Fish Fry : చేపలు ఇలా వండి తింటున్నారా? ఫ్యాటీ లివర్ ప్రమాదంలో పడ్డట్లే
Fish Fry : చాలామంది చేపలను ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి తినడానికి ఇష్టపడతారు. కానీ అలా చేయడం వల్ల చేపలోని సహజ పోషకాలు తగ్గడమే కాకుండా బాడీలోకి ఎక్కువ మోతాదులో బ్యాడ్ ఫ్యాట్స్ చేరుతాయి.
Fish Fry
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బెస్ట్ ఫుడ్స్‌లో ఒకటిగా చెబుతారు . ముఖ్యంగా సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి రకాలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మైండ్, హార్ట్, లివర్‌ను కాపాడటానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
అయితే ఎంత మంచి ఫుడ్ అయినా దాన్ని మనం వండే విధానాన్ని బట్టే దాని ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఫిష్‌ను వండే పద్ధతి సరిగ్గా లేకపోతే.. అది లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఫ్యాటీ లివర్ ప్రమాదానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చాలామంది చేపలను ఆయిల్‌లో డీప్ ఫ్రై(Fish Fry) చేసి తినడానికి ఇష్టపడతారు. కానీ అలా చేయడం వల్ల చేపలోని సహజ పోషకాలు తగ్గడమే కాకుండా బాడీలోకి ఎక్కువ మోతాదులో బ్యాడ్ ఫ్యాట్స్ చేరుతాయి. ముఖ్యంగా వంట ఆయిల్‌ను పదేపదే మరిగించి వాడటం వల్ల దీనిలో హానికరమైన ఆక్సిడేషన్ సమ్మేళనాలు ఏర్పడతాయి. ఈ కెమికల్స్ కాలేయంపై తీవ్ర ఒత్తిడిని పెంచి.. దీర్ఘకాలంలో ఫ్యాటీ లివర్, ఇతర మెటబాలిక్ ప్రాబ్లెమ్‌కు కారణమవుతాయి.
అంతేకాకుండా పిష్‌లోని అత్యంత కీలకమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ టెంపరేచర్ వద్ద నశించిపోతాయి. మనం వేయించడానికి వాడే ఆయిల్ స్వభావాన్ని బట్టి చేపలో ఉండే హెల్దీ ఫ్యాట్ ఆకృతి పూర్తిగా మారిపోతుంది. దీంతో చేపల వల్ల బాడీకి అందాల్సిన అసలైన ఆరోగ్యం అందకుండా పోతుంది.
ఫ్యాటీ లివర్ బారిన పడకుండా ఉండటానికి చేపలను డీప్ ఫ్రై(Fish Fry) చేయడానికి బదులుగా ఆవిరిపై ఉడికించడం, గ్రిల్ చేయడం , ఉడికించి తీసుకోవడం మంచిది. వంటల్లో ఆయిల్ వాడకాన్ని వీలైనంత తగ్గించాలి. ఒక్కసారి వాడిన ఆయిల్‌ను మళ్లీ వేడి చేసి వాడే అలవాటును పూర్తిగా మానుకోవాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు పద్ధతిగా వండిన చేపలను బ్యాలెన్స్‌డ్ డైట్‌తో పాటు తీసుకోవడం వల్ల లివర్‌కు మంచిది.
ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు చేపలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సమస్య చేపల వల్ల రావడం లేదు. మనం వాడే ఎక్కువ ఆయిల్, ఫ్రై చేసే పద్ధతుల వల్లే వస్తోంది. కాబట్టి సరైన రీతిలో వండుకుని తక్కువగా తింటే ఏ ఇబ్బందీ ఉండదు.

అలాగే లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి షుగర్ ఎక్కువ ఉండే డ్రింక్స్, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం మంచిది. వెయిట్‌ను అదుపులో ఉంచుకుంటూ రోజుకు కనీసం అరగంట అయినా ఏదొక వ్యాయామం చేయడం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం వల్ల కాలేయాన్ని కాపాడుకోవచ్చు.
మొత్తానికి చేపలు అత్యంత పోషకాలు కలిగిన ఫుడ్ అయినా, వాటిని డీప్ ఫ్రై చేసి తరచుగా తింటే మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి గ్రిల్డ్ లేదా స్టీమ్ చేసిన చేపలను మన డైట్‌లో భాగం చేసుకుంటే పూర్తి ప్రయోజనాలను పొందొచ్చు.
Ajit Agarkar : అగార్కర్‌ను కంటిన్యూ చేస్తారా? కట్ చేస్తారా ?.. తేల్చుకోలేకపోతున్న బీసీసీఐ..





