Just EntertainmentLatest News

Mahesh Babu : 2 ఏళ్ల చిన్నారి క్యూట్ రీల్‌కి నెటిజన్లు ఫిదా..మహేష్ బాబు కామెంట్‌తో రాత్రికి రాత్రి వైరల్

Mahesh Babu : మహేష్ బాబు పోకిరి, గుంటూరు కారం సాంగ్స్‌ను క్యూట్‌గా పాడిన రెండేళ్ల పాప ఇన్ స్టా రీల్‌పై సూపర్‌స్టార్ మహేష్ బాబు కామెంట్ చేశారు. రాత్రికి రాత్రి మిలియన్ లైక్స్ సాధించిన ఆ క్యూట్ రీల్ విశేషాలు ఇక్కడ చూడండి.

Mahesh Babu

సోషల్ మీడియా వరల్డ్‌లో ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా చిన్నారులు చేసే ముద్దు ముద్దు రీల్స్‌కి సామాన్యులే కాదు, స్టార్ సెలబ్రిటీలు కూడా మురిసిపోతుంటారు. తమకు నచ్చిన వీడియోలపై సెలబ్రిటీలు రియాక్ట్ అయితే ఇక ఆ రీల్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది.

తాజాగా అలాంటి ఒక అద్భుతమైన సంఘటనే సూపర్‌స్టార్ మహేష్ బాబు విషయంలోనూ జరిగింది. ఒక రెండేళ్ల చిన్నారి పాడిన సాంగ్స్‌కు ఫిదా అయిన మహేష్,రీల్ చూడటమే కాకుండా దాని గురించి కామెంట్ చేయడంతో ఆ పాప రాత్రికి రాత్రి సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది.

బైస్వీట్లీక్యూరియస్(bysweetlycurious) అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ తల్లి తన రెండేళ్ల చిన్నారితో కలిసి తరచూ సరదా రీల్స్ షేర్ చేస్తూ ఉంటుంది. దీనిలో భాగంగానే ఆ చిన్ని పాప మహేష్ బాబు నటించిన ఇండస్ట్రీ హిట్ పోకిరిలోని సినమాలో.. నొప్పి నొప్పి గుండెంత నొప్పి.. పాటతో పాటు, రీసెంట్ బ్లాక్‌బస్టర్ గుంటూరు కారం టైటిల్ సాంగ్‌లోని కొన్ని లైన్లను తన బుడ్డి బుడ్డి మాటలతో ఎంతో క్యూట్‌గా పాడింది. చిన్నారి క్యూట్‌నెస్, ఆమె హావభావాలు, ముద్దుగా పాడిన విధానం నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి.

ఈ క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ.. చివరకు మహేష్ బాబు(Mahesh Babu) దృష్టికి కూడా తీసుకెళ్లింది. చిన్నారి పాటలోని క్యూట్‌నెస్‌కి పూర్తిగా పడిపోయిన మహేష్(Mahesh Babu), ఆ వీడియో కింద స్పందిస్తూ కామెంట్ చేశారు. హహ… సో క్యూట్.. ఈ చిన్నారికి బోల్డంత ప్రేమ అంటూ లవ్ సింబల్స్ యాడ్ చేసి కామెంట్ చేశారు. ఇక సూపర్‌స్టార్ నుంచి డైరెక్టుగా కామెంట్ రావడంతో ఆ రీల్ రాత్రికి రాత్రి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది

మహేష్ కామెంట్ చేసిన కొద్ది గంటల్లోనే ఆ రీల్‌కు ఏకంగా 1 మిలియన్ అంటే 10 లక్షలు పైగా లైక్స్ రావడం హాట్ టాపిక్ అయింది. అంతే కాకుండా ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ ఫాలోవర్స్ నెంబర్స్ కూడా ఒక్కసారిగా పెరిగింది. సాధారణంగా సెలబ్రిటీలు చిన్నారుల టాలెంట్‌ను ప్రోత్సహించడం చూస్తుంటాం. కానీ మహేష్ బాబు చేసిన ఈ చిన్న కామెంట్ ఒక నార్మల్ ఫ్యామిలీకి చెందిన పాపను సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మార్చేసింది. ప్రస్తుతం ఈ క్యూట్ రీల్, దానిపై మహేష్ చేసిన కామెంట్ నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Jaya🌛 (@bysweetlycurious)

Indian Railways : రాత్రి 10 తర్వాత రైలులో ఇవి చేస్తే ఫైన్ తప్పదు.. కొత్త రూల్స్ వచ్చేసాయ్..

Related Articles

Back to top button