Trade war: ట్రంప్ చర్యలతో తలెత్తిన వాణిజ్య యుద్ధాన్ని భారత్ ఎలా ఫేస్ చేస్తుంది?
Trade war: భారత్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50 శాతం అదనపు టారీఫ్‌లపై కేంద్రం ఘాటుగా స్పందించింది. “ఇది అన్యాయమైన, అసమంజస నిర్ణయం.

Trade war
భారత్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50 శాతం అదనపు టారీఫ్‌లపై కేంద్రం ఘాటుగా స్పందించింది. “ఇది అన్యాయమైన, అసమంజస నిర్ణయం. అంతర్జాతీయ మార్కెట్ల అనిశ్చితిలో మా ఇంధన అవసరాలను తీర్చేందుకు మేము తీసుకుంటున్న నిర్ణయాల్లో తప్పేం లేదు. దేశ ప్రజల ఇంధన భద్రతే మా ప్రాధాన్యత. ఇతర దేశాలు కూడా తమ ప్రయోజనాల కోసం ఏంచేస్తున్నాయో, మేమూ అదే చేస్తున్నాం,” అని విదేశాంగ శాఖ సూటిగా తెలిపింది. అమెరికా ఈ నిర్ణయం తిరిగి పరిగణించాలన్న సంకేతాలను కూడా ఇచ్చినట్లు అయింది.
భారత్‌పై మరోసారి ఆగ్రహం కక్కిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… గతంలో విధించిన 25 శాతం సుంకాన్ని డబుల్ చేస్తూ… 50 శాతం టారీఫ్‌ను ప్రకటించడంతో దాదాపు అన్ని రంగాల్లో కలకలం రేగింది. భారత్–అమెరికా (India US Tariff War)మధ్య వాణిజ్య సంబంధాలపై ఇది భారీ ప్రభావం చూపించనుంది.
టారీఫ్‌ల వెనుక అసలు కారణం ఏమిటి అంటే..భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు(India Russia Oil Trade) చేస్తున్నదే ప్రధాన సమస్య అని ట్రంప్ అంటున్నా కూడా.. ఇది వాణిజ్య సంబంధాల పేరుతో దౌర్జన్య రాజకీయంగా కనిపిస్తోంది. యుద్ధ పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్ అస్థిరంగా మారింది. అలాంటి సమయంలో మార్కెట్ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడమే మన దారి. ఇది అమెరికాకు ఇష్టంలేకపోవడం వల్లే ఈ కొత్త షాక్ అంటూ విదేశాంగ శాఖ సూటిగా తిప్పికొట్టింది.

భారత్ ఎగుమతుల(Trade war)పై తలెత్తే సమస్యలు చూసుకుంటే.. ఈ నిర్ణయం వల్ల అమెరికాకు ఎక్కువగా ఎగుమతి(Trade war) చేసే భారత్ ఉత్పత్తులు తీవ్రమైన ఆటంకాలు ఎదుర్కోవచ్చు. టెక్స్‌టైల్, రెడీమేడ్ గార్మెంట్స్ ధరలు పెరగడం వల్ల మార్కెట్ పోటీ తగ్గిపోవచ్చు. స్టీల్, మెటల్స్ వంటి నిర్మాణ రంగానికి కీలకమైన ఉత్పత్తులపై ఎగుమతులు మందగించవచ్చు. ఫుడ్ ప్రాసెస్డ్ వస్తువులయిన టీ, కాఫీ, మసాలా పౌడర్‌లు వంటి వస్తువుల పై ధరల ప్రభావం ఉండొచ్చు.
నిజానికి ట్రంప్ తీసుకున్న డెసిషన్ కేవలం వాణిజ్య నిర్ణయం కాదని భావిస్తున్న విశ్లేషకులు దీనిని బ్లాక్‌మెయిల్‌గా ముద్ర వేస్తున్నారు.మరోవైపు ఈ నిర్ణయం ఒక ఎకానమీ బ్లాక్‌మెయిల్ మాత్రమేనని రాహుల్ గాంధీ విమర్శించారు. “ఇది భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టే కుట్ర. మోదీ బలహీనత వల్లే ఇలా జరుగుతోంది” అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. శశి థరూర్ కూడా “ఇది అమెరికాలో భారత ఉత్పత్తులకు తలుపు మూయడమే. ప్రత్యామ్నాయాలు ఇప్పటి నుంచే వెతకాలి” అన్నారు. శివసేన నేత ఆదిత్య థాకరే మంత్రుల మౌనంపై కూడా ప్రశ్నించారు.
భారత్ ఎదుర్కొనే తలనొప్పులు ఏంటంటే.. ఎగుమతుల ఆదాయం క్షీణించే అవకాశం ఉంది. ఉత్పత్తిదారులపై(Trade war) మార్కెట్ ఒత్తిడి పెరుగుతుంది. అమెరికా మార్కెట్లో పోటీ తక్కువవడంతో ప్రత్యామ్నాయ దేశాలకు లాభం చేకూరుతుంది.
అయితే దీనిని భారత్ ఎలా ఫేస్ చేస్తుంది అనేదానికి విశ్లేషకులు వివరణ ఇస్తున్నారు. మార్కెట్ డైవర్సిఫికేషన్ అంటే.. అమెరికా కాకుండా ఇతర దేశాల్లో భారత్ ఉత్పత్తులకు అవకాశాలు వెతకడం.రెండోది నూతన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని.. బ్రిటన్, యూరప్ యూనియన్ వంటి దేశాలతో FTAల రూపకల్పన చేయాలి.అంతర్జాతీయ వేదికలయిన WTO, G20లో ఈ దౌర్జన్యాన్ని ప్రశ్నించాలి. అలాగే దేశీయ తయారీ రంగాలైన MSMEలకు ప్రోత్సాహం ఇచ్చి, నూతన ఉత్పత్తులకు మార్కెట్ రూట్లు వెతుక్కోవాలి.