Nutmeg : పరగడుపున జాజికాయ నీళ్లు..ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు మిస్ చేయరు..
Nutmeg : జాజికాయను ఇప్పుడు కేవలం మసాలాలో మాత్రమే కాకుండా, రోజువారీ హెల్త్ బూస్టర్‌గా వాడుకోవచ్చని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.
Nutmeg
ఇప్పుడు చాలామంది ఫిట్‌నెస్, వెల్‌నెస్ కోసం రకరకాల హెల్త్ డ్రింక్స్, డిటాక్స్ నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే మార్కెట్లో దొరికే కాస్ట్‌లీ ప్రొడక్ట్స్ కంటే వంటగదిలోని పోపుల పెట్టెలో గల సుగంధ ద్రవ్యాలతోనే ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.
అలాంటి వాటిలో ఒకటిగా చెప్పుకునే జాజికాయను(Nutmeg )ఇప్పుడు కేవలం మసాలాలో మాత్రమే కాకుండా, రోజువారీ హెల్త్ బూస్టర్‌గా వాడుకోవచ్చని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.
ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున కొద్దిగా జాజికాయ పొడి వేసుకున్న గోరువెచ్చని వాటర్‌ను తాగడం అలవాటు చేసుకుంటే, కొద్ది రోజుల్లోనే బాడీలో వచ్చే పాజిటివ్ చేంజెస్ చూసి మీరే ఆశ్చర్యపోతారని అంటున్నారు. జాజికాయలో ఉండే యాంటీ బయోటిక్ ప్రాపర్టీస్, కాల్షియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్.. బాడీని లోపలి నుంచి స్ట్రాంగ్ చేస్తాయని అంటున్నారు.
చాలామంది రోజంతా యాక్టివ్‌గా ఉండలేరు. అలాగే నీరసంగా అనిపిస్తుందని అంటారు. దీనికి పొట్టలో ఉండే ఇన్‌ఫెక్షన్స్ అండ్ ఇన్-డైజెషన్ ప్రధాన కారణం. ఇలాంటి వాళ్లు జాజికాయ నీళ్లు తాగడం వల్ల దానిలోని యాంటీ ఫంగల్ లక్షణాలు జీర్ణవ్యవస్థను క్లీన్ చేసి గ్యాస్, ఎసిడిటీ, బ్లోటింగ్ వంటి సమస్యలను ఈజీగా వదిలిస్తాయి.
అంతేకాదు, చాలామందిని తరచూ వేధించే మైగ్రేన్ తలనొప్పి, కండరాల పట్టేయడం లాంటి నొప్పుల నుంచి ఇది బాడీకి మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడం వల్ల సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల దగ్గరకు చేరకుండా కాపాడుకోవచ్చు.

ఈ రోజుల్లో మెజారిటీ పీపుల్ ఫేస్ చేస్తున్న ఇంకో పెద్ద ప్రాబ్లం ఒత్తిడి అండ్ నిద్రలేమి. వర్క్ ప్రెజర్ పెరిగిపోయి రాత్రిళ్లు బెడ్‌పై ఎంత అటు ఇటు దొర్లినా నిద్రపట్టని వారికి ఈ డ్రింక్ మంచి మందులా పనిచేస్తుందట. ఇది బ్రెయిన్‌ను కామ్ చేసి ప్రశాంతమైన నిద్ర వచ్చేలా చేస్తుంది.
ఇక అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా ఫేస్‌పై మొటిమలు, మచ్చలు రావడం అనేది ఒక పెద్ద తలనొప్పే. జాజికాయ(Nutmeg )పొడి నీళ్లలో కలిపి తాగడం వల్ల రక్తాన్ని శుద్ధి జరిగి టాక్సిన్స్ అన్నీ బయటకు పోయి స్కిన్ నాచురల్‌గా గ్లో అవుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే ముడతలను కూడా ఇది కంట్రోల్ చేసి, ఫేస్‌ను యంగ్‌గా ఉంచడంలో ఇది బెస్ట్ అని నిపుణులు అంటున్నారు.
Banana with Curd Rice : పెరుగన్నంలో అరటి పండు కలిపి తింటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..





