Just SportsLatest News

Gold Medals : ప్రీతి, జాస్మిన్ గోల్డెన్ పంచ్.. హై జంప్‌లోనూ రెండు మెడల్స్

Gold Medals : మహిళల 57 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియా భారత్‌కు పసిడిని అందించింది. ఆమెకు ఇదే తొలి కామన్ వెల్త్ గేమ్స్ మెడల్.

Gold Medals

కామన్ వెల్త్ గేమ్స్‌లో పదో రోజు భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. అంచనాలకు తగ్గట్టే బాక్సింగ్‌లో పతకాల పంట పండింది. ఫైనల్స్‌కు చేరడం ద్వారా 10 పతకాలు ఖాయం చేసిన భారత బాక్సర్లు ఇప్పుడు పసిడి వేటలో దూసుకెళుతున్నారు.

మహిళల బాక్సింగ్‌లో ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా స్వర్ణాలు కైవసం చేసుకున్నారు.  మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ తుది పోరులోనూ దుమ్మురేపింది. కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నా డెల్గాడోపై గెలిచి బంగారు పతకాన్ని ముద్దాడింది.

అలాగే మహిళల 57 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియా భారత్‌కు పసిడిని(Gold Medals) అందించింది. ఆమెకు ఇదే తొలి కామన్ వెల్త్ గేమ్స్ మెడల్. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో  ప్రీతి 54 కేజీల విభాగంలో రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. అనారోగ్య కారణాలతో రెండేళ్ల పాటు బాక్సింగ్ రింగ్‌కు దూరమైన ప్రీతి గతేడాది బాక్సింగ్ ప్రపంచకప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది.

అలాగే 57 కేజీల విభాగంలో జాస్మిన్ ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్‌లో నార్తర్మ్ ఐర్లాండ్‌కు చెందిన మైఖేలా వాల్ష్‌పై అద్భుత విజయాన్ని అందుకుని స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. జాస్మిన్ కెరీర్‌లో ఇది రెండో కామన్ వెల్త్ గేమ్స్ మెడల్. 2022 బర్మింగ్ హామ్ గేమ్స్‌లో ఆమె లైట్ వెయిట్ కేటగిరీలో కాంస్యం సాధించింది. గతేడాది కాలంగా మంచి ఫామ్ కనబరుస్తూ ప్రస్తుత గ్లాస్గో గేమ్స్‌లోనూ అదరగొట్టింది.

మరోవైపు పురుషుల బాక్సింగ్‌లో జాదుమణి సింగ్ రజతం సాధించాడు. 55 కేజీల విభాగంలో స్వర్ణం గెలుస్తాడనుకున్న జాదూమణి సింగ్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన జై డిక్సర్ చేతిలో ఓడిపోయాడు. ఇదిలా ఉంటే పురుషుల ట్రిపుల్ జంప్‌లోనూ భారత అథ్లెట్లు సత్తా చాటారు.

Gold Medals
Gold Medals

ప్రవీణ్ చిత్రవేల్ 16.58 మీటర్ల ఎత్తు ఎగిరి రజతం సాధించగా,  మరో అథ్లెట్ సెల్వ ప్రభు 16.52 మీటర్ల ఎత్తు ఎగిరి కాంస్య పతకం గెలుచుకున్నాడు. అటు పారా అథ్లెటిక్స్‌లోనూ భారత క్రీడాకారులు చిరస్మరణీయ ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు.

పురుషుల షాట్ పుట్‌లో సోనమ్ రాణా స్వర్ణం గెలుచుకోగా, శుభమ్ జుయల్ రజతం సాధించారు. మొత్తంగా ఇప్పటి వరకూ 8 స్వర్ణాలు, 15 రజతాలు, 7 కాంస్యాలు సాధించింది. మొత్తంగా 30 పతకాలతో భారత్‌ ఆరో స్థానంలో కొనసాగుతోంది. బాక్సింగ్, జూడోతో పాటు అథ్లెటిక్స్‌లోనూ మరిన్ని పతకాలు రానుండటంతో హాఫ్ సెంచరీ దాటే అవకాశముంది.ఁ

Mega 158 : మెగా 158 స్పెషల్ వీడియో.. చిరు ఫ్యాన్స్‌కి మైండ్ బ్లాకింగ్ స్టఫ్

Related Articles

Back to top button