Gautam Adani : అమెరికా కోర్టులో అదానీ కేసు..విత్ డ్రాపై కోర్టు మెలిక
Gautam Adani : అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, ఇంకా కొందరు ఒక భారీ సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కోసం.. భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి.
Gautam Adani
భారత కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదానీపై అమెరికా కోర్టులో నమోదైన కేసు కీలక మలుపు తీసుకుంది. అదానీపై మోపిన అభియోగాలను కొట్టివేయాలని అమెరికా న్యాయశాఖ నిర్ణయించినా తుది తీర్పుకు ముందు మరిన్ని బలమైన ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసును ఉపసంహరించుకోవాలని అమెరికా న్యాయ శాఖ చేసిన అభ్యర్థనపై న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
విత్ డ్రా చేసుకునే ముందు దానికి ఉన్న కచ్చితమైన కారణాలతో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దీని కోసం జూలై 13 వరకూ గడువు విధించారు. 2024లో ఈ కేసు తెరపైకి వచ్చింది. అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, ఇంకా కొందరు ఒక భారీ సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కోసం భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి.
భారత్‌లో 12 గిగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టులు దక్కించుకోవడానికి వీలుగా పలు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులకు రూ.2 వేల కోట్లకు పైగా లంచాలు ఇవ్వడానికి ప్లాన్ చేసారని అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్ల ఆరోపణ. దీని కోసం అంతర్జాతీయ మార్కెట్‌లో భాగంగా అమెరికా పెట్టుబడిదారుల నుంచి అదానీ గ్రూప్ రూ.25 వేల కోట్లకు పైగా నిధులు సేకరించాయనీ పేర్కొన్నారు.
ఆ ఆరోపణల ఆధారంగా గౌతమ్ అదానీ(Gautam Adani), ఆయన మేనల్లుడు సాగర్ అదానీతో పాటు మరికొందరిపై సెక్యూరిటీల మోసం, ఫెమా ఉల్లంఘన వంటి పలు కేసులు నమోదు చేశారు. కానీ ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది.
ఈ కేసు విచారణ జరుగుతుండగానే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, విదేశీ అవినీతి పద్ధతుల చట్టం అమలుపై ఉన్న ఆంక్షలను సడలించేలా ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు అదానీ గ్రూప్ అమెరికాలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించడంతో అదానీపై ఉన్న ఆరోపణలను పూర్తిగా కొట్టివేయాలని అమెరికా న్యాయ శాఖ కోర్టును కోరింది.

ఇదే సమయంలో సివిల్ కేసులకు సంబంధించిన ఆరోపణల పరిష్కారానికి గౌతమ్ అదానీ(Gautam Adani) మొత్తం 18 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించడానికి అంగీకరించారు. అలాగే ఇరాన్ ఆంక్షల ఉల్లంఘన కేసులో అదానీ గ్రూప్ అమెరికా ట్రెజరీకి 275 మిలియన్ డాలర్లు చెల్లించేలా సెటిల్‌మెంట్ చేసుకున్నారు.
ఈ పరిణామాలతో తాజా కేసు కూడా ముగుస్తుందని అంతా భావించారు. అయితే అంత పెద్ద లంచం కేసులో అభియోగాలను ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారో ప్రభుత్వం ఇచ్చిన వివరణపై అమెరికా ఫెడరల్ కోర్టు సంతృప్తి చెందలేదు. దీంతో సమగ్ర వివరణతో కూడిన నివేదికను కోరింది.
Ketan : పూణే మర్డర్ కేసులో మరో ట్విస్ట్.. క్రూయల్ మైండ్‌తో పక్కా క్రైమ్ స్కెచ్ అంత దారుణమా?





