Just NationalJust PoliticalLatest News

DMK : విజయ్ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదు..తేల్చి చెప్పేసిన స్టాలిన్

DMK : ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకేను జాతీయ ప్రతిపక్ష కూటమి కిందకు తీసుకురావాలని తన మాజీ మిత్రపక్షమైన వీసీకే చేసిన పిలుపును డీఎంకే అధినేత తిరస్కరించారు.

DMK

ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమి ప్రధాన సమస్య ఐక్యత లేకపోవడమే. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను కూటమిలో చేర్చుకున్నా వాటి మధ్య ఐక్యత కుదర్చడంలో ఎప్పుడూ వైఫల్యమే.

అందుకే ప్రతీ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని అంతర్గత విభేదాలే ఎన్డీఏ కూటమికి అడ్వాంటేజ్ అవుతుంటుంది. తాజాగా తమిళనాట ఇండియా కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకేను జాతీయ ప్రతిపక్ష కూటమి కిందకు తీసుకురావాలని తన మాజీ మిత్రపక్షమైన వీసీకే చేసిన పిలుపును డీఎంకే(DMK) అధినేత తిరస్కరించారు.

రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు జాతీయ స్థాయిలో భారత కూటమిలో భాగస్వాములుగా ఉండలేమంటూ తేల్చి చెప్పారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ కూటమికి ద్రోహం చేసిందని ఆరోపించారు. ఎన్నికల తర్వాత మంత్రి పదవులు పొందడానికి మాత్రమే టీవీకేతో చేతులు కలపడం ద్వారా కాంగ్రెస్ డీఎంకేను వెన్నుపోటు పొడిచిందని ఫైర్ అయ్యారు.

బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమి బలోపేతం కోసం అందరూ కలిసికట్టుగా రావాలని వీసీకే పార్టీ అధ్యక్షుడు థోల్ తిరుమావళవన్ సూచించారు.రాష్ట్ర రాజకీయాలు , జాతీయ రాజకీయాలు వేర్వేరు అనే విధానాన్ని అనుసరించాలన్న ఆయన ప్రతిపాదనకు కాంగ్రెస్ కూడా మద్దతు పలికింది.

కానీ వీసీకే, కాంగ్రెస్ చేసిన ఈ ప్రతిపాదనను డీఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది. కేరళ, పశ్చిమ బెంగాల్ తరహాలో తమిళనాడులో డీఎంకే పనిచేయదని స్పష్టం చేశారు. తమిళనాడు ఎన్నికల తర్వాత తమకు ద్రోహం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు వీకేసీ పార్టీని మధ్యవర్తిగా పెట్టి మళ్లీ తమను ఒప్పించడానికి ప్రయత్నిస్తోందని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం తమిళనాట రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. టీవీకే ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగింది. దీంతో ఆ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న తాము వారితో చేతులు కలిపే ప్రసక్తే లేదని స్టాలిన్ కుండబద్దలు కొట్టారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలను వేర్వేరుగా చూడలేమని స్పష్టం చేశారు.

DMK
DMK

అన్నింటికీ మించి ప్రస్తుతం పార్లమెంట్‌లో ఒక్క ఎంపీ కూడా లేని టీవీకేను ఇండియా కూటమిలో చేర్చాలా.. వద్దా అనే అంశంపై కూడా విస్తృత చర్చ అవసరమని డీఎంకే(DMK )అభిప్రాయం వ్యక్తం చేసింది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం డీఏంకేను బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒకే వేదిక పైకి రావాల్సిన అవసరం ఉందని తేల్చి చెబుతోంది. భవిష్యత్తులో టీవీకేకు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం లభిస్తే ఇండియా కూటమిలో దాని పాత్రపై అప్పుడు ఆలోచిద్దామంటూ స్టాలిన్ చెబుతున్నట్టు సమాచారం.

Nagarjuna Yadav Arrest : లైవ్ డిబేట్ కామెంట్స్ ఎఫెక్ట్.. నాగార్జున యాదవ్‌ను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు

Related Articles

Back to top button