Narendra Modi :భారత్,ఇండోనేషియా మైత్రిలో సరికొత్త స్వర్ణ యుగం..2 దేశాల ఆర్థిక గమనాన్ని మోదీ పర్యటన మార్చబోతోందా?
Narendra Modi :ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన బింటాంగ్ ఆదిపూర్ణను ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేయడం రెండు దేశాల మధ్య ఉన్న గాఢమైన స్నేహ బంధానికి నిదర్శనంగా నిలిచింది.
Narendra Modi
ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఇండోనేషియా పర్యటన.. భారత్-ఇండోనేషియా దేశాల దౌత్య సంబంధాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మైలురాయిగా నిలిచింది. డిఫెన్స్ , ట్రేడ్, డిజిటల్ టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, విద్య, ఖనిజాలు, కల్చర్ వంటి బహుముఖ రంగాలలో ఏకంగా 20 కీలక ఒప్పందాలు , అవగాహన పత్రాలు కుదిరాయి.
ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం హిందూ మహాసముద్ర ప్రాంతంలో , ప్రపంచ వేదికపై భారతదేశ స్థానాన్ని మరింత స్ట్రాంగ్ చేయనుంది. ఈ టూర్లో భాగంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన బింటాంగ్ ఆదిపూర్ణను ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)కి ప్రదానం చేయడం రెండు దేశాల మధ్య ఉన్న గాఢమైన స్నేహ బంధానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ టూర్లో రక్షణ రంగానికి అత్యంత ప్రయారిటీ లభించింది. ఇప్పటికే భారత తయారీ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణులను వాడుతున్న ఇండోనేషియా, మరిన్ని బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకుంది. దీంతో పాటు ఇండియన్ స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన అస్త్రా బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను కూడా కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
వీటిని ఇండోనేషియాకు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానాలలో అమర్చడానికి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ టెక్నాలజీ సహాయాన్ని అందించనుంది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన సబాంగ్ పోర్టును జాయింట్‌గా డెవలప్ చేయడానికి రెండు దేశాలు అంగీకరించాయి.
అలాగే డిజిటల్ రంగానికి వస్తే, భారతదేశ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ నమూనా ఆధారంగా ఇండోనేషియాలో ఐఓఎన్ పేరిట డిజిటల్ కామర్స్ నెట్‌వర్క్‌ను ప్రారంభించబోతున్నారు. భారతదేశ యూపీఐ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను అక్కడ అమలు చేయడం ద్వారా రెండు దేశాల వ్యాపారులకు , టూరిస్టులకు డిజిటల్ లావాదేవీలు మరింత ఈజీ కాబోతున్నాయి.
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, 2029లో జరగబోయే ఇండోనేషియా సాధారణ ఎలక్షన్స్ నిర్వహణ కోసం భారత ఎలక్షన్ ఎక్స్పర్ట్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల రూపకల్పనలో టెక్నాలజీ హెల్ఫ్ అందించనుంది. ఖనిజ రంగంలో ఉక్కు, నికెల్ , రేర్ ఎర్త్ ఖనిజాల సరఫరా గొలుసును స్ట్రాంగ్ చేయడానికి రెండు దేశాలు ఒక అవగాహన అగ్రిమెంట్‌పై సంతకాలు చేశాయి.
అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు చాలా ఇంపార్టెంట్ అయిన రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ యూనిట్లలో భారత్ పెట్టుబడులు పెట్టబోతోంది. విద్యా రంగంలో భాగంగా భారత ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐఐం బెంగళూరు ఇండోనేషియాలోని సింఘసరి ఎస్ఈజెడ్లో తన ఫస్ట్ అంతర్జాతీయ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది.
సాంస్కృతిక పరంగా వెయ్యేళ్ల నాటి హిస్టారికల్ ప్రంబనన్ టెంపుల్ పునరుద్ధరణ, పరిరక్షణకు భారతదేశం టెక్నాలజీ సాయాన్ని అందించబోతోంది. ఈ పర్యటనలో మాట్లాడిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో.. తాను భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)కి పెద్ద అభిమానినని, ఇటీవల తన డీఎన్ఏ పరీక్షలో భారతీయ మూలాలు ఉన్నట్లు తేలిందని కామెంట్ చేయడం కూడా హాట్ టాపిక్ అయింది.
ఈ 20 కీలక ఒప్పందాల వల్ల భారతదేశానికి అంతర్జాతీయంగా, ఆర్థికంగా అపారమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. మెయిన్‌గా రక్షణ రంగంలో బ్రహ్మోస్ , అస్త్రా క్షిపణుల ఎగుమతుల ద్వారా మేక్ ఇన్ ఇండియా , ఆత్మనిర్భర్ భారత్ విధానాలకు ప్రపంచవ్యాప్తంగా వేదికపై ఇలాంటి గుర్తింపు లభించడమే కాకుండా దేశ డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ ఇన్కమ్ గణనీయంగా పెరుగుతుంది.
వ్యూహాత్మక సబాంగ్ పోర్టు కామన్ డెవలప్మెంట్ ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతంలో , ఇండో-పసిఫిక్ రీజియన్‌లో చైనా ప్రాబల్యానికి గట్టి అడ్డుకట్ట వేస్తూ భారత్ తన నౌకాదళ పట్టును సాధించొచ్చు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద యూపీఐ , ఓఎన్డీసీ వంటి భారతీయ టెక్నాలజీలను ఇండోనేషియా అంగీకరించడం వల్ల గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌గా భారతదేశ ప్రతిష్ట మరింత పెరుగుతుంది.

ఆర్థిక పరంగా చూస్తే కనుక, ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అత్యంత కీలకమైన నికెల్ , రేర్ ఎర్త్ ఖనిజాల సప్లై కోసం ఇండోనేషియాతో కుదిరిన ఒప్పందం భారత్ ఫ్యూచర్ గ్రీన్ ఎనర్జీ సెక్టార్‌కు ఒక పెద్ద మైలురాయి కానుంది. దీనివల్ల చైనా వంటి ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది.
ఐఐఐం బెంగళూరు అంతర్జాతీయ క్యాంపస్ ఏర్పాటు ద్వారా గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా భారతదేశం అవతరిస్తుంది. మొత్తంగా చూసినట్లయితే, ఈ అగ్రిమెంట్స్ కేవలం రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలపరచడమే కాకుండా, ఆగ్నేయాసియాలో భారతదేశాన్ని ఒక తిరుగులేని ఆర్థిక , వ్యూహాత్మక శక్తిగా నిలబెట్టడానికి బాగా ప్లస్ అవుతాయి.
The India-Indonesia friendship is strong and vibrant! 🇮🇳 🇮🇩@prabowo pic.twitter.com/U57syfi670
— Narendra Modi (@narendramodi) July 8, 2026





