Just EntertainmentLatest News

Toxic Trailer : టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది.. యశ్ మూవీ అంచనాలు పెంచేసింది..

Toxic Trailer : ప్రపంచవ్యాప్తంగా 40 భాషల్లో విడుదల కానున్న టాక్సిక్ పాన్ యూనివర్సల్ మూవీగా నిలవబోతోంది. సాధారణంగా యశ్ అంటేనే యాక్షన్ సీన్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారు.

Toxic Trailer

కేజీఎఫ్‌తో స్టార్ డమ్ తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యశ్ కొత్త మూవీ టాక్సిక్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈమధ్య కాలంలో టాక్సిక్‌పై ఉన్న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అంతా చూస్తూనే ఉన్నాం. మధ్యలో రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ వంటి వాటితో అంచనాలు పెరుగుతూ వచ్చాయి. తాజాగా టాక్సిక్ మూవీ ట్రైలర్(Toxic Trailer) కూడా రిలీజై అంచనాలను మరింత పెంచేసింది.

ప్రపంచవ్యాప్తంగా 40 భాషల్లో విడుదల కానున్న టాక్సిక్ పాన్ యూనివర్సల్ మూవీగా నిలవబోతోంది. సాధారణంగా యశ్ అంటేనే యాక్షన్ సీన్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి టాక్సిక్ 100కు 100 శాతం పండగేనని చెప్పాలి.

మూవీ ప్రకటన సమయంలోనూ, టైటిల్ విడుదల చేసినప్పుడు కూడా ఇది యాక్షన్ మూవీ, పెద్దల కోసం రూపొందిన కల్పిత కథ అంటూ ప్రకటించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. దానికి తగ్గట్టే హాట్ హాట్ సీన్లు, యాక్షన్ సీక్వెన్సులు, వయోలెన్స్ గట్టి మోతాదులోనే ఉన్నాయని తేలిపోయింది. తాజాగా ట్రైలర్(Toxic Trailer) ను చూసిన తర్వాత అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.

ఈ సినిమాలో యష్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. యష్ రాయా, రూమీ పాత్రలను పోషిస్తున్నాడు. అయితే ఈ రెండు పాత్రలు చాలా భిన్నంగా, రహస్యంగా ఉండటం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఒక చిన్న పిల్లాడితో, యష్ పాత్ర అయిన రాయాతో ట్రైలర్ మొదలవుతుంది. తర్వాత కియారా అద్వానీ, నయనతారతో పాటు తారా సుతారియా, హుమా ఖురేషి, అక్షయ్ ఒబెరాయ్ వంటి కీలక పాత్రలను పరిచయం చేశారు.

యశ్ భిన్నమైన క్యారెక్టరైజేషన్ తో కనిపించడంతో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందనేది తెలుస్తోంది. కేజీఎఫ్ సిరీస్ ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందో అందరికీ తెలుసు. కేజీఎఫ్ మొదటి పార్ట్ తోనే యశ్ క్రేజ్ తారాస్థాయికి వెళ్లింది. ఆ తర్వాత నుంచి ఈ రాకింగ్ స్టార్‌పై అంచనాలు పెరిగిపోతూ ఉన్నాయి. దానికి తగ్గట్టే టాక్సిక్ లాంటి భారీ ప్రాజెక్ట్ ప్రకటించడంతో పాన్ యూనివర్స్ స్థాయికి అంచనాలు చేరాయి.

Toxic Trailer
Toxic Trailer

మలయాళంలో ట్యాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరున్న గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని అత్యంత స్టైలిష్‌గా, హాలీవుడ్ స్థాయి విజువల్ టేకింగ్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రతీ ఫ్రేమ్‌లో ఆ రిచ్‌నెస్ కనిపిస్తోంది. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేష్ లాంటి యాక్టర్స్ నటిస్తుండడంతో సినిమాపై భారీ స్థాయిలో బజ్ నడుస్తోంది.

గోవా బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ వయోలెన్స్ యాక్షన్ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్తు 26న టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Rent A Boyfriend : అమ్మాయిలూ..రెంట్ బాయ్‌ఫ్రెండ్ డేటింగ్ ట్రాప్‌లో పడుతున్నారా? జాగ్రత్తగా ఉండాలని సీపీ వార్నింగ్

Related Articles

Back to top button