CM Vijay : సీఎం విజయ్‌కు బిగ్ రిలీఫ్.. బ్యాక్ స్టెప్ వేసిన సంగీత
CM Vijay : కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన సంగీత పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్టు న్యాయమూర్తికి తెలిపారు.
CM Vijay
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు భారీ ఊరట లభించింది. విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన ఆయన భార్య సంగీత పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. దీంతో చెంగల్ పట్టు ఫ్యామిలీ కోర్టు విజయ్, సంగీత విడాకుల కేసు ప్రొసీడింగ్స్ ముగిసినట్టు ప్రకటించింది.
విజయ్ టీవీకే పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న వేళ సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లో విజయ్‌పై తీవ్ర ఆరోపణలు కూడా చేసింది. ఒక నటితో సన్నిహితంగా ఉంటూ తనను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ పేర్కొంది. ఆ నటి కారణంగా తమ మధ్య విభేదాలు వచ్చాయని పిటిషన్లో పేర్కొంది.
పిల్లలతో కలిసి తాను విడిగా జీవించడానికి రూ.250 కోట్ల భరణం కోరినట్టు కూడా వార్తలు వచ్చాయి. పిటిషన్‌కు సంబంధించి చాలాసార్లు విచారణ జరిగింది. విజయ్ హాజరుకాకపోయినా ఆయన తరఫున లాయర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంగీతతో రాజీ కోసం కూడా ప్రయత్నించినట్టు వార్తలు వినిపించాయి.
మరోవైపు ఎన్నికల ప్రచార సమయంలో ప్రత్యర్థి పార్టీలు సైతం విజయ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసాయి. సొంత భార్యకు న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం పాలిస్తారంటూ డీఎంకే నేతలు విమర్శలు గుప్పించారు. దీంతో భార్య విడాకుల వ్యవహారం రాజకీయంగా విజయ్‌కు చాలా డ్యామేజీ చేస్తుందని అంతా అనుకున్నారు.
కానీ తమిళ ప్రజలు మాత్రం అవేమీ పట్టించుకోలేదు. విజయ్ వ్యక్తిగత జీవితం వేరు అనేలా రాజకీయపరంగా ఆయన విధానాలు నచ్చి ఓట్లు వేశారు. దీంతో టీవీకే ఊహించని విధంగా సీట్లు సాధించి కాంగ్రెస్, చిన్న పార్టీల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, విజయ్ సీఎంగా తనదైన మార్క్ చూపిస్తూ పాలన చేస్తూ ముందుకెళుతున్నారు.

ఈ మధ్యలో రెండు మూడు సార్లు త్రిషతో కలిసి బయటకు వెళ్లినట్టు వార్తలు వచ్చినా , ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించినా విజయ్ పట్టించుకోలేదు. ఇటీవల డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ త్రిషపై డబుల్ మీనింగ్ డైలాగ్స్ చేసినప్పుడు టీవీకే పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్ట్ చేయించారు. తర్వాత హైకోర్టు స్టాలిన్ కు బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు.
ఇప్పుడు హఠాత్తుగా సంగీత పిటిషన్ విత్ డ్రా చేసుకోవడం సంచలనంగా మారింది. కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన సంగీత పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్టు న్యాయమూర్తికి తెలిపింది. దీనిపై విజయ్(CM Vijay) న్యాయవాదులు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. తాజా పరిణామంతో విజయ్(CM Vijay) అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.
NEET Paper Leak : నీట్ పేపర్ లీక్ కేసులో షాకింగ్ నిజాలు ..మాస్టర్ మైండ్స్‌తో ప్రూఫ్ రీడర్ల స్కెచ్





