Just LifestyleLatest News

Chocolate : 600లకు పైగా సువాసనలు, 5000 కిలోల బరువు.. చాక్లెట్ ప్రపంచంలోని వింతలు ఇవే..

Chocolate : పూర్వపు రోజుల్లో ప్రజలు మార్కెట్‌కో, దుకాణానికో వెళ్లినప్పుడు ఆహారం, బట్టలు వంటి ఏ వస్తువు కొనాలన్నా కూడా.. నాణేలకు బదులుగా కోకో గింజలను ఇచ్చి తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసేవారట.

Chocolate

వరల్డ్ వైడ్‌గా ఏజ్‌తో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినేవాటిలో చాక్లెట్.. ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అయితే మనం రోజూ తినే ఈ చాక్లెట్స్ వెనుక ఎవరికీ తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన నిజాలు , ఒక గొప్ప హిస్టరీ దాగి ఉన్నాయని చాలామందికి తెలీదు.

చాలా వందల ఏళ్ల క్రితం, చాక్లెట్ అనేది కేవలం ఒక తినే ఐటమ్‌ మాత్రమే కాదు.. దానిని డబ్బుగా కూడా ఉపయోగించేవారు. పూర్వపు రోజుల్లో ప్రజలు మార్కెట్‌కో, దుకాణానికో వెళ్లినప్పుడు ఆహారం, బట్టలు వంటి ఏ వస్తువు కొనాలన్నా కూడా.. నాణేలకు బదులుగా కోకో గింజలను ఇచ్చి తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసేవారట.

నిజానికి చాక్లెట్ ఎలా వస్తుందనే విషయంలో చాలా మందికి పూర్తి అవగాహన ఉండదు. నిజానికి ఇవి చెట్ల కాండాల నుంచి కాస్తాయి. ఆ చెట్టు కేవలం ఒకే రంగులో కాకుండా రంగురంగుల కాయలను ఇస్తుంది. పైగా ఇవి చూడటానికి పెద్ద ఫుట్‌బాల్ షేప్‌లో ఉంటాయి.

అలాగే చాక్లెట్ సువాసన అనేది అందరినీ బాగా అట్రాక్ట్ చేస్తుంది. సైంటిస్టుల పరిశోధనల ప్రకారం చాక్లెట్‌లో ఏకంగా 600లకు పైగా నేచురల్‌గా ఉండే సుగంధ సమ్మేళనాలు దాగి ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా పండ్ల వాసన, పూల వాసన, గింజల వాసన, కాఫీ వాసన , మట్టి వాసన వంటి ఎన్నో సువాసనలు మేళవించి ఉంటాయి.

ఇక ప్రపంచంలోనే అతి పెద్ద చాక్లెట్ బార్ ఒక ఏనుగు కంటే కూడా చాలా పెద్ద సైజులో ఉండి గిన్నిస్ రికార్డు కూడా క్రియేట్ చేసింది. కేవలం ఒక రికార్డును బ్రేక్ చేయడం కోసమే తయారు చేసిన ఆ పెద్ద చాక్లెట్ బార్ ఏకంగా 5,000 కిలోగ్రాముల బరువుతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.

ఇప్పుడు మనమంతా తినే చాక్లెట్లు(Chocolate) ఎంతో తియ్యగా ఉంటున్నాయి. కానీ, పూర్వ కాలంలో ఇవి చేదుగా , కారంగా కూడా ఉండేవి. ఎందుకంటే ఆ రోజుల్లో ఇప్పుడు దొరికేలాగా చాక్లెట్ బార్లు ఉండేవి కావు. వారు కోకో గింజలను బాగా నూరి ఒక డ్రింక్‌లా తయారు చేసుకుని తాగేవారు. ఆ సమయంలో ఆ డ్రింక్‌లో కొన్ని రకాల మూలికలు , మిరపకాయలను కూడా కలుపుకొనేవారు. అలా వారు ఆ రోజుల్లో చేదు , కారం రుచితో కూడిన చాక్లెట్లను ఆస్వాదించేవారు.

Chocolate
Chocolate

ఇప్పుడు ఈ కోకో కాయల నుంచి మనం తినే చాక్లెట్స్(Chocolate) ఎలా తయారవుతాయంటే.. ఈ ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చెట్టు కాండానికి కాసే కాయలను కోకో పాడ్స్ అని పిలుస్తారు. ఆ కాయల లోపల ఉండే కోకో గింజలను సేకరించి, ముందుగా వాటిని బాగా ఎండబెట్టి, ఆ తర్వాత ప్రత్యేక పద్ధతిలో వేయించి మెత్తటి పొడిని చేస్తారు.

ఈ పొడినే మనం మార్కెట్లో కొనే కోకో పౌడర్ అంటారు. ఇలా రెడీ అయిన కోకో పౌడర్‌కు ఫ్యాక్టరీలలో, ఇళ్లలో తగినంత పాలు, కోకో బట్టర్, షుగర్ వంటి పదార్థాలను కలిపి ప్రాసెస్ చేసి మనకు నచ్చిన ప్లేవర్స్‌లో చాక్లెట్లు(Chocolate) తయారవుతాయి. అంటే చెట్టు నుంచి లభించే కాయలను డిఫరెంట్ స్టేజెస్‌లో ప్రాసెస్ చేసిన తర్వాతే చాక్లెట్ రూపంలోకి మారుస్తారు.

EPF : పీఎఫ్ ఖాతాదారులకు 2 శుభవార్తలు.. రూ.5 లక్షల వరకు ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్​మెంట్..

Related Articles

Back to top button