Siraj : సిరాజ్ మెరుపు బ్యాటింగ్.. వార్మప్ మ్యాచ్‌లో భారత్ విజయం
Siraj : లంక ఎలెవన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి రోజు 45 ఓవర్లలో 207 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది.
Siraj
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు భారత్‌కు జోష్ వచ్చింది. లంక ఎలెవన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి రోజు 45 ఓవర్లలో 207 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది. రెండో ఇన్నింగ్స్ గిల్ బ్యాటింగ్‌కు దిగడం, జైస్వాల్ హాఫ్ సెంచరీతో టచ్ లోకి రావడం అభిమానులకు సంతోషాన్నిచ్చాయి.
చివర్లో సిరాజ్(Siraj) హ్యాట్రిక్ సిక్సర్లతో మ్యాచ్‌ను గెలిపించడం హైలెట్‌గా నిలిచింది. మూడోరోజు భారత్ 357 పరుగుల దగ్గరే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక ఎలెవన్‌ను భారత బౌలర్లు కట్టడి చేసి.. వెంటవెంటనే వికెట్లు తీసారు. ఓపెనర్ నిషాన్ మధుష్క 63, నిపున్ ధనంజయ 46, బండార 35 పరుగులతో పర్వాలేదనిపించారు. దీంతో లంక ఎలెవన్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 200 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది.
భారత బౌలర్లలో జడేజా 2 , గుర్నూర్ బ్రార్ 2, ప్రసిధ్ కృష్ణ 1, సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు. తర్వాత 207 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు గిల్ , జైస్వాల్ మంచి ఆరంభాన్నే ఇచ్చారు. టార్గెట్ ఛేదించే ఉద్దేశంతోనే దూకుడుగా బ్యాటింగ్ చేశారు.
గాయంతో రెండు రోజులు మైదానంలోకి దిగని గిల్.. ఫిట్నెస్ సాధించి బ్యాటింగ్ చేయడం టీమ్ మేనేజ్మెంట్‌కు రిలీఫ్ ఇచ్చింది. గిల్ , జైస్వాల్ తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించారు. గిల్ 44 పరుగులకు ఔటవగా, జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిగిలిన బ్యాటర్లకు ప్రాక్టీస్ కావాలన్న ఉద్దేశంతో జైస్వాల్ 61 రన్స్‌కు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.

తర్వాత పంత్ 28, జురెల్ 17 పరుగులకు ఔటవగా.. జడేజా 22 పరుగులు చేశాడు. ఈ దశలో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనే అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా చివర్లో సిరాజ్(Siraj) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు. సిక్సర్లతో మ్యాచ్‌ను గెలిపించాడు.
చివరి రెండు ఓవర్లలో విజయం కోసం 23 పరుగులు చేయాల్సి ఉండగా సిరాజ్ నాలుగు సిక్సర్లు బాదాడు. చివరి 6 బంతుల్లో 16 రన్స్ చేయాల్సినప్పుడు హ్యాట్రిక్ సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు. సిరాజ్ 15 బంతుల్లోనే 1 ఫోర్, 4 సిక్సర్లతో 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో తొలి టెస్టుకు ముందు భారత బ్యాటర్లందరికీ మంచి ప్రాక్టీస్ లభించినట్టయింది.





