Vegetables Water Spraying : మార్కెట్లో కూరగాయలు, ఆకుకూరలపై నీటి తుంపర్లు.. ఇదే ఫ్రెష్‌నెస్ అనుకుంటున్నారా?
Vegetables Water Spraying : నీళ్లు చల్లడం వల్ల వెజిటబుల్స్ చూడటానికి పచ్చగా, ఫ్రెష్‌గా కనిపించడం నిజమే అయినా.. అదే పర్ఫెక్ట్ ఫ్రెష్‌నెస్‌కు గ్యారెంటీ మాత్రం కాదు.
Vegetables Water Spraying
మనం మార్కెట్‌కి వెళ్లినప్పుడు ఆకుకూరలు, వెజిటబుల్స్‌పై చిన్న చిన్న నీటి చుక్కలు మెరుస్తూ(Vegetables Water Spraying) నిగనిగలాడుతూ కనిపిస్తాయి. చూడగానే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి కదా అనుకుని వెంటనే బుట్టలో వేసేస్తుంటాం. అసలు రోజంతా వాళ్లు అలా వాటర్ స్ప్రే చేస్తూ ఉండటం వెనుకున్న అసలు కారణం ఏంటో ఎప్పుడూ కూడా ఆలోచించం.
కేవలం కొనేవారిని ఆకర్షించడానికేనా లేక దీని వెనుక ఏదైనా సైన్స్ దాగుందా అంటే రెండూ ఉన్నాయనే చెప్పాలి. మొక్క నుంచి కోసేసిన తర్వాత కూడా కూరగాయల్లో జీవక్రియలు ఇన్‌డైరెక్టుగా జరుగుతూనే ఉంటాయి. ఆ సమయంలో వాటిలోని నేచురల్ వాటర్ పర్సంటేజ్ వేగంగా ఆవిరైపోతుంది. ముఖ్యంగా కొత్తిమీర, పుదీనా, పాలకూర, చుక్కకూర వంటి ఆకుకూరలు, అలాగే కొన్ని కూరగాయలలో తేమ తగ్గిపోగానే వాడిపోయి ముడుచుకుపోతాయి. అలా జరగకుండా ఉంచడానికే ఈ వాటర్ స్ప్రే చేస్తారు.
ఇలా నీళ్లు చల్లడం వల్ల వెజిటబుల్స్ చూడటానికి పచ్చగా, ఫ్రెష్‌గా కనిపించడం నిజమే అయినా.. అదే పర్ఫెక్ట్ ఫ్రెష్‌నెస్‌కు గ్యారెంటీ మాత్రం కాదు. పైగా అలా ఎప్పుడూ తడిగా ఉంచడం వల్ల కొన్ని రకాల ప్రమాదాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా సరైన గాలి, వెలుతురు, సరిపడా టెంపరేచర్ లేని చోట ఎక్కువ తేమ ఉంటే కూరగాయలు , ఆకుకూరలు త్వరగా కుళ్లిపోవడం లేదంటే జిగురుగా మారడం జరుగుతుంది. కాబట్టి బయట నీటి చుక్కలు మెరుస్తున్నంత(Vegetables Water Spraying )మాత్రాన అవి ఫ్రెష్‌గా ఉన్నాయని ఫిక్స్ అయిపోకూడదు. కొనేటప్పుడు వాటి నేచులర్ కలర్, గట్టితనం, మచ్చలు ఉన్నాయా , ఏదైనా చెడు వాసన వస్తోందా అనేవి కచ్చితంగా గమనించాలి.
కూరగాయలను, ఆకుకూరలను కొన్నాక ఇంటికి తెచ్చిన తర్వాత కూడా స్టోర్ చేసే విధానంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అవి వెంటనే పాడవుతాయి. మార్కెట్లో వారు చల్లిన వాటర్ వల్ల ముందే తడిగా ఉండే ఆకుకూరలను అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే త్వరగా పాడయిపోతాయి. అందుకే వాటిని తెచ్చాక బాగా కడిగి..పొడి బట్టతో తుడిచి, ఆరబెట్టి నిల్వ చేసుకుంటే ఆరోగ్యంతో పాటు చాలా రోజులు పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు.
Face Wrinkles : ముఖంపై ముడతలు మాయమవ్వాలా? ఈ 5 పదార్థాలతోనే నిత్య యవ్వనం మీ సొంతం..





