Just NationalJust BusinessLatest News

Gold And Silver : బంగారం, వెండి ధరలలో తగ్గింపు.. కొనుగోలుదారులకు కాస్త రిలీఫ్

Gold And Silver : దేశీయ మార్కెట్‌లో పుత్తడి రేట్లు కొద్దిగా క్షీణించడంతో కొనుగోలుదారులకు కొద్దిగా రిలీఫ్ లభించింది. గోల్డ్‌తో పాటే సిల్వర్ కూడా అదే బాటలో పయనిస్తోంది.

Gold And Silver

కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు శనివారం ఉదయం కాస్త అడ్డుకట్ట పడింది. దేశీయ మార్కెట్‌లో పుత్తడి రేట్లు కొద్దిగా క్షీణించడంతో కొనుగోలుదారులకు కొద్దిగా రిలీఫ్ లభించింది. గోల్డ్‌తో పాటే సిల్వర్(Gold And Silver) కూడా అదే బాటలో పయనిస్తూ ధరల్లో కొంచెం తగ్గింపును నమోదు చేసుకుంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లలో జూలై 25 శనివారం రోజు బంగారం ధరలు ఒకే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1 లక్షా 44 వేల 320 రూపాయల వద్ద విక్రయమవుతోంది.

అదే సమయానికి ఆర్నమెంట్ తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర 1లక్షా 32 వేల 290 రూపాయలుగా నమోదైంది. మరోవైపు 18 క్యారెట్ల బంగారం ధర 1లక్షా 8 వేల 240 రూపాయల వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ఇతర ముఖ్య నగరాల్లో కూడా సుమారు ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజధాని ఢిల్లీలో పది గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర లక్షా 44 వేల 470 రూపాయలకు చేరింది. ముంబై, కోల్‌కతాలో ధరలను చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ధరలే అమలవుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలో మాత్రం 18 క్యారెట్ల పసిడి ధర 1లక్షా 10 వేల 440 రూపాయలుగా రికార్డైంది.

Gold And Silver
Gold And Silver

గోల్డ్ వెనుకే సిల్వర్ కూడా తన ధరను కొద్దిగా తగ్గించుకుంది. కేజీ వెండిపై దాదాపు 100 రూపాయల వరకు తగ్గడంతో హైదరాబాద్ ,విజయవాడ మార్కెట్లలో కేజీ సిల్వర్ రౌండ్ ఫిగర్‌గా 2 లక్షల 39 వేల 900 రూపాయల వద్ద లభిస్తోంది.

అయితే అంతర్జాతీయ విపణిలో వచ్చే మార్పులతో పాటు , లోకల్‌గా ఉన్న ట్యాక్స్ పర్సంటేజ్‌ల ఆధారంగా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లలో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి.

Strait Of Hormuz : భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. హర్మూజ్ జలసంధి మార్గాన్ని వదులుకోవాల్సిందేనా?

Related Articles

Back to top button