Just SportsLatest News

Jasprit Bumrah : జస్‌ప్రీత్ బుమ్రా గాయం చుట్టూ వివాదం.. బీసీసీఐలో అసలేం జరుగుతోంది..

Jasprit Bumrah : శ్రీలంక టూర్‌కు ప్రకటించిన భారత్ ఫైనల్ జట్టులో మొదట జస్‌ప్రీత్ బుమ్రా పేరు ఉంది. అయితే ఆ తర్వాత జరిగిన ఫైనల్ ఫిట్‌నెస్ టెస్టులో బుమ్రా ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని తేలడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Jasprit Bumrah

భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ నిర్ణయాల తీరుపై ఎప్పుడూ ఏదొక చర్చ నడుస్తూనే ఉంటుంది. తాజాగా శ్రీలంకతో జరగబోయే అత్యంత కీలకమైన 2 టెస్టుల సిరీస్‌కు టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) దూరంగా ఉండటం కలకలాన్నే రేపుతోంది.

అయితే ప్లేయర్ గాయపడటం సహజమే అయినా…ఈసారి వ్యవహారంలో బెంగళూరులోని బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (CoE) మెడికల్ టీమ్‌కు, అలాగే జాతీయ జట్టు సెలెక్షన్ కమిటీకి మధ్య సరైన కమ్యూనికేషన్ లేవనే వార్తలు బయటకు రావడమే ఇప్పుడు గందరగోళానికి దారితీసింది. బుమ్రా(Jasprit Bumrah) ఫిట్‌నెస్ విషయంలో ఒకరికొకరు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోకపోవడం వల్లనే ఈ తలనొప్పి వచ్చిపడిందని స్పష్టమవుతోంది.

నిజానికి శ్రీలంక టూర్‌కు ప్రకటించిన భారత్ ఫైనల్ జట్టులో మొదట జస్‌ప్రీత్ బుమ్రా పేరు ఉంది. అయితే ఆ తర్వాత జరిగిన ఫైనల్ ఫిట్‌నెస్ టెస్టులో బుమ్రా ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని తేలడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఎడమ మోకాలి గాయానికి పొందుతున్న ట్రీట్మెంట్‌లో బుమ్రాకు ఇంకా కాస్త అసౌకర్యం ఉందనే విషయాన్ని డాక్టర్లు ఆలస్యంగా గుర్తించారని.. దీంతో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో శ్రీలంక సిరీస్ నుంచి పక్కన పెట్టాలని హెచ్చరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతోనే బీసీసీఐ వర్గాలు ఒక్కసారిగా కంగారుపడి, చివరి క్షణంలో బుమ్రా స్థానంలో జమ్మూ కశ్మీర్‌కు చెందిన యంగ్ పేసర్ ఔకిబ్ నబీకి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.

అయితే ఇక్కడే అసలు రచ్చ షురూ అయింది. బుమ్రా ఫిట్‌నెస్‌పై బెంగళూరు మెడికల్ సెంటర్ నుంచి సెలెక్టర్లకు వచ్చిన తొలి రిపోర్ట్‌కు, ఇప్పుడున్న సిట్యువేషన్‌కు అస్సలు పొంతన లేకపోవడమే ఈ రచ్చకు మెయిన్ రీజన్.

బుమ్రా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఫిట్‌గా అందుబాటులో ఉంటాడనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇచ్చిన రిపోర్ట్‌తో ఫుల్ కాన్ఫిడెన్స్‌తో సెలెక్టర్లు కళ్లు మూసుకుని జట్టును అనౌన్స్ చేశారు. తీరా మ్యాచ్ టైమ్‌కి సీన్ రివర్స్ అవ్వడంతో ప్రత్యామ్నాయంగా మరొకరిని వెతుక్కున్నారు. ఈ డ్రామా మొత్తం బీసీసీఐ మెడికల్ డిపార్ట్‌మెంట్ పని తీరులోని లోపాలను, వారి పర్యవేక్షణ లోపాన్ని బట్టబయలు చేసింది.

Jasprit Bumrah
Jasprit Bumrah

మెయిన్‌గా విదేశీ గడ్డపై శ్రీలంకతో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడుతున్న సమయంలో, జట్టుకు ఇంపార్టెంట్ అస్త్రంగా ఉండే బుమ్రా వంటి వరల్డ్ క్లాస్ బౌలర్ లేకపోవడం టీమిండియాకు అతిపెద్ద కోలుకోలేని దెబ్బ అని మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. ఆయన గైర్హాజరు జట్టు బౌలింగ్ విభాగాన్ని వీక్ చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు బుమ్రా తప్పుకోవడంతో సడన్ ఎంట్రీ ఇచ్చిన జమ్మూ కశ్మీర్ బౌలర్ ఔకిబ్ నబీకి తన సత్తా నిరూపించుకోవడానికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు. మొత్తానికి బీసీసీఐ చేసిన చిన్న నిర్లక్ష్యం..ఇప్పుడు సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా డిఫెన్స్‌లో పడేలా చేసింది.

UPI Transfer : యూపీఐ పేమెంట్లలో ఆర్‌బీఐ కీలక మార్పులు.. ఇకపై డబ్బులు పంపితే ఆ ప్రాసెస్ తప్పదా?

Related Articles

Back to top button