Snakes : ఆ పాములు గుడ్లు పెట్టవు..పిల్లల్ని కనే ఆ పాముల ప్రత్యేకతలేంటో తెలుసా?
Snakes : ప్రకృతిలో కొన్ని ప్రత్యేకమైన వింత పాముల జాతులు ఉన్నాయి. ఇవి ఎగ్స్ పెట్టకుండా మనుషుల లాగే డైరెక్టుగా పిల్లలకే జన్మనిస్తాయి.
Snakes
పాములు గుడ్లు పెట్టకుండా డైరెక్టుగా పిల్లలనే కంటే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఎవరికీ రాదు. కానీ కొన్ని పాముల గురించి చదివితే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. సాధారణంగా పాములు అనగానే గుడ్లు పెడతాయని, వాటి నుంచి పిల్లలు వస్తాయనే చిన్నప్పటి నుంచి విన్నాం, చదువుకున్నాం.
కానీ ప్రకృతిలో కొన్ని ప్రత్యేకమైన వింత పాముల(Snakes) జాతులు ఉన్నాయి. ఇవి ఎగ్స్ పెట్టకుండా మనుషుల లాగే డైరెక్టుగా పిల్లలకే జన్మనిస్తాయి. సైంటిఫిక్ అండ్ టెక్నికల్ భాషలో ఈ ప్రాసెస్‌ను వివిపారిటీ లేదా ఓవోవివిపారిటీ అని పిలుస్తారు. ఈ పద్ధతిలో తల్లి గర్భంలోనే గుడ్లు ఉండిపోయి.. అక్కడే పిల్లలుగా పూర్తిగా ఎదుగుతాయి.
ఎప్పుడైతే అవి బయటి ప్రపంచంలోకి రావడానికి రెడీ అవుతాయో, అప్పుడు తల్లి పాము డైరెక్టుగా పిల్లలను తన కడుపులో నుంచి బయటకు వదులుతుంది. కఠినమైన వాతావరణం, ముఖ్యంగా చలి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో నివసించే పాములకు నిజంగా ఇది ఒక పెద్ద వరం వంటిదే. ఎందుకంటే గుడ్లను బయట పెడితే చలికి అవి పాడైపోయే ప్రమాదం ఉంది, అదే తల్లి కడుపులో ఉంటే వెచ్చగా రక్షణ లభిస్తుంది.

ఇలా నేరుగా పిల్లల్ని కనే పాములలో ప్రపంచంలోనే అత్యంత భారీ పాములలో(Snakes) గ్రీన్ అనకొండ ఒకటి. దీనితో పాటు బోవా కన్‌స్ట్రిక్టర్, ప్రమాదకరమైన ర్యాటిల్ స్నేక్, గార్టర్ స్నేక్, గాబూన్ వైపర్, కాపర్‌హెడ్ స్నేక్ అలాగే సముద్రంలో నివసించే సీ స్నేక్ వంటి జాతులు కూడా గుడ్లు పెట్టవు. ఇవి తమ పిల్లలను శత్రువుల బారిన పడనీయకుండా, పుట్టే వరకు తమ శరీరంలోనే ఉంచుకుని రక్షిస్తాయి.
ఈ పాము పిల్లల మరో స్పెషాలిటీ ఏంటంటే, ఇవి పుట్టిన మరుసటి క్షణం నుంచే ఎవరి సాయం లేకుండా స్వతంత్రంగా బతకగలవు. పుట్టగానే వేగంగా కదలడం, తమ ఆహారం కోసం తామే సొంతంగా వేటాడటం వంటి లక్షణాలన్నీ వీటికి పుట్టుకతోనే వచ్చేస్తాయి. ప్రకృతిలో జీవులు మారుతున్న కాలానికి , కఠినమైన పరిస్థితులకు ఎలా అలవాటు పడతాయో చెప్పడానికి ఈ పాములే గొప్ప ఉదాహరణ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు





