HealthLatest News

Fatty Liver : ఫేస్‌పై ఈ చిన్న మార్పులు కనిపిస్తున్నాయా? అవి ఫ్యాటీ లివర్ ఇచ్చే సైలెంట్ వార్నింగ్స్..

Fatty Liver : ఫ్యాటీ లివర్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఎలాంటి లక్షణాలు చూపించకుండా లోపల మెల్లగా పెరుగుతుంది. కాబట్టి దీనిని సైలెంట్ డిసీజ్ అంటారు.

Fatty Liver

ఇప్పుడు మారిన లైఫ్ స్టైల్, సరైన ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవడం వల్ల చాలామంది ఫ్యాటీ లివర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గతంలో కేవలం లిక్కర్ తీసుకునే వారిలోనే లివర్‌లో కొవ్వు పేరుకుపోయేది. దీనిని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని పిలిచేవారు.

కానీ ఇప్పుడు లిక్కర్ ఏ మాత్రం అలవాటు లేని వారిలో కూడా ఈ సమస్య బాగా పెరుగుతోంది. దీనిని నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని అంటారు. విచిత్రమేమిటంటే ఈ రోజుల్లో ప్రతి నలుగురిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి.

మన బాడీలో ఏదైనా అవయవం ఇబ్బందికి గురైతే బయటకు కొన్ని సంకేతాలు ఇస్తుంది. కానీ ఫ్యాటీ లివర్(Fatty Liver) స్టార్టింగ్ స్టేజ్‌లో ఎలాంటి లక్షణాలు చూపించకుండా లోపల మెల్లగా పెరుగుతుంది. కాబట్టి దీనిని సైలెంట్ డిసీజ్ అంటారు. అయితే లివర్‌లో వాపు వ్యాధి ఎక్కువయినపుడు ఫేస్,స్కిన్‌పై కొన్ని క్లియర్ తేడాలు కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు.

లివర్‌లో ఫ్యాట్ శాతం పెరిగినప్పుడు ..ఫేస్ ఎప్పుడూ అలసిపోయినట్లు, ఉబ్బినట్లు కాంతిహీనంగా తయారవుతుంది. మెయిన్‌గా కళ్ల కింద వాపు రావడం సాధారణంగా జరుగుతుంది. బాడీలో లిక్విడ్స్ బ్యాలెన్సింగ్‌గా లేకపోవడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం , మెటబాలిజం దెబ్బతినడం వల్ల కొన్ని ఛేంజెస్ వస్తాయి.

కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు బాడీలో మెటబాలిజం మందగించి, పోషకాల లోపం ఏర్పడటంతో చర్మం తన నేచురల్ షైనింగ్‌ను కోల్పోయి పాలిపోయినట్లు మారుతుంది. ఇక సమస్య బాగా ముదిరినప్పుడు శరీరంలో బిలిరుబిన్ అనే పదార్థం ఎక్కువైపోయి కళ్లు, స్కిన్ కూడా పసుపు రంగులోకి మారతాయి. దీనినే మనం కామర్లు అని పిలుస్తాం.

ఇవే కాకుండా స్కిన్‌పై మరికొన్ని లక్షణాలు కూడా బయటపడతాయి. కళ్ల కింద నల్లటి వలయాలు రావడం, ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడటం, స్కిన్ డ్రైగా అయి దురద పెట్టడం వంటివి జరుగుతాయి. కొందరిలో ముఖంపై సన్నటి రక్తనాళాలు పైకి క్లియర్‌గా కనిపిస్తాయి. అంతేకాకుండా ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో ఓవర్ వెయిట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల నెక్ భాగంలో, ఫేస్ చుట్టూ ఉన్న చర్మం బాగా నల్లగా మందంగా మారే అవకాశం ఉంది.

అయితే కేవలం ఫేస్‌పై వచ్చే ఈ మార్పులను మాత్రమే చూసి ఫ్యాటీ లివర్ ఉందని ఫిక్స్ అయిపోకూడదు. ఎందుకంటే ఇతర చిన్న చిన్న ఆరోగ్య సమస్యల వల్ల కూడా స్కిన్‌లో ఇలాంటి మార్పులు రావచ్చు. ఎప్పుడూ కూడా విపరీతమైన వీక్నెస్ ఉండటం, కడుపులో అసౌకర్యం, అనుకోకుండా బరువు పెరగడం లేదా లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు రిపోర్ట్‌లో తేడాలు వచ్చినప్పుడే కాలేయ సమస్య ఉందేమోనని సందేహించాలి.

Fatty Liver
Fatty Liver

దీనికి తోడు పొత్తికడుపు కుడివైపు పైభాగంలో తేలికపాటి నొప్పి కానీ బరువుగా అనిపించడం కానీ జరిగినా అలాగే ఆకలి వేయకపోవడం, వికారం, మానసికంగా గందరగోళంగా ఉండటం, చిన్న దెబ్బ తగిలినా గాయాలు కావడం, యూరిన్ ముదురు రంగులో రావడం, మలం పాలిపోయినట్లు ఉండటం వంటివి కూడా కాలేయం దెబ్బతింటుందనడానికి బలమైన సంకేతాలు.

ఈ సమస్య ఎక్కువ కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మైదా, షుగర్, వేపుళ్లు, డీప్ ఫ్రైలు, జంక్ ఫుడ్ వంటివి తినడం పూర్తిగా బంద్ చేయాలి. ఫైబర్ ఎక్కువ ఉండే ఆకుకూరలు, కూరగాయలు, నట్స్ డైలీ తీసుకోవాలి.

వారానికి కనీసం 150 నిమిషాల పాటు నడక, యోగా ,లేదంటే చిన్నపాటి వ్యాయామాలు చేయడం వల్ల లివర్‌లో పేరుకుపోయిన కొవ్వు మెల్లగా కరిగిపోతుంది. ముఖ్యంగా డయాబెటిస్, ఓవర్ వెయిట్ ఉన్నవారు ఇయర్‌కు ఒకసారి అయినా లివర్ స్కాన్ లేదా ఎల్ఎఫ్టీ బ్లడ్ టెస్ట్ చేయించుకుని జాగ్రత్త పడటం ఎంతో మంచిది.

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర కలల ఎయిర్‌పోర్ట్ రెడీ .. బాబు, పవన్, లోకేష్ భావోద్వేగ కామెంట్స్..

Related Articles

Back to top button