయమని అంతా అనుకున్నారు. పైగా ఐర్లాండ్ వంటి చిన్న జట్టుపై వైభవ్ విధ్వంసం చూడటానికి ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూసారు.

నిజానికి వైభవ్ సూర్యవంశీ కోసమే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తీరా చూస్తే వైభవ్‌ను(Vaibhav) తుది జట్టులోకి తీసుకోలేదు. రెండో మ్యాచ్‌లోనైనా ఆడిస్తారని ఫ్యాన్స్ ఎదురుచూడగా అది కూడా జరగలేదు. అయితే వైభవ్ విషయంలో కోచ్ గంభీర్ పూర్తి క్లారిటీతోనే ఉన్నట్టు తెలుస్తోంది.

బుడ్డోడి విషయంలో కంగారుపడకూడదని గంభీర్ భావిస్తున్నాడు. వ్యూహాత్మకంగానే గంభీర్ వైభవ్‌(Vaibhav) సూర్యవంశీని ఆడించలేదు. విదేశీ పిచ్‌లు, స్వింగ్ అయ్యే పరిస్థితుల్లో డైరెక్టుగా ఆడించడం సరికాదని గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఒకవేళ అక్కడి పిచ్‌లపై విఫలమైతే అది వైభవ్ ఆత్మవిశ్వాసంపై చాలా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని వెల్లడించాడు. అతనికి సరైన సమయం వచ్చినప్పుడు అవకాశం ఇస్తామని కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా స్పష్టం చేశాడు.

మరోవైపు భారత జట్టులో ఇప్పటికే సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి అనుభవజ్ఞులైన, ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు ఉన్నారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో అలాగే గత సిరీస్‌లలో కూడా వీరంతా అద్భుతంగా రాణించారు. కేవలం ఒక కొత్త ఆటగాడికి అవకాశం ఇవ్వడం కోసం ఫామ్‌లో ఉన్న సీనియర్ ఆటగాళ్లను తప్పించడం సరైంది కాదని టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది.

Vaibhav
Vaibhav

కాగా బెల్‌ఫాస్ట్‌లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో భారత జట్టుకు సరైన ప్రాక్టీస్ కూడా లేదు. విదేశీ పిచ్‌లు, స్వింగ్ అయ్యే పరిస్థితుల్లో తగినంత ప్రాక్టీస్ లేకుండా 15 ఏళ్ల వైభవ్‌ను ఆడిస్తే అతను ఇబ్బంది పడే అవకాశముంది. ఇదే కారణంతో వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకోలేదు.

అయితే ఐర్లాండ్ చేతిలో భారత్ 0-2తో సిరీస్ ఓడిపోవడంతో వైభవ్ కు అవకాశమిస్తే ఫలితం వేరేలా ఉండేదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ముందున్న ఇంగ్లాండ్ కీలక సిరీస్, ఆసియా క్రీడలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో వైభవ్‌కు త్వరలోనే భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Ben Stokes : బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం..అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై

Related Articles

Back to top button