Just Andhra PradeshJust TelanganaLatest News

Weather : ఎల్‌నినో ఎఫెక్ట్ వర్సెస్ వర్షాలు.. 2 తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఎలా ఉంటుంది?

Weather : మార్నింగ్ సమయంలో చల్లటి గాలులతో ఆహ్లాదకరంగా ప్రారంభమైనా కూడా.. మధ్యాహ్నం అయ్యేసరికి మాత్రం నిన్నటి కంటే ఒకటి రెండు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కాబోతున్నాయి.

Weather

అక్టోబర్ వచ్చిందంటే చాలు చలి గాలులతో వణకాల్సింది పోయి, ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల ఈసారి శీతాకాలంలో కూడా సమ్మర్‌ను తలపించేలా భయంకరమైన ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. అయితే ఈ విపరీతమైన వేడి, షెల్టర్ వెతుక్కునేలా చేస్తున్న ఉక్కపోత నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాస్త ఊరటనిచ్చేలా భారత వాతావరణ కేంద్రం కూల్ కబురు చెప్పింది .

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, మరోవైపు నైరుతి రుతుపవనాల విత్‌ డ్రా వేగవంతం అవ్వడంతో ఏపీ, తెలంగాణలోని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం, ఉక్కపోత కొనసాగినా, జిల్లాల్లో పడే చినుకులు క్లైమేట్‌ను కాస్త చల్లబరచనున్నాయి.

ముఖ్యంగా హైదరాబాద్‌ వాసులకు ఈరోజు వాతావరణం(Weather) కాస్త డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది. మార్నింగ్ సమయంలో చల్లటి గాలులతో ఆహ్లాదకరంగా ప్రారంభమైనా కూడా.. మధ్యాహ్నం అయ్యేసరికి మాత్రం నిన్నటి కంటే ఒకటి రెండు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కాబోతున్నాయి. దీనివల్ల మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు విపరీతమైన ఉక్కపోత తప్పదు. అయితే సాయంత్రానికి మాత్రం ఈ సీన్ మారబోతోంది.

సాయంత్రం వేళ హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు కురిసి సిటీకి చల్లదనాన్ని పంచుతాయని వాతావారణ(Weather) శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా చూస్తే రంగారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూల్ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి. ఆ సమయంలో గంటకు 30- 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉండటంతో..ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Weather
Weather

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బంగాళాఖాతంలోని ఆవర్తన ఎఫెక్ట్ తీర ప్రాంత జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు దక్షిణ కోస్తా , రాయలసీమలోని కొన్ని ఏరియాలలో కూడా చిరుజల్లుల నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ(Weather) శాఖ అధికారులు వెల్లడించారు.

కాబట్టి ఈరోజు ఎవరికైనా బయటకు వెళ్లే ప్లాన్ ఉంటే మాత్రం.. మధ్యాహ్నం పూట వేడి నుంచి కాపాడుకోవడానికి, అలాగే సాయంత్రం అకస్మాత్తుగా కురసే వర్షాలకు తడవకుండా ఉండేలా తగిన జాగ్రత్తలతో బయటకు వెళ్లడం మంచిది.

Second Chance : గోస్టింగ్ చేసే అబ్బాయిలను నమ్మొద్దా? అమ్మాయిలు వారికి మళ్లీ ఛాన్స్ ఇవ్వొద్దా?..

Related Articles

Back to top button