Just InternationalJust PoliticalLatest News

Trump : యుద్ధానికి ఎండ్ కార్డ్ పడనుందా ? ట్రంప్ కామెంట్లు ఏం చెబుతున్నాయి?

Trump : కొన్ని నెలలుగా సాగుతున్న యుద్ధంతో అమెరికా ఆయుధశక్తిలో 60 శాతం హరించుకుపోయింది. మళ్లీ ఆయుధాలను పూర్తిస్థాయిలో భర్తీ చేయడానికి అగ్రరాజ్యానికి కనీసం ఐదేళ్ల సమయం పడుతుంది.

Trump

అమెరికా, ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధానికి త్వరలోనే ముగింపు రానుందా ? ఇరాన్ ఆయుధాలు అయిపోయాయని ట్రంప్ చెబుతున్నా.. అసలు అమెరికా దగ్గరే ఆయుధ నిల్వలు తగ్గాయన్న వాదనే ఇప్పుడు అందరూ నమ్ముతున్నారా అంటే అవుననే అనాల్సి వస్తోంది.

పశ్చిమాసియాలో నెలల తరబడి సాగుతున్న యుద్ధం వల్ల ఇప్పటికే అటు అమెరికా, ఇటు ఇరాన్, మధ్యలో ఇజ్రాయిల్ కూడా తీవ్రంగానే నష్టపోయాయి. అయితే ఇరాన్ శక్తిని తక్కువ అంచనా వేసిన అమెరికా దానికి మూల్యం చెల్లించుకుంది. ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికా ఆయుధ నిల్వలు భారీగా తగ్గిపోయాయి.

పైకి ట్రంప్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఇదే వాస్తవమని అంతర్జాతీయ మీడియా తేల్చేసింది. కానీ ట్రంప్ మాత్రం ఇరాన్ దగ్గరే ఆయుధాలు తగ్గిపోయాయని, అది పేద దేశం అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. అందుకే మరోసారి చర్చలకు సిద్ధమని ప్రకటిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

అయితే సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ రిపోర్ట్ ప్రకారం కొన్ని నెలలుగా సాగుతున్న యుద్ధంతో అమెరికా ఆయుధశక్తిలో 60 శాతం హరించుకుపోయింది. మళ్లీ ఆయుధాలను పూర్తిస్థాయిలో భర్తీ చేయడానికి అగ్రరాజ్యానికి కనీసం ఐదేళ్ల సమయం పడుతుందని అంచనా. పైగా దీని కోసం బడ్జెట్‌లో కూడా గతంలో కంటే రెండు,మూడు రెట్లు ఎక్కువ వెచ్చించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే అంతర్జాతీయ మీడియా కథనాలను మాత్రం ట్రంప్ తోసిపుచ్చారు. తమ దగ్గర ఆయుధశక్తి తగ్గిపోలేదని చెబుతున్నారు. కానీ హఠాత్తుగా మళ్లీ చర్చలు అంటూ మాట్లాడడంతో ట్రంప్ ప్రకటనలను ఎవ్వరూ నమ్మడం లేదు.

పైగా ఇరాన్ కు మద్ధతుగా సౌదీ అరేబియా కూడా యుద్ధంలోకి అడుగుపెడుతుందన్న వార్తలు కూడా అమెరికాకు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించేలా చొరవ తీసుకోవాలని ఇజ్రాయిల్ నుంచి కూడా సూచనలు రావడంతో ట్రంప్ చర్చలపై ప్రకటనలు చేస్తున్నారు.

Trump
Trump

ఇప్పటికే ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ మొదలైంది. యుద్ధం అతిత్వరలోనే ముగిసే అవకాశముందంటూ చెప్పిన ట్రంప్(Trump) .. చర్చలు ఫలించే దిశగా ఈ సారి అడుగులు వేగంగా పడుతున్నాయంటూ చెబుతున్నారు.

ట్రంప్(Trump) ప్రకటన చేసిన కొన్ని గంటలకే వైట్ హౌస్ నుంచి ఇరాన్ ప్రభుత్వ పెద్దలతో మధ్యవర్తులు రాజీయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడంతో పాటు ఇరాన్ తన అణుపరీక్షలను పూర్తిగా నిలిపివేయాలన్న అంశాలపైనే ఈ చర్చల పురోగతి ఆధారపడి ఉంది.

Transactional Relationship : కనుమరుగువుతున్న అనుబంధాలు.. ఖాళీ అవుతున్న కుటుంబ బంధాలు

Related Articles

Back to top button