IND vs PAK : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్లాష్‌కి కొత్త కౌంట్‌డౌన్ స్టార్ట్..జపాన్ వేదికగా మహా సంగ్రామం
IND vs PAK : జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఈ మెగా క్రీడా పండుగ ఆసియా గేమ్స్ 2026 జరుగబోతోంది.
IND vs PAK
భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం 22 గజాల పిచ్‌పై జరిగే గేమ్ మాత్రమే కాదు.. కోట్లాది మంది గుండెచప్పుడు పెంచే ఒక ఎమోషన్. క్రీడా ప్రపంచం మొత్తాన్ని కట్టిపడేసే ఈ హై-టెన్షన్ వార్కి ఈసారి జపాన్ వేదిక కాబోతోంది.
ఆసియా గేమ్స్ 2026 రచ్చలో టీమిండియా, పాకిస్తాన్(IND vs PAK) క్లాష్ అవ్వడానికి అభిమానులకు కేవలం రెండే రెండు ఆప్షన్లు మిగిలాయి. జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఈ మెగా క్రీడా పండుగ జరుగబోతోంది. ఆసియా క్రీడల హిస్టరీలోనే నాలుగోసారి క్రికెట్‌ను నిర్వహిస్తూ ఉండగా.. ఉమెన్స్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 17 నుంచే షురూ కాబోతున్నాయి.
మెన్స్ సమరం సెప్టెంబర్ 24 నుంచి కలర్ఫుల్గా మొదలవుతుంది. పోయినసారి హాంగ్జౌలో జరిగిన ఆసియా గేమ్స్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో గోల్డ్ మెడల్స్ కొల్లగొట్టిన టీమిండియా, ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో మైదానంలోకి దిగుతోంది. అయితే ఈ టోర్నీలో జరిగే ప్రతి మ్యాచ్‌కూ అంతర్జాతీయ టీ20 హోదా ఉండటం విశేషం.
రెండు దేశాల అభిమానులు ఎదురుచూస్తున్న ఆ ఇండో-పాక్ యుద్ధం ఎప్పుడు అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే గ్రూప్ స్టేజ్ మ్యాచుల్లో ఈ రెండు జట్లు ఏమాత్రం తలపడే ప్రసక్తే లేదు. వీళ్లిద్దరు ఫేస్ టు ఫేస్ నిలబడాలంటే కేవలం రెండే రెండు సార్లు ఫుల్ వర్కవుట్ అవ్వాలి.
మొదటిది గోల్డ్ మెడల్ కోసం ఆడే గ్రాండ్ ఫైనల్ యుద్దం, రెండోది కాంస్య పతకం కోసం ఆడే థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్. అంటే ఇండియా, పాకిస్తాన్(IND vs PAK) రెండూ తమ ప్రత్యర్థులను తొక్కుకుంటూ ఫైనల్ చేరుకోవాల్సిందే.. లేదంటే సెమీస్‌లో ఓడిపోయి బ్రాంజ్ మెడల్ కోసం మ్యాచ్‌లో ఫేస్ టు ఫేస్ తలపడాలి. ఈ రెండు పాయింట్స్ దగ్గర మాత్రమే అభిమానులు కోరుకునే ఆ అసలైన క్రికెట్ డ్రామా క్లియర్ అవుతుంది.
ఇక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో.. మెన్స్ విభాగంలో టాప్ సీడెడ్ జట్లుగా ఉన్న ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలకు నేరుగా క్వార్టర్స్‌కు ఎంట్రీ దొరికింది. మిగిలిన స్పాట్స్ కొట్టేయడానికి గ్రూప్-ఎ లో ఆఫ్ఘనిస్తాన్, జపాన్, నేపాల్, గ్రూప్-బి లో హాంగ్‌కాంగ్, మలేషియా, ఒమన్ మధ్య గట్టి పోటీ సాగబోతోంది.

మరోవైపు హర్మాన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత ఉమెన్స్ టీమ్ క్వార్టర్ ఫైనల్లో జపాన్‌తో ఢీకొట్టబోతోంది. ఈ మ్యాచ్‌లో మనోళ్లు గెలిస్తే సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో కానీ చైనాతో కానీ తలపడాల్సి వస్తుంది. ఇక పాకిస్థాన్ ఉమెన్స్ టీమ్ థాయిలాండ్‌తో క్వార్టర్స్ పోరులో తలపడబోతుంది .
ఈ ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్స్ కన్ఫమ్ చేసుకోవడానికి బీసీసీఐ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా అత్యంత బలమైన జట్లను మైదానంలోకి దించుతోంది. ఉమెన్స్ కేటగిరీలో కెప్టెన్‌గా హర్మాన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన టీమ్‌ను ముందుండి నడిపిస్తారు.
ఇక మెన్స్ కేటగిరీకి వచ్చేసరికే స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోగా, యువ సంచలనం తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా దిగబోతున్నాడు. యంగ్ బ్యాటింగ్ రికార్డ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కడం ఈసారి బిగ్ హైలైట్‌గా నిలిచింది.
Phoebe Gates : బిల్ గేట్స్ కూతురు డిజిటల్ చోరీ చేశారా? కూకీ స్టఫింగ్ అనేది అంత పెద్ద స్కామ్నా?





