Just TelanganaLatest News

Telangana Government : పేదలకు డబుల్ ధమాకా..అప్లై చేయకపోతే వెంటనే చేసుకోండి..

Telangana Government : కొత్తగా అప్లై చేసుకున్న అర్హులందరికీ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాటికల్లా పెన్షన్ కార్డులు ఇచ్చి, తర్వాత రెగ్యులర్‌గా ప్రతినెలా డబ్బులు క్రెడిట్ చేయడానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

Telangana Government

పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న రేవంత్ సర్కార్ పాలనలో సంక్షేమ పథకాలు నాన్-స్టాప్‌గా దూసుకెళ్తున్నాయి. తెలంగాణలోని సామాన్యులకు, లబ్ధిదారులకు డైరెక్టుగా లాభం చేకూర్చేలా రూపొందించిన కొన్ని పథకాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. కొత్తగా అప్లై చేసుకున్న వారికి ఆర్థిక చేయూతనివ్వడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.

వీటిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆసరా పెన్షన్ల స్కీమ్ గురించి ఒకసారి చూస్తే, సొసైటీలో ఆసరా లేని నిరుపేదలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు నెల నెలా ఆర్థికంగా అభయాన్ని ఇస్తోంది. ఈ స్కీమ్ కింద అర్హులైన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలతో పాటు చేనేత కార్మికులు, గీత కార్మికులకు ప్రతి నెలా రూ. 2,016 చొప్పున తెలంగాణ ప్రభుత్వం డైరెక్టుగా వారి బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తోంది.

ఇక శారీరక వైకల్యం కలిగిన దివ్యాంగులకు ప్రతి నెలా రూ. 4,016 చొప్పున అందిస్తూ వారికి భరోసానిస్తోంది. కొత్తగా అప్లై చేసుకున్న అర్హులందరికీ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాటికల్లా పెన్షన్ కార్డులు ఇచ్చి, తర్వాత రెగ్యులర్‌గా ప్రతినెలా డబ్బులు క్రెడిట్ చేయడానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

మరోవైపు, ఇల్లు లేని ప్రతీ పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడానికి తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతోమందికి ఆసరాగా నిలుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా సొంతంగా స్థలం ఉండి కూడా ఇల్లు కట్టుకోలేకపోతున్న పేదవారికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని విడతల వారీగా 100% సబ్సిడీ రూపంలో అందిస్తున్నారు.

అలాగే అసలు స్థలమే లేని నిరాశ్రయులైన పేదలకు నివాస స్థలాన్ని కేటాయించడంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. రెండు మూడ్రోజుల్లోనే అర్హులకు ఇళ్ల కేటాయింపు ప్రాసెస్ వేగం కానుంది.

ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఏళ్లకు ఏళ్లుగా భూ వివాదాలతో నలిగిపోతున్న రైతులకు శాశ్వత పరిష్కారాన్ని చూపించేలా.. భూ భారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. సమగ్ర భూ సర్వేను నిర్వహించి, ప్రతీ భూకమతానికి స్పెషల్‌గా డిజిటల్ మ్యాప్‌తో కూడిన పక్కా హక్కు పత్రాలను అందజేయడమే దీని ముఖ్య ఉద్దేశం.

Telangana Government
Telangana Government

ధరణి లేదా ఇతర మార్గాల ద్వారా అక్రమంగా పొందిన పాస్ పుస్తకాలన్నిటిని రద్దు చేస్తూ, కేవలం అసలైన హక్కుదారులకు మాత్రమే భూ యాజమాన్య పత్రాలు దక్కేలా ఈ విధానాన్ని సెట్ చేశారు.

దీనికి తోడు వచ్చే పంట కాలం నుంచే ప్రతీ ఎకరానికి కూడా సాగునీరు అందించేలా ప్రాజెక్టుల నీటి సరఫరాను రేవంత్ సర్కార్ ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షిస్తోంది. ఇలా అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అమలవుతున్న ఈ పథకాలకు అర్హులైన వారు వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Curry Leaves : కరివేపాకు కొన్న రెండు రోజులకే నల్లబడిపోతోందా?.. నెల రోజులు తాజాగా ఉంచే సూపర్ చిట్కాలు మీకోసం..

Related Articles

Back to top button